పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
March 24th, 02:05 pm
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, దాని వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు, నేను పార్లమెంటు ఎగువ సభ ముందు, నా తోటి పౌరుల ముందు నిలబడి, ఈ ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తున్నాను. మూడు వారాలకు పైగా ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. భారతదేశానికి కూడా ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మన వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు లాంటి అత్యవసర వస్తువుల సాధారణ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. వారి భద్రత, జీవనోపాధి భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధిలో అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇది కూడా భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, రాజ్యసభ నుంచి శాంతి, చర్చల ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజెప్పేలా ముక్తకంఠంతో మన స్వరం వినిపించడం అవసరం.పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలను ఉద్దేశించి రాజ్యసభలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 24th, 02:00 pm
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ, ఇవాళ రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మూడు వారాలుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొందని, ఇది భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ ఘర్షణలు భారత వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నాయని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల వంటి నిత్యావసరాల సరఫరాపై ప్రభావం చూపుతున్నట్లు పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ, అక్కడ పనిచేస్తున్నారని.. వారి భద్రత, జీవనోపాధి ప్రధానంగా ఆందోళన కలిగించే అంశంగా మారినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన విదేశీ నౌకల్లో అధిక సంఖ్యలో భారత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పార్లమెంటులోని ఎగువ సభ నుంచి శాంతి, చర్చలపై ఉమ్మడి స్వరాన్ని వినిపించటం అత్యంత అవసరం అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేసారు.నెక్ట్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 12th, 10:47 pm
ఇవాళ మార్చి 12వ తేదీ చరిత్రాత్మకమైన రోజు. మార్చి 12, 1930న సబర్మతి ఆశ్రమం నుంచి మహాత్మాగాంధీ దండి యాత్ర ప్రారంభించారు. ఇది భారత స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటన. ఈ ప్రయాణం దేశంలోని ప్రతి మూలను తాకింది. దీని ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించటం. ఈ చరిత్రాత్మక రోజుకు నేటితో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులుగా మనం మరో ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రయాణమే అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) కోసం అడుగులు వేయటం. మన లక్ష్యం ఒకటే. మన గమ్యం ఒకటే - అభివృద్ధి చెందిన భారతదేశం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఇలాంటి సదస్సుల్లో జరిగే మేధోమధనం, వాటి ద్వారా లభించే సారాంశం కీలక పాత్ర పోషిస్తాయి. నెక్ట్స్ సమ్మిట్ కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఎంతో మందిలో పాత మిత్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ నా నమస్కారాలు.ఎన్‌ఎక్స్‌టీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
March 12th, 08:30 pm
చారిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఐటీవీ నెట్‌వర్క్ నిర్వహించిన ఎన్ఎక్స్‌టీ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రస్తుత లక్ష్యానికి మధ్య ఉన్న పోలికలను ఆయన వివరించారు. 1930 నాటి దండి యాత్ర దేశాన్ని స్వాతంత్య్రం వైపు ఎలాగైతే ఏకం చేసిందో ప్రస్తుత 'వికసిత భారత్' మిషన్ కూడా 140 కోట్ల భారతీయుల ఉమ్మడి లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. “చారిత్రాత్మక దండి యాత్ర ప్రారంభమై దాదాపు 100 సంవత్సరాలు గడిచిన తరుణంలో నేడు భారతీయులమైన మనం మరోసారి 'వికసిత భారత్' సాధన కోసం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం” అని ప్రధాని పేర్కొన్నారు.India is now moving beyond energy security towards the mission of energy independence: PM Modi at the India Energy Week 2026
January 27th, 10:15 am
