ఎన్ఎస్‌జీ స్థాపక దినోత్సవం.. ఎన్ఎస్‌జీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

October 16th, 09:09 pm

ఎన్ఎస్‌జీ స్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ఎస్‌జీ సిబ్బంది సాటి లేని పరాక్రమాన్నీ, అంకిత భావాన్నీ ప్రశంసించారు. ‘‘ఉగ్రవాద భూతం బారి నుంచి మన దేశ ప్రజలను కాపాడుతుండటంలో ఎన్ఎస్‌జీ కీలకపాత్రను పోషించింది. ఈ దళం మన దేశ పౌరుల భద్రతకు పూచీపడటంతో పాటు దేశ ముఖ్య సంస్థలను కూడా కంటికి రెప్పలా చూసుకుంటోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఎన్ఎస్‌జీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా ఎన్‌ఎస్‌జీ సిబ్బందికి ప్రధానమంత్రి ప్రణామం

October 16th, 11:58 am

ఎన్‌ఎస్‌జీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బంది అచంచలమైన అంకితభావం, ధైర్యం, సంకల్పాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కొనియాడారు.