The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.గాంగ్‌టక్ ఆర్కిడేరియమ్ సందర్శన సందర్భంగా సిక్కిమ్ అసాధారణ జీవవైవిధ్యాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి
April 28th, 03:15 pm
సిక్కిమ్‌లోని గాంగ్‌టక్ లో ఉన్న ఆర్కిడేరియమ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. అక్కడి శోభతో పాటు, సిక్కిమ్‌లో అసాధారణ జీవవైవిధ్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.ఏప్రిల్ 27–28 తేదీల్లో సిక్కింలో ప్రధాని పర్యటన
April 26th, 03:47 pm
2026 ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిక్కింలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన గ్యాంగ్‌టక్ చేరుకుంటారు. ఏప్రిల్ 28న ఉదయం దాదాపు 9:30 గంటలకు గ్యాంగ్‌టక్‌లోని ఆర్కిడేరియాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. సిక్కిం రాష్ట్ర పర్యావరణ, పుష్ప వైభవాన్ని చాటేలా.. అత్యాధునిక, ప్రపంచ స్థాయి ఆర్కిడ్ అనుభూతి కేంద్రంగా స్వర్ణజయంతి మైత్రీ మంజరి పార్కును అభివృద్ధి చేశారు.కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్‌ను దశాబ్దాలుగా ఆలస్యం చేసింది: అస్సాంలోని దిబ్రూఘర్‌లో ప్రధాని మోదీ
April 06th, 11:30 am
అస్సాంలోని డిబ్రూఘర్‌లో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగంలో, పిఎం మోడీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు, స్వార్థ ప్రయోజనాల కోసం భూమిని “ఎటిఎం” గా పరిగణిస్తున్నారని ఆరోపించారు. రైతులు, గిరిజన సంఘాలు, తేయాకు తోటల కుటుంబాలకు భూమిపై హక్కు కల్పించేందుకు బీజేపీ-ఎన్‌డీఏ ఎలా కృషి చేస్తుందో ఆయన హైలైట్ చేశారు. నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.కాంగ్రెస్ రాజవంశపు “నామ్‌దార్” శత పరాజయాలను పూర్తి చేసుకుంటారు: అస్సాంలోని బార్పేటలో ప్రధాని మోదీ
April 06th, 11:10 am
అస్సాంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో, ప్రధాని మోదీ బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఉత్సాహభరితమైన జనసమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆత్మనిర్భర, వికసిత అస్సాం దార్శనికతను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యతనిచ్చే రాజకీయాలు, అవినీతి, తప్పుడు వాగ్దానాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడం గురించి కూడా ఆయన మాట్లాడారు.బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం
April 06th, 11:00 am
అస్సాంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో, ప్రధాని మోదీ బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఉత్సాహభరితమైన జనసమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆత్మనిర్భర, వికసిత అస్సాం దార్శనికతను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యతనిచ్చే రాజకీయాలు, అవినీతి, తప్పుడు వాగ్దానాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడం గురించి కూడా ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ ఎప్పుడూ అస్సాం ప్రయోజనాలతో రాజీ పడింది: బిశ్వనాథ్‌లో ప్రధాని మోదీ
April 01st, 11:45 am
అస్సాంలోని బిశ్వనాథ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో, కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ 'అభివృద్ధి వ్యతిరేక' పార్టీ అని, 'స్వతంత్ర భారతదేశంలో అవినీతికి మూలం' అని ఆరోపించారు. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైలైట్ చేస్తూ, వేలాది బీఘాల భూమిని అక్రమ ఆక్రమణల నుండి విడిపించి, అస్సాం వారసత్వాన్ని, పర్యావరణాన్ని పునరుద్ధరించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగేలా చూడాలని ఆయన ఓటర్లను కోరారు.గోగాముఖ్, విశ్వనాథ్‌లలో ఉత్సాహభరితమైన ర్యాలీలతో అస్సాం ఎన్నికలకు ప్రధాని మోదీ నాంది పలికారు
April 01st, 11:00 am
రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోగాముఖ్, విశ్వనాథ్‌లలో భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ప్రకటన తర్వాత అస్సాంలో ఆయన నిర్వహించిన తొలి ర్యాలీలు ఇవే. ఈ కార్యక్రమాలకు యువత, మహిళలు, స్థానిక వర్గాల వారు ఉత్సాహంగా పాల్గొనడంతో భారీ స్పందన లభించింది. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు బలమైన ఊపునిచ్చినట్లు సంకేతాలు ఇస్తోంది.గుజరాత్‌లోని పోరుబందరులో మాధవపూర్ మేళా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
March 29th, 10:23 am
గుజరాత్‌లోని పోరుబందరులో జరుగుతున్న మాధవ్‌పూర్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సాహభరితమైన వేడుక మన ఘనమైన సంస్కృతిని చాటిచెబుతుందనీ... గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల మధ్య గల శాశ్వత సాంస్కృతిక బంధాన్ని మరింత బలపరుస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, ఈ పండుగ విభిన్న సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. ప్రజలందరూ ఈ మేళాను సందర్శించాలని నేను పిలుపునిస్తున్నాను! అని శ్రీ మోదీ పేర్కొన్నారు.అస్సాంలోని సిల్చార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
March 14th, 11:10 am
సంస్కృతి, ధైర్యం, ఉత్సాహం నిండిన బరాక్ లోయ కుటుంబాల మధ్యకు రావడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది. బరాక్ లోయకు ముఖద్వారంగా సిల్చార్‌ను పిలుస్తారు. చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాపారం అన్నీ కలసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక్కడ బెంగాలీ మాట్లాడతారు. అస్సామీ ప్రతిధ్వనిస్తుంది. ఇతర గిరిజన సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ఈ వైవిధ్యాన్ని బలంగా మార్చుకుంటూ, సోదరభావం, సామరస్యంతో ఈ ప్రాంతాన్నంతా మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇది బరాక్ వ్యాలీకున్న అసమానమైన సామర్థ్యం.అస్సాంలోని సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 14th, 10:45 am
