‘పౌర పురస్కారాల ప్రదాన కార్యక్రమం-II’కు హాజరైన ప్రధానమంత్రి

May 28th, 09:27 am

ఈ రోజు నిర్వహించిన ‘పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం -II ’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.‘‘పద్మ పురస్కారాల విజేతలు మన సమాజానికి చెప్పుకోదగిన తోడ్పాటును అందించారు. పద్మ పురస్కారాలను అందుకున్న వ్యక్తుల జీవన యాత్ర అత్యంత ప్రేరణాత్మకంగా ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

శ్రీ శివానంద బాబా మృతికి ప్రధాని సంతాపం

May 04th, 10:58 am

కాశీ నివాసి, యోగా సాధకుడు శ్రీ శివానంద బాబా మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

ముంబయి ‘వేవ్స్‌ సమ్మిట్‌’లో ప్రధానమంత్రి ప్రసంగం

May 01st, 03:35 pm

వేవ్స్‌ సమ్మిట్‌ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్‌, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!

వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

May 01st, 11:15 am

మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ - వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు, రాయబారులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాకు చెందిన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, సృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతిని, సృజనాత్మకతను, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారు. అలాగే ఈ సదస్సు సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారు. అదే సమయంలో కళాకారులు, రూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.

పౌర పురస్కారాల ప్రదానోత్సవం - Iకు ప్రధాని హాజరు

April 28th, 09:46 pm

పద్మ అవార్డులను అందించే పౌర పురస్కారాల ప్రదానోత్సవం-1కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ‘‘వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు.. వారు చేసిన సేవ, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని పొందారు’’ అని శ్రీ మోదీ అన్నారు.

పద్మ పురస్కారాలు- 2025 విజేతలకు ప్రధానమంత్రి అభినందనలు

January 25th, 09:27 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సంవత్సరానికి పద్మ పురస్కారాలను గెలుచుకొన్న వారందరికి ఈ రోజు అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాలను అందుకోనున్న వారిలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తూ, వారి వారి రంగాల్లో మక్కువను పెంచుకొంటూ, కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారని, వారిలోని ఈ సద్గుణాలు ఎంతో మంది జీవనంపై సానుకూల ప్రభావాన్ని ప్రసరించాయని ఆయన అన్నారు.

పద్మ పురస్కార గ్రహీత, ప్రముఖ వృక్షశాస్త్ర నిపుణులు డా. కేఎస్ మణిలాల్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

January 01st, 10:29 pm

‘‘పద్మ పురస్కార గ్రహీత, ప్రముఖ వృక్ష శాస్త్ర నిపుణులు డాక్టర్ కేఎస్ మణిలాల్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వృక్షశాస్త్రంలో ఆయన చేసిన కృషి భవిష్యత్తులో వృక్షశాస్త్ర నిపుణులకు, పరిశోధకులకు మార్గనిర్దేశం చేస్తుంది. కేరళ చరిత్ర, సంస్కృతిపై సైతం ఆయన ఆసక్తి చూపించేవారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికీ, స్నేహితులకూ నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.