అనువాదం: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
November 06th, 10:15 am
ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇవాళ దేవ్ దీపావళి.. గురుపూర్ణిమ కూడా. అందుకే ఇది నిజంగా చాలా ముఖ్యమైన రోజు.ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి సంభాషణ
November 06th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని లోకకల్యాణ్ మార్గ్, 7లో ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 ఛాంపియన్లతో నిన్న ముచ్చటించారు. 2025 నవంబర్ 2, ఆదివారం జరిగిన తుదిపోరులో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించింది. దేవ దీపావళి, గురు పర్వ్ రెండింటినీ నిర్వహించుకొనే ఈ రోజు చాలా ముఖ్యమైనదంటూ.. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.జాతీయ పురస్కారాలందుకున్న ఉపాధ్యాయుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 04th, 05:35 pm
మన సంప్రదాయంలో ఉపాధ్యాయులపై సహజమైన గౌరవం ఉంది. వారు సమాజానికి గొప్ప బలం కూడా. ఉపాధ్యాయులను ఆశీర్వాదాల కోసం నిలబడేలా చేయడం తప్పు. నేను అలాంటి పాపం చేయాలనుకోను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరినీ కలవడం నాకు అద్భుతమైన అనుభవం. మీలో ప్రతి ఒక్కరికి మీ సొంత కథ ఉండి ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మీరు ఈ స్థాయికి చేరుకునేవారు కాదు. ఆ కథలన్నింటినీ తెలుసుకోవడానికి తగినంత సమయం దొరకడం కష్టం. కానీ మీ నుంచి నేను నేర్చుకోగలిగినది నిజంగా స్ఫూర్తిదాయకం.. దాని కోసం నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ జాతీయ పురస్కారం అందుకోవడం ముగింపు కాదు. ఈ పురస్కారం అందుకున్న తర్వాత అందరి దృష్టి మీపైనే ఉంటుంది. దీని అర్థం మీ పరిధి గణనీయంగా విస్తరించింది. గతంలో మీ ప్రభావం, ఆదేశం పరిధి పరిమితమే. ఇప్పుడు ఈ గుర్తింపు తర్వాత అది చాలా విస్తృతంగా పెరుగుతుంది. ఇది ప్రారంభం అని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు వీలైనంత వరకు అందరితో పంచుకోవాలి. మీరు అలా చేస్తే మీలో సంతృప్తి పెరుగుతుంది. మీరు ఆ దిశలో కృషి చేస్తూనే ఉండాలి. ఈ పురస్కారానికి మీరు ఎంపిక కావడం మీ కృషికి, నిరంతర అంకితభావానికి నిదర్శనం. అందుకే ఇది సాధ్యమైంది. ఒక ఉపాధ్యాయుడు వర్తమానానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు తరాలను కూడా రూపొందిస్తాడు.. భవిష్యత్తును మెరుగుపరుస్తాడు. ఇది దేశానికి చేసే సేవ కంటే తక్కువ కాదని నేను నమ్ముతున్నాను. నేడు మీవంటి కోట్లాది మంది ఉపాధ్యాయులు అదే దేశభక్తి, నిజాయితీ, అంకితభావంతో దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం లభించకపోవచ్చు. బహుశా చాలామంది ప్రయత్నించి ఉండకపోవచ్చు.. కొందరు గమనించి ఉండకపోవచ్చు. అలాంటి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులు అనేకమంది ఉన్నారు. వారందరి సమిష్టి కృషి వల్లే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.. భావి తరాలూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. దేశం కోసం జీవించే అందరి సహకారం దీనిలో ఉంటుంది.Prime Minister Narendra Modi addresses National Awardee Teachers
September 04th, 05:33 pm
During a meeting with National Awardee Teachers, PM Modi remarked that teachers shape not only the present but also the future generation, highlighting India’s guru-disciple tradition. He announced that from 22nd September, the GST reforms will take effect, making essentials cheaper for millions of families. The PM emphasized that every home adopt Swadeshi, with teachers promoting it in schools.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:52 pm
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్‌ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
ఈ స్వాతంత్య్ర మహోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్న వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సమష్టి విజయానికి ప్రతీక. మనందరికీ గర్వకారణం. మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. దేశంలో ఎప్పటికప్పుడు ఐక్యతా స్ఫూర్తి బలోపేతమవుతోంది. 140 కోట్ల భారతీయులు ఈ రోజు మువ్వన్నెల్లో మెరుస్తున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ రెపరెపలాడుతోంది. ఎడారులయినా, హిమాలయ శిఖరాలయినా, సముద్ర తీరాలయినా, లేదా జనసమ్మర్ధ ప్రాంతాలయినా.. అంతటా ఒకే నినాదం, ఒకే ఉత్సాహం. మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే మాతృభూమి కీర్తనే మార్మోగుతోంది.India celebrates 79th Independence Day