అస్సాంలోని సిల్చార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. సంస్కృతి, చైతన్యానికి నిలయమైన బరాక్ లోయను సందర్శించడం తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. సిల్చార్ నగరం ఈ లోయకు ఒక ప్రవేశ ద్వారం వంటిదని.. ఇక్కడ చరిత్ర, భాష ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ గుర్తింపును తీసుకొచ్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాలీ, అస్సామీ, గిరిజన సంప్రదాయాలు సామరస్యంతో వర్ధిల్లే ఈ ప్రాంత వైవిధ్యమే దీని అసలైన బలమని శ్రీ మోదీ తెలిపారు. ‘‘బరాక్ లోయ వైవిధ్యమే దాని గొప్ప ఆస్తి. ఇది పౌరుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.అస్సాంలోని గువాహటిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
March 13th, 05:30 pm
అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ప్రజాదరణ చూరగొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాకేంతిక పరిజ్ఞానం సాయంతో దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన రైతు మిత్రులకు, టీ తోటల్లో పనిచేస్తున్న సోదరీసోదరులకు, ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి హాజరవుతున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అందరికీ నా శుభాకాంక్షలు.అస్సాంలోని గువహటిలో రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 13th, 05:00 pm
అస్సాంలోని గువహటిలో దాదాపు రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గువహటిలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నగర ప్రజలకు ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వర్చువల్ గా పాల్గొంటున్న రైతులకు, అలాగే తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల ముందు కామాఖ్య మాత పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టమని ప్రధానమంత్రి అన్నారు. నవరాత్రులు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, కామాఖ్య మాత పుణ్య భూమిలో మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అని శ్రీ మోదీ పేర్కొన్నారు.మార్చి 13-14 తేదీల్లో ప్రధానమంత్రి అస్సాం పర్యటన
March 12th, 05:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 13-14 తేదీల్లో అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కొక్రాఝర్, గువహటి, సిల్చార్ ప్రాంతాలలో రూ. 47,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజ, రైళ్ల ప్రారంభోత్సవం చేస్తారు.ఢిల్లీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 08th, 03:54 pm
అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాం. కాసేపటి క్రితమే, ముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. మెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయి, ఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోంది. ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతో, ఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది. ఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 08th, 10:26 am
దేశ రాజధానీ నగరం ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం” అని పేర్కొన్నారు.“వ్యవసాయ రంగం-గ్రామీణ రూపాంతరీకరణ” ఇతివృత్తంపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
March 06th, 01:14 pm
బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న మూడో వెబినార్‌కు మీ అందర్నీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. తొలి రెండు వెబినార్లలో సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక వృద్ధి వంటి కీలకాంశాలపై మనం సమీక్షించాం. ఇక నేటి వెబినార్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ-వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై చర్చ కేంద్రీకృతమైంది. బడ్జెట్ తయారీ ప్రక్రియలో మీరంతా విలువైన సూచనలతో ఎంతగానో తోడ్పడ్డారు. మీరిచ్చిన సూచనలు, సలహాలు బడ్జెట్‌లో ప్రతిబింబించడంతో అవెంతో ఉపయుక్తమయ్యాని కూడా మీరు గమనించి ఉంటారు. అయితే, బడ్జెట్ సమర్పణ అనంతరం దేశం దాని పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, ఇప్పుడు మీ అనుభవం, సూచనలతో ప్రజలకు అత్యధికంగా బడ్జెట్ ప్రయోజనాలు అందేవిధంగా సరళ మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యం. తదనుగుణంగా బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి పైసాను పూర్తి స్థాయిలో సకాలంలో వినియోగించడంపై ఈ వెబినార్ సందర్భంగా మీరిచ్చే సలహాలకు ప్రాధాన్యం ఉంటుంది.వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశాలపై పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 06th, 01:00 pm
వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై పోస్ట్ బడ్జెట్ మూడో వెబినార్‌ను ఉద్దేశించి ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సాంకేతికత, ఆర్థిక వృద్ధిపై గతంలో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకుంటూ, బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములందరూ ఎంతో సహకారాన్ని అందించారని ప్రధానమంత్రి తెలిపారు. బడ్జెట్ అనంతరం, దేశ సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి ప్రయోజనాలను పొందటం ముఖ్యం. ఈ దిశగా మీ సూచనలు, ఈ వెబినార్ ఎంతో కీలకమైనవి అని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.నెసెట్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 08:20 pm
ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.