నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులుగా నియమితులైన డాక్టర్ శ్రీ ఆర్.బాలసుబ్రమణియం, డాక్టర్ శ్రీ జోరామ్ అనియాలకు ప్రధానమంత్రి అభినందనలు
May 02nd, 09:40 pm
నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులుగా నియమితులైన డాక్టర్ శ్రీ ఆర్.బాలసుబ్రమణియం, డాక్టర్ శ్రీ జోరామ్ అనియాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.నియామక సందర్భంగా ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధాని అభినందన
April 25th, 10:47 pm
నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమితుడైన ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలాన్ని విజయవంతంగా కొనసాగించాలంటూ శుభాకాంక్షలు అందించారు. ఆయన నిగర్వి అనీ, అలుపెరుగని అంకితభావంతో ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యం, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ రంగాల్లో ప్రొఫెసర్ దాస్ అమూల్య సేవలను ఆయన కొనియాడారు. ఆయన విజయాలతో దేశమంతా గర్విస్తోందన్నారు.Prime Minister extends best wishes on reconstitution of NITI Aayog
April 25th, 10:46 pm
The Prime Minister, Shri Narendra Modi, expressed his best wishes on reconstitution of NITI Aayog. He noted that NITI Aayog has emerged as a vital pillar in India’s policy-making architecture, fostering cooperative federalism, driving key reforms, and enhancing the ‘Ease of Living’ for citizens. The institution continues to serve as a dynamic platform for innovation and long-term strategic thinking across sectors.ప్రధానితో శ్రీ అశోక్ కుమార్ లాహిరి భేటీ
April 25th, 10:43 pm
శ్రీ అశోక్ కుమార్ లాహిరి ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా నియమితులైన ఆయనకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక శాస్త్రం, ప్రభుత్వ విధాన రంగాల్లో శ్రీ లాహిరి అపారమైన అనుభవం.. దేశ సంస్కరణల పథాన్ని మరింత పటిష్టం చేస్తుందనీ, వికసిత భారత్‌గా నిలవాలన్న దేశ సంకల్పాన్ని సాకారం చేయడంలోనూ దోహదపడుతుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్లకు (2031-2035) కేబినెట్ ఆమోదం... యూఎన్ఎఫ్‌సీసీసీకి నివేదించేలా నిర్ణయాలు
March 25th, 05:35 pm
భారత పర్యావరణ కార్యాచరణను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. 2031 నుంచి 2035 కాలానికి గాను దేశపు ‘జాతీయంగా నిర్దేశించిన కట్టుబాట్ల (ఎన్‌డీసీ)’కు ఆమోదం తెలిపింది. యూఎన్ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం దేశం తన పర్యావరణ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు సుస్థిరాభివృద్ధి, వాతావరణపరంగా న్యాయంపై నిబద్ధతను ఈ నిర్ణయంతో పునరుద్ఘాటించింది.భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
February 18th, 08:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లివచ్చారు.‘ఈటీ నౌ’ అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి ప్రసంగం
February 13th, 08:30 pm
ఈ అంతర్జాతీయ వాణిజ్య సదస్సుకు హాజరైన మీకందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు” అనే ఇతివృత్తం ప్రాతిపదికగా మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. వినీత్ గారి ప్రసంగం విన్న తర్వాత, నా పని చాలా సులభమైందని భావిస్తున్నాను. అయితే, నాదొక చిన్న అభ్యర్థన- మీకు దీనిపై ఇప్పటికే అవగాహన ఉంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో అది ‘ఈటీ’లోనూ ప్రతిబింబిస్తూంటుంది.‘ఈటీ నౌ’ అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
February 13th, 08:00 pm
