PM Modi’s interaction with the BJP Karyakartas from Tamil Nadu
April 13th, 04:00 pm
PM Modi interacted with BJP Karyakartas from Tamil Nadu during the ‘Mera Booth, Sabse Mazboot Samvaad’, acknowledging their relentless grassroots efforts in strengthening the NDA’s outreach across the state.PM Modi addresses an enthusiastic public rally in Madurai, Tamil Nadu
March 01st, 04:30 pm
PM Modi addressed a massive public rally in Madurai, beginning his speech with deep reverence for Tamil Nadu’s spiritual heritage. He said he had just visited Tirupparankundram and received the darshan of Bhagwan Murugan, describing it as a truly pine experience. He said he prayed for the prosperity of Tamil Nadu and the entire nation.తమిళనాడులోని మధురైలో వివిధ మౌలిక సదుపాయాల పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 01st, 03:30 pm
పవిత్రమైన, చారిత్రక నగరమైన మధురైని సందర్శించడం గౌరవంగా భావిస్తున్నాను. మీనాక్షి అమ్మవారికీ, భగవాన్ సుందరేశ్వరుడికీ భక్తిపూర్వక ప్రణామాలు. తమిళనాడు అభివృద్ధి ప్రస్థానంలో నేటి ఈ కార్యక్రమం గర్వించదగ్గ ఘట్టం. దాదాపు రూ. 4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసుకున్నాం. ఈ ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉద్యోగావకాశాలను కల్పించి, లక్షలాది జీవితాల్లో మార్పును తెస్తాయి. రైతులు మార్కెట్లకు చేరుకోవడానికి మెరుగైన రోడ్లు, భక్తులకూ పర్యాటకులకూ సులభతరమైన ప్రయాణం, వ్యాపారులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించడమంటే ప్రజలను సాధికారత దిశగా నడిపించడమే.మదురైలో రూ.4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభం సహా దేశానికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
March 01st, 03:00 pm
“గడచిన పన్నెండేళ్లుగా తమిళనాడు హైవే నెట్‌వర్క్‌లో కేంద్ర ప్రభుత్వం గణనీయ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో 2014 నుంచి 4 వేల కిలోమీటర్లకు పైగా హైవేలు నిర్మితమయ్యాయి” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మరక్కణం-పుదుచ్చేరి సెక్షన్ 4 వరుసల రహదారితోపాటు తీరప్రాంత పర్యాటకం, వాణిజ్యల బలోపేతానికి రూ.2,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, పరమకుడి-రామనాథపురం మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించేందుకు రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడి పెడతారని పేర్కొన్నారు. ఈ రెండో ప్రాజెక్ట్ వల్ల రామేశ్వరం, ధనుష్కోటి వంటి ప్రదేశాలకు ప్రయాణ సౌలభ్యం గణనీయంగా మెరుగవుతుందని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల నిరంతర రవాణాకు భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 14th, 11:00 am
పొంగల్ ఈ రోజున నిజంగా ఓ అంతర్జాతీయ పర్వదినంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగాగల తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా దీన్ని అపరిమిత ఉత్సాహంతో నిర్వహించుకుంటారు. అటువంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే, ఈ ప్రత్యేక పండుగ వేడుకల్లో మీ సంతోషంలో పాలుపంచుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. తమిళుల జీవనంలో పొంగల్ పంగుడ మధురానుభూతి. భూమాత, అన్నదాతలతోపాటు సూర్య భగవానునిపై మానవాళి కృతజ్ఞతకు ఈ పండగ ఓ ప్రతీక. ప్రకృతితో, కుటుంబంతో, సమాజంతో సామరస్యానికిగల ప్రాధాన్యాన్ని ఇది మనకు అవగతం చేస్తుంది. ఇదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు వంటి పేర్లతో ఈ పర్వదినాన ప్రజలు సంబరాల్లో తలమునకలై ఉన్నారు. దేశవిదేశాల్లోని తమిళ సోదరీసోదరులందరికీ పొంగల్ సహా ఈ పండుగల వేళ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొంగల్ ప్రపంచ పండుగలా మారింది: పీఎం
January 14th, 10:45 am
ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తమిళంలో శుభాకాంక్షలు చెప్పిన శ్రీ మోదీ... “ఈ రోజు పొంగల్ ఒక ప్రపంచ పండుగలా మారింది” అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా ఉత్సాహంగా పొంగల్ని నిర్వహించుకుంటున్నారనీ, తానూ వారిలో ఒకడినని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక పండుగను అందరితో కలిసి జరుపుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తమిళుల జీవితంలో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి లాంటిదనీ... ఇది రైతుల శ్రమకు, భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ అని శ్రీ మోదీ తెలిపారు. అదే సమయంలో ప్రకృతిలో, కుటుంబంలో, సమాజంలో సమతుల్యత దిశగా మనకు ఈ పండుగ మార్గనిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు, ఇతర పేర్లతో ఈ పండుగ చేసుకుంటున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా దేశవిదేశాల్లో ఉన్న తమిళ సోదరీ సోదరులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.తమిళనాడు తూత్తుకుడిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
