ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 12:15 pm
ప్రారంభోత్సవం అయిపోయిందా? ప్రారంభోత్సవం అయిపోయిందా ? లేదు.. సగం పనే పూర్తయింది. నేను కేవలం ఆ కర్టెన్‌ను (తెరను) మాత్రమే తొలగించాను. కానీ నేడు ఇక్కడ ఉన్న మీ అందరి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీయండి. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయండి.. మీరే దీనిని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినట్లుగా ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. ఇది మీ ఆస్తి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కష్టం.. అందుకే దీని ప్రారంభోత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ మీ చేతులెత్తి, ఫ్లాష్‌లైట్లను పూర్తిగా చూపించండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయింది.సుమారు రూ. 11,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ తొలి దశను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 28th, 12:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తపరుస్తూ.. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ అభియాన్‌లో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఈ విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేసి, నేడు తానే ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ భారీ విమానాశ్రయం పేరు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి ఉండటం మరో విశేషమని చెబుతూ.. నన్ను ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిన ఈ రాష్ట్ర గుర్తింపు, ఇప్పుడు ఈ అద్భుతమైన విమానాశ్రయంతో ముడిపడి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.మార్చి 28న పీఎం ఉత్తరప్రదేశ్ పర్యటన
March 26th, 09:52 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 28, 2026న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 11:30కి గౌతమబుద్ధ నగర్‌లోని జేవార్ వద్దనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, టెర్మినల్ భవనాన్ని పరిశీలిస్తారు. 12 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ఫేజ్-Iను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 22nd, 01:30 pm
బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్ జాతికి అంకితం
February 22nd, 01:12 pm
మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
August 17th, 12:45 pm
కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 17th, 12:39 pm
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.దేశ ప్రజలకు ఉత్తమ నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది: ప్రధానమంత్రి
December 09th, 10:08 pm
ప్రజలకు ఉత్తమ నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు అందేటట్టు చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందనీ, సమృద్ధిని పెంచడానికి సంధానానికి ఉన్న శక్తిని వినియోగించుకొంటోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. త్వరలో సిద్ధం కానున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం సంధానాన్ని పెంచడంతోపాటు ఎన్‌సీఆర్‌లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు.Double engine government is working with double speed for Uttar Pradesh’s development: PM
January 31st, 01:31 pm
Ahead of the upcoming Assembly elections, Prime Minister Narendra Modi today addressed his first virtual rally in five districts of Uttar Pradesh. These districts are Saharanpur, Shamli, Muzaffarnagar, Baghpat and GautamBuddha Nagar. Addressing the first virtual rally 'Jan Chaupal', PM Modi said, “The illegal occupation of the homes, land and shops of the poor, Dalits, backwards and the downtrodden was a sign of socialism five years ago.”PM Modi's Jan Chaupal with the people of Uttar Pradesh
January 31st, 01:30 pm
Ahead of the upcoming Assembly elections, Prime Minister Narendra Modi today addressed his first virtual rally in five districts of Uttar Pradesh. These districts are Saharanpur, Shamli, Muzaffarnagar, Baghpat and GautamBuddha Nagar. Addressing the first virtual rally 'Jan Chaupal', PM Modi said, “The illegal occupation of the homes, land and shops of the poor, Dalits, backwards and the downtrodden was a sign of socialism five years ago.”ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 25th, 01:06 pm
ఉత్తరప్రదేశ్ ప్రముఖ, కర్మయోగి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, మా పాత శక్తివంతమైన సహచరుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జనరల్ వీకే సింగ్ జీ, సంజీవ్ బల్యాన్ జీ, ఎస్పీ సింగ్ బఘేల్ జీ మరియు బి ఎల్ వర్మ జీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి జీ, శ్రీ జై ప్రతాప్ సింగ్ జీ, శ్రీకాంత్ శర్మ జీ, భూపేంద్ర చౌదరి జీ, శ్రీ నందగోపాల్ గుప్తా జీ, అనిల్ శర్మ జీ, ధరమ్ సింగ్ సైనీ జీ, అశోక్ కటారియా జీ మరియు శ్రీ జి ఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు డా. మహేశ్ శర్మ జీ, శ్రీ సురేంద్ర సింగ్ నగర్ జీ మరియు శ్రీ భోలా సింగ్ జీ, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ధీరేంద్ర సింగ్ జీ, వేదికపై కూర్చున్న ఇతర ప్రజాప్రతినిధులందరూ మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా.ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 01:01 pm
ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి నవంబర్ 25 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
November 23rd, 09:29 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 నవంబర్ 25 న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో ఉత్తర్ప్రదేశ్ లో నోయెడా ఇంటర్ నేశనల్ ఎయర్ పోర్ట్ (ఎన్ఐఎ) కు గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోని జేవర్ లో శంకుస్థాపన చేయనున్నారు. దీనితోఉత్తర్ ప్రదేశ్ భారతదేశం లో అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాల ను కలిగి ఉండేటటువంటిఒకే రాష్ట్రం కానున్నది.