న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభమైన ‘ఈటీ నౌ’ (ET Now) అంతర్జాతీయ వాణిజ్య సదస్సు-2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సదస్సుకు హాజరైన వారందరికీ తొలుత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సదస్సు ఇతివృత్తం “ఒక దశాబ్దపు అంతరాయాలు-ఒక శతాబ్దపు మార్పు”ను ప్రస్తావిస్తూ- ఈ 21వ శతాబ్దపు ప్రస్తుత దశాబ్దంలో అసాధారణ అవరోధాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు. వీటిలో మహమ్మారి కరోనా సహా ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు, సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం వంటివి ప్రపంచ సమతౌల్యాన్ని అతలాకుతలం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి సంక్షోభాలే ఒక దేశ వాస్తవ శక్తిసామర్థ్యాలను తేటతెల్లం చేస్తాయని చెప్పారు. ఇలాంటి అవరోధాలెన్నో ఎదురైనా, ఒక దశాబ్ద కాలంలో బలమైన పనితీరు, ప్రజాస్వామ్య బలోపేతానికి సాగిన కృషి ఫలితంగా భారత్ అద్భుత ప్రగతి సాధించిందని సగర్వంగా ప్రకటించారు. గత దశాబ్దారంభంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ 11వ స్థానంలో ఉండేదని, గందరగోళ పరిస్థితుల నడుమ పతనం తప్పదేమోన్న ఆందోళన దోబూలాడేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. కానీ, గడ్డు కాలాన్ని అధిగమిస్తూ నేడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా శరవేగంతో పురోగమిస్తున్నదని చెప్పారు. ఈ పరిణమాశీల శతాబ్దానికి భారత్ కీలక మూలస్తంభంగా నిలుస్తుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఆ మేరకు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ వాటా 16 శాతానికిపైగా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంతేగాక ఏటికేడు ఈ వాటా పెరుగుతూనే ఉంటుందన్న ఆశాభావం వెలిబుచ్చారు. అంతర్జాతీయ వృద్ధికి సారథ్యం వహిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకంగా ఆవిర్భవించగలదని ఆయన స్పష్టం చేశారు.అనువాదం: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
February 05th, 05:35 pm
ఈ ధన్యవాద తీర్మానానికి మద్దతుగా నా భావాలను ఈ సభ ముందు ఉంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను.రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
February 05th, 05:00 pm
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమాధానమిచ్చారు. ధన్యవాద తీర్మానానికి మద్దతుగా తన భావాలను సభతో పంచుకోవడం అదృష్టమని వ్యాఖ్యానించిన ఆయన.. రాష్ట్రపతి ప్రసంగం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో గడిచిన ఏడాది కాలం అత్యంత వేగవంతమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. దేశం సరైన దిశలో, గొప్ప వేగంతో దేశం ముందుకు సాగుతోందనీ.. సమాజంలోని అన్ని వర్గాల్లో, ప్రతి రంగంలోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ రాష్ట్రపతి సునిశితంగా, స్పష్టంగా వివరించారని శ్రీ మోదీ అన్నారు.నీతి ఆయోగ్‌లో ప్రముఖ ఆర్థికవేత్తలను కలిసిన ప్రధానమంత్రి
December 30th, 06:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నీతి ఆయోగ్ సమావేశంలో భాగంగా ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణుల బృందంతో సమావేశమయ్యారు. 'ఆత్మనిర్భరత-నిర్మాణాత్మక పరివర్తన: వికసిత్ భారత్ కోసం కార్యాచరణ ప్రణాళిక' అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది.భారత్-యూకే సంయుక్త ప్రకటన
October 09th, 03:24 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని స్వీకరించిన యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ 2025 అక్టోబర్ 8,9 తేదీల్లో భారత్‌లో అధికార పర్యటన చేశారు. ఆయన వెంట ఆ దేశ వ్యాపార, వాణిజ్య మంత్రి, వాణిజ్య బోర్డు అధ్యక్షుడు పీటర్ కైల్, స్కాట్లాండ్ మంత్రి డోగ్లస్ అలెగ్జాండర్, పెట్టుబడుల మంత్రి జేసన్ స్టాక్‌వుడ్‌తో పాటు 125 మంది సీఈవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సాంస్కృతిక నాయకులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 25th, 06:42 pm
ఈ రోజు మీరంతా నిజంగా ఓ అద్భుత వాతావరణాన్ని సృష్టించారు. నేను చాలాసార్లు అనుకుంటాను.. ఈ లక్షలాది ప్రజల ప్రేమాశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడినో కదా అని! నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడండీ.. ఓ చిన్న నరేంద్ర అక్కడ నిలబడి ఉన్నాడు!గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసి వాటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
