ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 28th, 12:15 pm

ప్రారంభోత్సవం అయిపోయిందా? ప్రారంభోత్సవం అయిపోయిందా ? లేదు.. సగం పనే పూర్తయింది. నేను కేవలం ఆ కర్టెన్‌ను (తెరను) మాత్రమే తొలగించాను. కానీ నేడు ఇక్కడ ఉన్న మీ అందరి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీయండి. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయండి.. మీరే దీనిని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినట్లుగా ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. ఇది మీ ఆస్తి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కష్టం.. అందుకే దీని ప్రారంభోత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ మీ చేతులెత్తి, ఫ్లాష్‌లైట్లను పూర్తిగా చూపించండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయింది.

సుమారు రూ. 11,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ తొలి దశను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 28th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తపరుస్తూ.. వికసిత్ యూపీ, వికసిత్ భారత్ అభియాన్‌లో నేడు నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని తెలిపారు. ఈ విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేసి, నేడు తానే ప్రారంభించటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ భారీ విమానాశ్రయం పేరు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి ఉండటం మరో విశేషమని చెబుతూ.. నన్ను ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపిన ఈ రాష్ట్ర గుర్తింపు, ఇప్పుడు ఈ అద్భుతమైన విమానాశ్రయంతో ముడిపడి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 08th, 03:54 pm

అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాం. కాసేపటి క్రితమే, ముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. మెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయి, ఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోంది. ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతో, ఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది. ఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 08th, 10:26 am

దేశ రాజధానీ నగరం ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం” అని పేర్కొన్నారు.

మార్చి 8న ఢిల్లీలో రూ. 33,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి

March 06th, 05:23 pm

మార్చి 8వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఢిల్లీలో రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముందు సరోజినీ నగర్‌లోని జీపీఆర్‌ఏ టైప్-5 వసతి గృహాలను సందర్శించి.. అక్కడ మహిళలకు కేటాయించిన నివాసాల ఇంటి తాళంచెవులను ప్రధానమంత్రి స్వయంగా అందజేస్తారు.

గుజరాత్‌లో మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా కేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

February 28th, 02:45 pm

గుజరాత్ ప్రజల ఆదరణ చూరగొన్న ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారూ, మైక్రాన్ టెక్నాలజీ సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రా గారూ, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి గారూ, విశిష్ట అతిథులూ, సోదరీ సోదరులారా...

గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 28th, 02:37 pm

గుజరాత్‌లోని సానంద్‌లో మైక్రాన్ అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభాన్ని సూచించే ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రపంచ సాంకేతిక నాయకత్వం వైపు భారత్ భారత ప్రయాణంలో ఒక ముందడుగు.

Cabinet approves extension corridor from Noida Sector 142 to Botanical Garden (Noida) for a length of 11.56 Km with 8 stations

February 14th, 01:08 pm

The Union Cabinet, chaired by PM Modi, has approved the Extension Corridor from Noida Sector 142 to Botanical Garden (Noida) of the Noida Metro Rail Project, covering a length of 11.56 km with 8 elevated stations. The project will enhance connectivity, stimulate economic activity and ease urban mobility for both residents and commuters, while significantly reducing carbon emissions.

ఢిల్లీలోని యశోభూమి వేదికగా జరిగిన సెమీకాన్ ఇండియా-2025 సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

September 02nd, 10:40 am

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్విని వైష్ణవ్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా గారు, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గారు, కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ గారు, ఎస్ఈఎమ్ఐ అధ్యక్షులు అజిత్ మనోచా గారు, దేశవిదేశాల నుంచి వచ్చిన సెమీ కండక్టర్ పరిశ్రమకు చెందిన సీఈవోలు, వారి సహచరులు, వివిధ దేశాల నుంచి హాజరైన మా అతిథులు, అంకురసంస్థలతో అనుబంధంగా ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నా యువ విద్యార్థి మిత్రులు, సోదరసోదరీమణులారా!

‘సెమీకాన్ ఇండియా 2025’ను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్‌ను ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.. భారత్‌పై ప్రపంచానికి నమ్మకముంది..

September 02nd, 10:15 am

‘సెమీకాన్ ఇండియా- 2025’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దేశ సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఆహూతులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ... దేశ విదేశాల నుంచి సెమీకండక్టర్ పరిశ్రమల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, వారి సహచరులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞత‌లు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ అతిథులు, అంకుర సంస్థలతో అనుబంధం ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ విద్యార్థులకు కూడా ఆయన స్వాగతం పలికారు.