July 26th, 08:16 pm
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, నా కేబినెట్ సహచరులు కింజరపు రామమోహన్ నాయుడు గారు, డా. ఎల్. మురుగన్ గారు, తమిళనాడు మంత్రులు తంగం తెన్నరసు గారు, డా. టి.ఆర్.బి. రాజా గారు, పి. గీతా జీవన్ గారు, అనితా ఆర్. రాధాకృష్ణన్ గారు, ఎంపీ కణిమొళి గారు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మన ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ గారు, తమిళనాడు సోదర సోదరీమణులారా!తమిళనాడు తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
July 26th, 07:47 pm
తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రాంతీయంగా అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరచడంతోపాటు.. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంచేలా, శుద్ధ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ రంగాల్లో వరుసగా చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ వీర సైనికులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. సాహసికులైన వీరయోధులకు ప్రణమిల్లారు. దేశం కోసం ప్రాణత్యాగానికీ వెనుకాడని అమరులకు మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.రాజస్థాన్‌లోని బికనీర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
May 22nd, 12:00 pm
రాజస్థాన్ గవర్నర్ హరిభావు భాగ్డే, ప్రజాదరణ సొంతం చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ భజన్ లాల్, మాజీ ముఖ్యమంత్రి, సోదరి వసుంధర రాజే, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వనీ వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి, ప్రేమ్ చంద్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర మంత్రులకు, సహ పార్లమెంట్ సభ్యుడు మదన్ రాథోడ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియ సోదర, సోదరీమణులకు..రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 22nd, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారినీ, అలాగే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారినీ స్వాగతించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రజాప్రతినిధుల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులకు, పౌరులకు అభినందనలు తెలియజేశారు.తమిళనాడులోని రామేశ్వరంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం
April 06th, 02:00 pm
తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, డాక్టర్ ఎల్.మురుగన్ గారు… తమిళనాడు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదరసోదరీమణులారా నమస్కారం.తమిళనాడులోని రామేశ్వరంలో రూ.8,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 06th, 01:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని రామేశ్వరంలో రూ.8,300 కోట్లకు పైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ముందుగా, ఆయన భారత్‌లో తొలి వెర్టికల్ లిఫ్ట్ సముద్ర రైలు వంతెన అయిన కొత్త పంబన్ రైలు వంతెనను ప్రారంభించారు. రోడ్ బ్రిడ్జ్ వద్ద నుంచి ఒక రైలును, ఓ నౌకను ప్రారంభించారు. వంతెన కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూశారు. అనంతరం రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈరోజు శ్రీరామనవమి శుభదినమని అన్నారు. ఈరోజు ఉదయం అయోధ్యలోని భవ్య రామ మందిరంలో రామ్ లల్లా నుదుటిన సూర్యుని దివ్య కిరణాలు మహత్తర తిలకంగా అభిషేకించాయని తెలిపారు. “భగవాన్ శ్రీరాముని జీవితం, ఆయన ఉత్తమ పాలనా స్ఫూర్తి దేశ నిర్మాణానికి ఒక గొప్ప పునాది” అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని సంగం నాటి సాహిత్యంలో కూడా భగవాన్ శ్రీరాముడి ప్రస్తావన ఉందని ఆయన అన్నారు. రామేశ్వరంలోని పవిత్ర భూమి నుంచి దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.రామనవమి నాడు తమిళనాడు వెళుతున్న ప్రధాని
April 04th, 02:35 pm
ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. తమిళనాడులో రోడ్డు, రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేస్తారు. వీటి విలువ సుమారుగా రూ.8,300 కోట్లు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.