August 25th, 06:15 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి.. శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. యావత్ దేశం ప్రస్తుతం గణేష్ ఉత్సవాల ఉత్సాహంలో మునిగిపోయిందన్నారు. గణపతి బప్పా ఆశీస్సులతో గుజరాత్ పురోగతికి సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శుభప్రదమైన ప్రారంభం జరిగిందని వ్యాఖ్యానించారు. పలు ప్రాజెక్టులను ప్రజల పాదాలకు అంకితం చేసే అవకాశం తనకు లభించిందన్న ప్రధానమంత్రి ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభ సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.Cabinet approves the Prime Minister Dhan-Dhaanya Krishi Yojana
July 16th, 02:51 pm
The Union Cabinet chaired by PM Modi has approved the “Prime Minister Dhan-Dhaanya Krishi Yojana” for a period of six years, beginning with 2025-26 to cover 100 districts. The scheme will result in higher productivity, value addition in agriculture and allied sector, local livelihood creation and also increase domestic production thereby achieving self-reliance (Atmanirbhar Bharat).2025 జాతీయ క్రీడా విధానానికి కేబినెట్ ఆమోదం
July 01st, 04:31 pm
దేశ క్రీడా రంగానికి నూతన ఆకృతిని ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2025-జాతీయ క్రీడా విధానానికి (ఎన్ఎస్పీ) ఆమోదం తెలిపింది. క్రీడల ద్వారా పౌరులను సాధికారులుగా చేయాలని కొత్త విధానం ఆశిస్తోంది.సిక్కిం@50 కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
May 29th, 10:00 am
సిక్కిం గవర్నరు శ్రీ ఒ.పి.ప్రకాశ్ మాథుర్ గారూ, ప్రియతమ ముఖ్యమంత్రీ నా మిత్రుడూ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారూ, నా పార్లమెంటు సహచరులు డోర్జీ షెరింగ్ లెప్చా గారూ, డాక్టర్ ఇంద్రా హంగ్ సుబ్బా గారూ.. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులందరూ, సోదరీ సోదరులారా!‘సిక్కిం@50’ సంబరాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 29th, 09:45 am
గ్యాంగ్‌టక్‌లో నేడు జరిగిన ‘సిక్కిం@50’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘లక్ష్యానికి తగిన పురోగతి, వృద్ధిని పెంపొందించే ప్రకృతి’ అన్న ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 ఏళ్లు పూర్తయిన ఈ ప్రత్యేకమైన రోజున ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందోత్సాహాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్నప్పటికీ, ప్రతికూల వాతావరణం వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని చెప్పారు. త్వరలోనే సిక్కింలో పర్యటించి వారి విజయాలు, వేడుకల్లో భాగమవుతానని మాటిచ్చారు. గడిచిన 50 ఏళ్లలో వారు సాధించిన విజయాలను చాటే రోజుగా దీనిని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేయడంలో సిక్కిం ముఖ్యమంత్రి, ఆయన బృందం ఉత్సాహంతో వ్యవహరించారంటూ ప్రశంసించారు. సిక్కిం రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి అభివృద్ధి చెందిన రాష్ట్రాల ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం: పీఎం
May 24th, 07:56 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి 24 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 7 కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఈ ఏడాది ఈ సమావేశ ఇతివృత్తం ‘వికసిత భారత్ @2047 కోసం వికసిత రాజ్యం’. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించిన అనంతరం ఈ సమావేశం ప్రారంభమైంది.‘ఈటీ నౌ’ ప్రపంచ వాణిజ్య సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
February 15th, 08:30 pm
క్రితం సారి ఈటీ సమిట్ ఎన్నికలు బాగా దగ్గర పడిన సమయంలో ఏర్పాటయ్యింది. మేం పాలన చేపట్టిన మూడోసారి భారత్ మరింత వేగంతో పనిచేస్తుందని అప్పుడు మీకు సవినయంగా మనవి చేశాను. గుర్తుంది కదా! అప్పుడు ప్రస్తావించిన వేగాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూడగలగడం, దేశం నా ఆశయానికి మద్దతుగా నిలవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా బీజేపీ- ఎన్డీఏకు తమ దీవెనలను అందిస్తున్నారు. వికసిత్ భారత్ (సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం) ఆశయానికి ఒడిశా ప్రజలు గత జూన్ లో మద్దతునివ్వగా, అటు తరువాత హర్యానా ప్రజలు, ఇప్పుడు ఢిల్లీ పౌరులూ భారీ మద్దతును తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలంతా ఏకతాటిపై నిలబడుతున్నారు అనేందుకు ఇదో తార్కాణం!