భారత్-థాయ్‌లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన
April 04th, 07:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 3, 4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా “బంగాళాఖాత ప్రాంత బహుళరంగ సాంకేతిక-ఆర్థిక సహకార కూటమి” (బిమ్‌స్టెక్) 6వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ పైటోన్‌టాన్ షినవత్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బ్యాంకాక్‌లోని ప్రధాన పరిపాలన భవనంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.Prime Minister’s visit to Wat Pho
April 04th, 03:36 pm
PM Modi with Thai PM Paetongtarn Shinawatra, visited Wat Pho, paying homage to the Reclining Buddha. He offered ‘Sanghadana’ to senior monks and presented a replica of the Ashokan Lion Capital. He emphasized the deep-rooted civilizational ties between India and Thailand, strengthening cultural bonds.థాయిలాండ్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
April 03rd, 08:42 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధికారిక థాయిలాండ్ పర్యటనలో భాగంగా ఈరోజు బ్యాంకాక్‌లో థాయిలాండ్ ప్రధాని శ్రీ పేటోంగ్‌టార్న్ షినవత్రాతో భేటీ అయ్యారు. ప్రభుత్వ అధికారిక నివాసానికి చేరుకున్న ప్రధానమంత్రికి షినవత్రా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. వీరిరువురి మధ్య ఇది రెండో సమావేశం. 2024 అక్టోబర్‌లో వియంటియాన్‌లో జరిగిన ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ఇరువురు నేతలు తొలిసారిగా భేటీ అయ్యారు.థాయ్ లాండ్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
April 03rd, 03:01 pm
మార్చి 28న ఇక్కడ సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణ నష్టానికి భారత ప్రజల తరఫున నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
April 03rd, 11:01 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ చేరుకున్నారు. ఆయన BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రాతో కూడా చర్చలు జరుపుతారు.థాయ్ లాండ్ , శ్రీలంక పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
April 03rd, 06:00 am
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేతోంగ్‌తార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు ఆ దేశంలో అధికారిక పర్యటనతో పాటు ఆరో బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొనేందుకు ఈ రోజు బయలుదేరుతున్నాను.2025 ఏప్రిల్ 03-06 వరకు థాయిలాండ్ మరియు శ్రీలంకలలో ప్రధానమంత్రి పర్యటన
April 02nd, 02:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి (ఏప్రిల్ 3-4, 2025) థాయిలాండ్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఆహ్వానం మేరకు (ఏప్రిల్ 4-6, 2025) శ్రీలంకకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు.భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు... థాయిలాండ్ ప్రధానికి భారత ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 10:20 pm
భారత్ 76వ గణతంత్ర దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా థాయిలాండ్ ప్రధాని పైతాంగ్‌తార్న్ చినవత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి ప్రతిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ధన్యవాదాలు వ్యక్తం చేశారు.థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్‌టర్న్ చినావత్రా చూపిన ఔదార్యానికి ప్రధానమంత్రి హర్షం
October 30th, 09:39 pm
థాయ్‌లాండ్ ప్రధాని గౌరవ పేటోంగ్‌టర్న్ చినావత్రా బ్యాంకాక్‌లోని లిటిల్ ఇండియా పహురత్‌లో ఏర్పాటు చేసిన ‘అమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి ఫెస్టివల్ 2024’ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారత్- థాయ్‌లాండ్ దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని అన్నారు.థాయిలాండ్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
October 11th, 12:41 pm
తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియాంటియాన్‌లో ఈరోజు థాయ్‌లాండ్ ప్రధాని శ్రీమతి పేటోంగ్‌టర్న్ చినావత్రాతో సమావేశమయ్యారు. ఈ ఇరువురు ప్రధాన మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి.థాయిలాండ్ ప్రధానిగా ఎన్నికైన పైటాంగ్ధన్ చిన్నావత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
August 18th, 11:53 am
థాయిలాండ్ నూతన ప్రధానిగా పైటాంగ్ధన్ చిన్నావత్ ఎన్నికైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆమెకు అభినందనలు తెలిపారు. నాగరికత, సంస్కృతి, ప్రజల మధ్య పరస్పర సంబంధాలే బలమైన పునాదులుగా ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢతరంగా మలచాలని ఆసక్తిని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.