August 15th, 06:45 am
PM Modi, in his address to the nation on the 79th Independence day paid tribute to the Constituent Assembly, freedom fighters, and Constitution makers. He reiterated that India will always protect the interests of its farmers, livestock keepers and fishermen. He highlighted key initiatives—GST reforms, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, National Sports Policy, and Sudharshan Chakra Mission—aimed at achieving a Viksit Bharat by 2047. Special guests like Panchayat members and “Drone Didis” graced the Red Fort celebrations.29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి వేడుక సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:15 am
పరమ శ్రాద్ధేయ ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ మహరాజ్, శ్రావణబెళగొళ స్వామి శ్రీ చారుకీర్తి, మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ శ్రీ నవీన్ జైన్, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ప్రియాంక్ జైన్, కార్యదర్శి శ్రీ మమతా జైన్, ట్రస్టీ పీయూష్ జైన్, ఇతర విశిష్ట ప్రముఖులు, గౌరవనీయ సాధువులు, సోదరీసోదరులారా... జై జినేంద్ర!ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:01 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు జరిగిన ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక చిరస్మరణీయమైన సందర్భాన్ని నేడు మనమంతా చూస్తున్నాం.. ఇది ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతాబ్ది ఉత్సవాల పవిత్రతను స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. పూజ్య ఆచార్య అమర స్ఫూర్తితో నిండిన ఈ కార్యక్రమం అపూర్వమైన స్ఫూర్తిదాయక వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం దక్కడం తనకూ సంతోషం కలిగించిందన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 21st, 07:06 am
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు కె. రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ జాదవ్ ప్రతాపరావు గణపత్‌రావు గారు, చంద్రశేఖర్ గారు, భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీసోదరీమణులందరికీ నా నమస్కారాలు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 21st, 06:30 am
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐవైడీ) కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి సామూహిక యోగా సాధనలో పాల్గొన్నారు.ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలని, ఊబకాయాన్ని ఎదుర్కోవాలని ప్రధానమంత్రి పిలుపు
April 19th, 01:13 pm
ప్రజలందరూ అవగాహనతో కూడిన ఆహార పద్దతులను అవలంబించాలని, ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ పిలుపునిచ్చారు. చిన్న చిన్న ప్రభావవంతమైన మార్పుల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని.. నూనెల వాడకం తగ్గించటం వంటి పనులు పూర్తి ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి గణనీయంగా దోహదం చేస్తాయని అన్నారు.సిల్వస్సాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 07th, 03:00 pm
మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు ఇక్కడ చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చిన కేంద్రపాలిత ప్రాంత సిబ్బందికి నా కృతజ్ఞతలు. చాలా మంది పాత మిత్రులకు నమస్కారం చెప్పే అవకాశం వచ్చింది.కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు సిల్వస్సాలో నమో ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానం కావడానికి, సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడి అంకితభావం కలిగిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి ప్రజలతో తనకు ఉన్న సాన్నిహిత్యం, దీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ ప్రాంతంతో తన అనుబంధం దశాబ్దాల నాటిదని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే సామర్థ్యాన్ని ఆధునికత, పురోగతి దిశగా మార్చిన విధానాన్ని ఆయన వివరించారు.మన్ కీ బాత్ తాజా కార్యక్రమంలో స్థూలకాయ సమస్య నివారణ దిశగా సామూహిక కార్యాచరణకు ప్రధానమంత్రి పిలుపు
February 24th, 09:11 am
ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో ఈ సమస్యపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. వంట నూనె వినియోగాన్ని తగ్గించడానికి ప్రముఖులను ఆయన నామినేట్ చేశారు. ఆ పది మందిని వారు మరో పది మందిని దీని కోసం నామినేట్ చేయాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.