ఉత్తరప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 20th, 04:54 pm

వేదికపైన ఆశీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ గారూ, రాష్ట ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గారూ, సాంకేతికత మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన ఇతర రాష్ట్రాల గవర్నర్లూ, ముఖ్యమంత్రులూ, కేంద్ర మంత్రిమండలి సభ్యులూ, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ నాయుడు గారూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ గార్లూ, రాష్ర్ట మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, శాసన సభ్యులూ, ఇంకా బెనారస్ వాసులైన నా ప్రియ సోదరీ సోదరులారా...

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి

October 20th, 04:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తర ప్ర‌దేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి పథకాల‌కు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. రూ.6,100 కోట్లకు పైగా విలువైన పలు విమానాశ్రయాల ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.

సింగపూర్ సంస్థ ఏఈఎంను సందర్శించిన ప్రధానమంత్రి

September 05th, 12:31 pm

సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఏఈఎంను సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో కలసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో ఏఈఎం పాత్ర, దాని కార్యకలాపాలతో పాటు భారత్ లో వ్యాపార ప్రణాళికల గురించి సంస్థ ప్రతినిధులు వివరించారు. సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమల సమాఖ్య ఆ దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధి, భారత్ లో ఉన్న అవకాశాలు, సహకారం గురించి క్లుప్తంగా వివరించింది. ఈ రంగానికి చెందిన ఇతర సింగపూర్ సంస్థల ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీకండక్టర్ సంస్థలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

January 25th, 02:00 pm

ఉత్తర ప్రదేశ్ గవర్నరు ఆనందీబెన్ పటేల్ గారు, గౌరవనీయ యుపి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ జీ, కేంద్ర మంత్రి శ్రీ వి.కె.సింగ్ గారు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి గారు, విశిష్ట ప్రతినిధులు, మరియు బులంద్ షహర్ యొక్క నా ప్రియమైన సోదర సోదరీమణులు!

పంతొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయల కు పైచిలుకువిలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన కూడాచేసిన ప్రధాన మంత్రి

January 25th, 01:33 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 19,100 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ఈ రోజు న ప్రారంభించడం తో పాటు శంకుస్థాపనలను కూడా చేశారు. ఆయా ప్రాజెక్టు లు రేల్ వే, రహదారులు, చమురు, ఇంకా గ్యాస్, పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.

ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

September 12th, 11:01 am

ఉత్తరప్రదేశ్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరులు శ్రీ పుర్షోత్తం రూపాలా గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ అధ్యక్షుడు పి. బ్రజ్జాలే గారు, ఐడిఎఫ్ డిజి కరోలిన్ ఎమాండ్ గారు, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

PM inaugurates International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida

September 12th, 11:00 am

PM Modi inaugurated International Dairy Federation World Dairy Summit. “The potential of the dairy sector not only gives impetus to the rural economy, but is also a major source of livelihood for crores of people across the world”, he said.

ఈ ఎన్నికలు హిస్టరీ-షీటర్‌లను దూరంగా ఉంచడం & కొత్త చరిత్రను స్క్రిప్టు చేయడం: ప్రధాని మోదీ

February 04th, 12:01 pm

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్, నోయిడాలోని వర్చువల్ జన్ చౌపాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ ఎన్నికలు చరిత్ర షీట్లను దూరంగా ఉంచడం మరియు కొత్త చరిత్ర సృష్టించడం. యుపి ప్రజలు అల్లర్లు మరియు మాఫియాలను తెర వెనుక నుండి యుపిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అనుమతించబోమని యుపి ప్రజలు నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వర్చువల్ జన్ చౌపాల్‌ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు

February 04th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్, నోయిడాలోని వర్చువల్ జన్ చౌపాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ ఎన్నికలు చరిత్ర షీట్లను దూరంగా ఉంచడం మరియు కొత్త చరిత్ర సృష్టించడం. యుపి ప్రజలు అల్లర్లు మరియు మాఫియాలను తెర వెనుక నుండి యుపిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అనుమతించబోమని యుపి ప్రజలు నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

Double engine government is working with double speed for Uttar Pradesh’s development: PM

January 31st, 01:31 pm

Ahead of the upcoming Assembly elections, Prime Minister Narendra Modi today addressed his first virtual rally in five districts of Uttar Pradesh. These districts are Saharanpur, Shamli, Muzaffarnagar, Baghpat and GautamBuddha Nagar. Addressing the first virtual rally 'Jan Chaupal', PM Modi said, “The illegal occupation of the homes, land and shops of the poor, Dalits, backwards and the downtrodden was a sign of socialism five years ago.”