India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవం ఆరో ఎడిషన్‌లో ప్రధాని ప్రసంగం
October 09th, 02:51 pm
గౌరవ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్, ఆవిష్కర్తలు, నాయకులు, ఫిన్‌టెక్ రంగ పెట్టుబడిదారులు, సోదరీ సోదరులారా! మీ అందరికీ ముంబయికి హృదయపూర్వక స్వాగతం!ముంబయిలో నిర్వహించిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 09th, 02:50 pm
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’ (అంతర్జాతీయ సాంకేతికార్థిక సదస్సు)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తొలుత ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ముంబయిని ఇంధన, వాణిజ్య నగరంగా, అపార అవకాశాల కూడలిగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధానమంత్రి, తన మిత్రుడైన గౌరవనీయ కీర్ స్టార్మర్‌ను ప్రత్యేకంగా స్వాగతిస్తూ- ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.రోజ్ గార్ మేళా కింద 51,000 పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 26th, 11:23 am
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 51,000 మందికి పైగా యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ఈరోజు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మీ యువతకు బాధ్యతల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం మీ కర్తవ్యం. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం. కార్మికుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవడం మీ కర్తవ్యం. మీరు మీ విధులను ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణంపై దాని ప్రభావం మరింత గణనీయంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను.ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 26th, 11:00 am
ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి 51,000కి పైగా నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు. భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో యువతకు కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్గత భద్రతను పెంపొందించటం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడటం, కార్మికుల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడం వీరి బాధ్యతలని పేర్కొన్నారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో చూపించే చిత్తశుద్ధి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. విధుల నిర్వహించే విషయంలో ఈ యువత అత్యంత అంకితభావంతో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తూ, ఈకామర్స్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఓఎన్‌డీసీ: ప్రధానమంత్రి
January 02nd, 10:23 am
చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, ఈ-కామర్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఓఎన్‌డీసీ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. అభివృద్ధి, సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు.