ఎఫ్‌ఏఓ అగ్రికోలా పతకం అందుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 20th, 11:00 pm

ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు. భారత్‌లోని కోట్లాది మంది రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, శ్రామికులకు దక్కిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారత్‌కున్న అచంచలమైన నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది. ఎంతో గౌరవంగా ఈ పతకాన్ని స్వీకరిస్తూ.. భారతదేశ అన్నదాతలకు అంకితమిస్తున్నా.

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

May 20th, 10:55 pm

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక అగ్రికోలా పతకాన్ని ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచస్థాయిలోనూ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాల పరిష్కారానికి ఆయన ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.

కీలక కార్యక్రమాల నిమిత్తం ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ

May 20th, 12:30 am

ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితమే ఇటలీలోని రోమ్‌కు చేరుకున్నారు. ఆయన ఇటలీ గణతంత్ర అధ్యక్షులు శ్రీ సెర్గియో మట్టరెల్లాను మర్యాదపూర్వకంగా కలుస్తారు; అలాగే ప్రధానమంత్రి మెలోనితో చర్చలు జరుపుతారు. ఈ చర్చలు ప్రధానంగా ‘భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్’ (IMEC) పై కేంద్రీకృతమై ఉంటాయి.

నార్వే - భారత్ వ్యాపార, పరిశోధన సదస్సులో ప్రధాని ప్రసంగం

May 18th, 11:49 pm

నార్వే, భారత్ వ్యాపార, పరిశోధన వర్గాల మధ్య ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరి మాటలు వినే అవకాశం లభించింది. మన భాగస్వామ్యానికి పునాది చాలా బలంగా ఉందన్న నమ్మకం వారి మాటలు విన్న తర్వాత నాకు కలిగింది.

భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

May 18th, 08:50 pm

ఓస్లోలో జరిగిన భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గౌరవ రాజు హాకాన్‌, నార్వే ప్రధానమంత్రి గౌరవ జోనాస్ గార్‌ స్టోర్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.

‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

May 18th, 05:00 am

ముందుగా, ఈ రౌండ్ టేబుల్‌ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్‌ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం గోథెన్‌బర్గ్‌లో జరగడం నాకు సంతోషంగా ఉంది. ఈ నగరం ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినది. ఈ నగరం యూరప్ తయారీ రంగ స్ఫూర్తికి చిహ్నంగానూ నిలుస్తుంది.

‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని (ఈఆర్‌టీ) ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి

May 17th, 12:12 am

గోథెన్‌బర్గ్‌లో 2026 మే 17న నిర్వహించిన 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' (ఈఆర్‌టీ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వోల్వో గ్రూప్ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపాకు చెందిన సీనియర్ పారిశ్రామిక ప్రముఖులు, ప్రముఖ యూరోపియన్- భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

న్యూఢిల్లీలో నారీశక్తి వందన్ సమ్మేళన్ సందర్భంగా ప్రధాని ప్రసంగం

April 13th, 11:15 am

వేదికనలంకరించిన ఢిల్లీ ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా గారూ, కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవిగారూ, శ్రీమతి సావిత్రీ ఠాకూర్ గారూ, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి విజయా రహత్కర్ గారూ... అలాగే మీలో చాలా మంది సీనియర్లు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు ఉన్నారు. మన లోక్‌సభ మాజీ స్పీకర్ గౌరవనీయులు మీరాకుమార్ గారూ మన మధ్యనే ఉన్నారు. ఆత్మీయులైన అక్కాచెల్లెళ్లంతా ఇక్కడున్నారు. ఈ వేళ బైశాఖీ పండుగ శోభతో దేశమంతా ఆనందంతో ఉంది. రేపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకొంటారు. అలాగే జలియన్‌వాలా బాగ్ మారణకాండలో అమరులైన యోధులకూ ఈ రోజు నేను నివాళి అర్పిస్తున్నాను.

‘నారీశక్తి వందన్ సమ్మేళన్’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 13th, 11:00 am

విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన నారీశక్తి వందన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బైశాఖీ శుభసందర్భంగా, దేశంలోని చాలాచోట్ల నూతన సంవత్సర వేడుకలను చేసుకోనున్న తరుణంలో ఆయన మాట్లాడారు. జలియన్‌వాలా బాగ్ మారణకాండ అమరులకు ప్రధానమంత్రి నివాళి అర్పించారు. ‘‘నారీ శక్తిపై భారత్ కృతనిశ్చయంతో ఉంది. 21వ శతాబ్దంలో అత్యంత కీలక నిర్ణయాల్లో ఇదొకటి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

భారత్‌-కెనడా సంయుక్త ప్రకటన

March 02nd, 05:05 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు కెనడా ప్రధానమంత్రి మాననీయ మార్క్‌ కార్నీ ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకూ భారతదేశంలో పర్యటించారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక కార్నీ తొలిసారి భారత్‌లో పర్యటించగా, 2018 తర్వాత కెనడా ప్రధానమంత్రి ఒకరు ద్వైపాక్షిక పర్యటన కోసం మన దేశానికి రావడం ఇదే మొదటిసారి. కెనడా ప్రభుత్వంలోని సీనియర్‌ మంత్రులు, రాష్ట్రాల అధినేతలు, అగ్రగామి పరిశ్రమల ‘సీఈవో’లతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఆయన వెంట వచ్చింది.

అభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా అజ్మీర్‌లో ప్రధాని ప్రసంగం

February 28th, 12:00 pm

తీర్థరాజ్ పుష్కర్, సావిత్రీ అమ్మవారికి నిలయమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు మీ మధ్యన నిలిచి ఆశీస్సులు పొందే అవకాశం నాకు లభించింది. సుర్‌సురాలోని తేజాజీధామ్‌కూ, పృథ్వీరాజ్ చౌహాన్ పుణ్యభూమి అయిన అజ్మీర్‌కూ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ వేదికగా దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా ప్రచారం, రూ. 17,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 28th, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అజ్మీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా సుర్సురాలోని తేజాజీ ధామ్ వంటి ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రాలకు, హైఫా విముక్తిలో కీలక పాత్ర పోషించిన మేజర్ దల్పత్ సింగ్ వీరత్వానికి నివాళులర్పించారు. మేజర్ దల్పత్ సింగ్ ధైర్యసాహసాలు నేటికీ ఇజ్రాయెల్‌లో గౌరవం పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి ప్రసంగం

February 19th, 10:00 am

ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మీ అందరికీ సాదర స్వాగతం. మానవాళిలో ఆరో వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌లో ఈ సదస్సు జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా, అపారమైన సాంకేతిక ప్రతిభ, విస్తృతమైన సాంకేతిక అనుసంధాన వ్యవస్థలకు భారత్ పుట్టినిల్లు. భారత్ కొత్త సాంకేతికతలను సృష్టించడమే కాకుండా, వాటిని మునుపెన్నడూ లేని వేగంతో స్వీకరిస్తుంది. ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఇక్కడ ఉన్న వివిధ దేశాల ప్రభుత్వాధినేతలకు, ప్రపంచ ఏఐ వ్యవస్థ నాయకులకు, ఆవిష్కర్తలకు నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు ఇక్కడకు విచ్చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 19th, 09:40 am

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన, చరిత్రాత్మకమైన ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌ ఆతిథ్యమిస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా కలిగిన, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో ఉన్న, సాంకేతిక ఆధారిత వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను వర్ణించారు. నూతన సాంకేతికతలను రూపొందించడం మాత్రమే కాకుండా.. వాటిని అపూర్వమైన వేగంతో భారత్ స్వీకరిస్తోందన్నారు. కొత్త సాంకేతికతలను అనుసరించడానికి 140 కోట్ల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వారి తరఫున ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రభుత్వాధినేతలు, ప్రపంచ ఏఐ వ్యవస్థ నాయకులు, ఆవిష్కర్తలకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. ఈ సదస్సుకు హాజరైన వారికి ధన్యావాదాలు తెలియజేస్తూ.. ఈ కార్యక్రమానికి ఆతిథ్యమివ్వడం భారత్‌కు మాత్రమే కాకుండా.. మొత్తం గ్లోబల్ సౌత్‌కే గర్వకారణమన్నారు.

“పరీక్షా పే చర్చా 2026” కార్యక్రమంలో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ

February 06th, 10:21 am

నా పేరు సాన్వి ఆచార్య, నేను గుజరాత్ నుంచి వచ్చాను. నా మొదటి ప్రశ్న: తల్లిదండ్రులు మా గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు మాకు మద్దతు ఇస్తారు. కానీ చదివేందుకు ఉపాధ్యాయులు ఒక విధానాన్ని సూచించినప్పుడు, తల్లిదండ్రులు దానికి భిన్నమైన విధానాన్ని అనుసరించాలని పట్టుబడుతుంటారు. విద్యార్థులుగా మాలో మరో ధోరణి ఉంటుంది దీనితోనే అసలు సమస్య మొదలవుతుంది. ఆ సమయంలో ఏ నమూనా సరైనదో తెలియక మేం అయోమయంలో పడతాం

పరీక్షా పే చర్చ – 2026లో విద్యార్ధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

February 06th, 10:00 am

పరీక్షా పే చర్చ (పీపీసీ) 9వ సంచికలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.

వారణాసిలో 72 వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 04th, 01:00 pm

ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, యూపీ ప్రభుత్వ మంత్రులు - సోదరులు రవీంద్ర జైస్వాల్, దయాశంకర్, గిరీష్ యాదవ్, బనారస్ మేయర్ - సోదరుడు అశోక్ తివారీ, ఇతర ప్రజాప్రతినిధులు, వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, దేశం నలుమూలల నుంచి నుండి విచ్చేసిన క్రీడాకారులు, కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులకు నమస్కారం.

వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన ప్రధాని

January 04th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులందరికీ స్వాగతం పలికి అభినందించడం పట్ల వారణాసి పార్లమెంటు సభ్యునిగా సంతోషంగా ఉందని తెలిపారు. నేటి నుంచి నగరంలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఎంతో కష్టపడి ఈ జాతీయ స్థాయి పోటీలకు వచ్చారని.. రాబోయే రోజుల్లో వారణాసి గడ్డపై వారి కృషికి పరీక్ష ఎదురుకానుందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని.. ఇది 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని అభివర్ణించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న వారందరికీ ప్రధాన మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Critical minerals are a shared resource of humanity: PM Modi at G20 Johannesburg Summit Session - 2

November 22nd, 09:57 pm

In his statement during the G20 Summit Session - 2 in Johannesburg, South Africa, PM Modi touched upon important topics like critical minerals, natural disasters, space technology and clean energy. The PM highlighted that India is promoting millets. He also said that the G20 must promote comprehensive strategies that link nutrition, public health, sustainable agriculture and disaster preparedness to build a strong global security framework.

Prime Minister participates in G20 Summit in Johannesburg

November 22nd, 09:35 pm

Prime Minister participated today in the G20 Leaders’ Summit hosted by the President of South Africa, H.E. Mr. Cyril Ramaphosa in Johannesburg. This was Prime Minister’s 12th participation in G20 Summits. Prime Minister addressed both the sessions of the opening day of the Summit. He thanked President Ramaphosa for his warm hospitality and for successfully hosting the Summit.