In his address at the inauguration of India Energy Week 2026, PM Modi remarked that today India is a land of immense opportunities for the energy sector. He said that the recently signed India-European Union agreement will bring immense opportunities for India and European nations. As India’s energy sector offer investment opportunities worth $500 billion, the PM called upon the global community with the message: Make in India, Innovate in India, Scale with India, Invest in India.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
January 27th, 10:08 am
ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గోవాలో జరుగుతున్న ఎనర్జీ వీక్ కొత్త సంచికలో దాదాపు 125 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఇంధన భద్రత, సుస్థిర భవిష్యత్తు గురించి చర్చించేందుకు వారు భారత్‌కు వచ్చారని చెబుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ స్వాగతం పలికారు.జులై 18న... బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటన
July 17th, 11:04 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18న బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం 11:30 గంటలకు బీహార్ లోని మోతీహారీలో రూ. 7,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు. అనంతరం, ఒక బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో ప్రధానమంత్రి భేటీ
July 06th, 01:48 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అర్జెంటీనా అధ్యక్షుడు గౌరవ జేవియర్ మిలీతో భేటీ అయ్యారు. కాసా రోసాడాకు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు మిలీ సాదరంగా స్వాగతం పలికారు. నిన్న బ్యూనస్ ఎయిర్స్ చేరుకున్న ప్రధానమంత్రికి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. 57 సంవత్సరాల తర్వాత అర్జెంటీనాలో భారత ప్రధానమంత్రి తొలి ద్వైపాక్షిక పర్యటన కావడంతో ఈ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భారత్-అర్జెంటీనా సంబంధాలకు ఇది ఒక కీలక సంవత్సరం. తమకు ఆత్మీయ స్వాగతం పలికిన అధ్యక్షుడు మిలీకి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ మోదీ
November 20th, 08:09 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న అర్జెంటీనా (ఆర్జెంటీన్ రిపబ్లిక్) అధ్యక్షుడు శ్రీ జేవియర్ మిలే తో సమావేశమయ్యారు.ఫిబ్రవరి 16 వ తేదీ న ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
February 15th, 03:07 pm
వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2024 ఫిబ్రవరి 16 వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా 17,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయమయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు ఆ ప్రాజెక్టుల ను అంకితం చేయడంల తో పాటు ఆ ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక మహత్వపూర్ణ రంగాల అవసరాల ను తీర్చుతాయి.India is emphasizing the development of environmentally conscious energy sources to enhance our energy mix: PM Modi
February 06th, 12:00 pm
PM Modi inaugurated India Energy Week 2024 in Goa. India is the world's third largest energy, oil and LPG consumer. Furthermore, he said India is the fourth largest LNG importer and refiner along with the fourth largest mobile market.ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 06th, 11:18 am
ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2024 అనేది భారతదేశం యొక్క అతి పెద్దది అయినటువంటి మరియు సర్వతోముఖమైనటువంటి శక్తి సంబంధి ఏకైక ప్రదర్శన, ఇంకా సమావేశం అని చెప్పాలి. శక్తి పరం గా పరివర్తన కై భారతదేశం నిర్దేశించుకొన్న లక్ష్యాల కు ఉత్ప్రేరకం గా ఉండేటట్టు ఎనర్జీ వేల్యూ చైన్ లోని వేరు వేరు భాగాల ను ఒక చోటు కు చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానోద్దేశ్యం గా ఉంది. గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ సిఇఒ లతో మరియు నిపుణుల తో ఒక రౌండ్ టేబుల్ ను కూడా ప్రధాన మంత్రి నిర్వహించారు.కృష్ణ గోదావరి బేసిన్ లో సముద్ర అంతర్భాగం నుండిచమురు ఉత్పత్తి మొదలు కావడం పట్ల ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
January 08th, 10:06 am
జటిలమైందీ, కఠినమైందీ అయిన కృష్ణ గోదావరి డీప్ వాటర్ బేసిన్ (బంగాళా ఖాతం యొక్క కోస్తా తీరాని కి ఆవల గల కెజి-డిడబ్ల్యుఎన్-98/2 బ్లాకు) నుండి మొదటి సారి గా చమురు ఉత్పాదన ఆరంభం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ప్రపంచ ఆయిల్, గ్యాస్ రంగాల సిఇఒల తోను, నిపుణుల తోను చర్చించిన ప్రధాన మంత్రి
October 20th, 09:17 pm
ప్రపంచ చమురు, గ్యాస్ రంగం లోని ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సిఇఒ స్) తోను, నిపుణుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా చర్చ జరిపారు.