“వికసిత భారత్ కోసం సాంకేతికత.. సంస్కరణలు.. ఆర్థికం” అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

February 27th, 01:01 pm

ఈ ఏడాది తొలి బడ్జెట్ వెబినార్‌లో పాల్గొంటున్న మీకందరికీ స్వాగతం. బడ్జెట్‌ సమర్పణ అనంతరం ఇలా వెబినార్‌ నిర్వహించడం కొన్నేళ్ల నుంచీ ఓ బలమైన ఆనవాయితీగా మారింది. సాధారణంగా వేర్వేరు పారామితుల ప్రాతిపదికన బడ్జెట్‌ అంచనాలు రూపొందుతాయి. కొన్ని సందర్భాల్లో స్టాక్ మార్కెట్ లావాదేవీలపై చర్చ సాగుతుంది. మరి కొన్నిసార్లు ఆదాయపు పన్ను ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వస్తాయి. వాస్తవానికి జాతీయ బడ్జెట్‌ అంటే- ఓ స్వల్పకాలిక వాణిజ్య పత్రం కాదు… ఇదొక విధానపరమైన భవిష్యత్‌ ప్రణాళిక. కాబట్టి, బడ్జెట్ ప్రభావంపై అంచనాలు కూడా నిర్దిష్ట పారామితులు, విధానాల ఆధారంగా వేయాల్సి ఉంటుంది. ఆ విధానాలు మౌలిక సదుపాయాల విస్తరణ, రుణ ప్రవాహ సౌలభ్యం, వాణిజ్య సౌలభ్య కల్పన, పాలనలో పారదర్శకత పెంపు, జన జీవన నాణ్యత మెరుగుదల, కొత్త అవకాశాలను సృష్టించడం వంటివిగా ఉంటాయి. బడ్జెట్‌లో సంబంధిత నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు శాశ్వత శక్తినిస్తాయి… అయితే, ఏ బడ్జెట్‌నైనా విడిగా లేదా స్వతంత్రమైనదిగా పరిగణించే వీలుండదు.

‘వికసిత భారత్ దిశగా సాంకేతిక సంస్కరణలు, ఆర్థిక సహకారం’పై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

February 27th, 11:30 am

‘వికసిత భారత్ దిశగా సాంకేతిక సంస్కరణలు, ఆర్థిక సహకారం’ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ నిర్వహించిన 2026-27 సిరీస్ మొదటి బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. దేశ బడ్జెట్ అంటే స్వల్పకాలిక వాణిజ్య పత్రం కాదని, అది విధానపరమైన ప్రణాళిక అని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను సాకారం చేసుకునే దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బడ్జెట్ మన దేశ ప్రజల ఆర్థిక స్థితిలో మార్పులకు ఎలా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి సమగ్రంగా వివరించారు: ప్రధానమంత్రి

February 12th, 02:13 pm

మన దేశ ప్రజల ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా తోడ్పడుతుందో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ గురించీ, సూక్ష్మ- చిన్న- మధ్యతరహా సంస్థలకు మద్దతు, నైపుణ్యాలకు సాన పట్టడం, రాబోయే కాలం అవసరాలను తీర్చగలిగేలా మౌలిక సదుపాయాల కల్పన , ఆరోగ్య సంరక్షణ , విద్య తదితర రంగాలకు ఊతాన్ని ఇచ్చే దిశగా చేస్తున్న కృషిని ఆమె స్పష్టం చేశారు’’ అని శ్రీ మోదీ వివరించారు.

మలేషియాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని

February 07th, 03:59 pm

ముందుగా ఈ సామాజిక వేడుకలో పాల్గొన్న నా ప్రియ మిత్రుడు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారికి నా ధన్యవాదాలు. ఇప్పుడే చేసిన ప్రసంగంలో భారత్-మలేషియా స్నేహానికి ఉన్న విస్తృతి, భవిష్యత్తు సామర్థ్యం గురించి ఆయన చెప్పిన మంచి మాటలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

February 07th, 03:15 pm

మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇవాళ జరిగిన సామాజిక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. అక్కడ లభించిన ఘన స్వాగతం మన ఉమ్మడి సంస్కృతిలోని అద్భుతమైన వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న తన ప్రియ మిత్రుడు, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం పలకడమే కాకుండా.. ఆయన కారులోనే ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ప్రత్యేక మర్యాదలు భారత్‌పై, ఇక్కడున్న ప్రజలపై ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని చాటుతున్నాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అనువాదం: కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

February 01st, 01:38 pm

నేటి బడ్జెట్ చారిత్రాత్మకమైనది. ఇది దేశంలోని 'నారీ శక్తి' (మహిళా శక్తి) శక్తిమంతమైన ప్రతిరూపంగా ఉంది. ఒక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా గారు వరుసగా తొమ్మిదో సారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించారు. అపారమైన అవకాశాలకు ఒక రాజమార్గం ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ వర్తమాన కాలపు కలలను సాకారం చేయడమే కాకుండా భారత్‌ ఉజ్వల భవిష్యత్తుకు పునాదిని బలపరుస్తుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు మనం వేసే భారీ ప్రయాణానికి ఈ బడ్జెట్ ఒక బలమైన పునాది వంటిది.

2026 కేంద్ర బడ్జెటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన

February 01st, 01:00 pm

భారత్‌లో ప్రస్తుతం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోందనీ, ఈ బడ్జెటుతో ఈ ఎక్స్‌ప్రెస్ ఒక కొత్త శక్తినే కాకుండా ఓ కొత్త జోరును కూడా అందుకొంటుందని శ్రీ మోదీ వెల్లడించారు. ఇంతవరకు చేపట్టనటువంటి సంస్కరణల్ని చేపట్టినందువల్ల, భారత్‌లో వృద్ధి లోకి రావాలని తపించిపోతున్న, ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన యువతకు వారు ఉవ్వెత్తున ఎగరడానికి విశాల గగనాన్ని బడ్జెటు వారి ఎదుట ఆవిష్కరించిందని ఆయన అన్నారు. నమ్మకమైన పాలన, దేశ పౌరుల ప్రయోజనాలకు ప్రాముఖ్యాన్నిచ్చే ఆర్థిక ప్రణాళిక.. ఈ రెండు దృష్టికోణాలనూ బడ్జెటు సాకారం చేసిందని కూడా ఆయన చెప్పారు. ద్రవ్య లోటును తగ్గించడం, ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం, అదే సమయంలో అధిక మూలధన వ్యయానికీ, అధిక అభివృద్ధికీ పూచీని ఇవ్వడం.. వీటిపై దృష్టిని కేంద్రీకరించిన అద్వితీయ బడ్జెటు ఇదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

పార్లమెంట్ బడ్జెటు సమావేశాలు మొదలైన సందర్భంగా ప్రధానమంత్రి వాఖ్యలు

January 29th, 10:15 am

నిన్న, గౌరవ రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడమే కాకుండా, 140 కోట్ల మంది దేశ ప్రజల ఉమ్మడి కృషితో పాటు ఆకాంక్షలకు.. మరీ ముఖ్యంగా యువత ఆకాంక్షలకు నిర్దిష్ట వ్యాఖ్యానంగా ఉన్నది. ఆ ప్రసంగం చట్టసభల సభ్యులందరికీ మార్గదర్శకం కాగల అనేక ఆలోచనల్ని కూడా ఆవిష్కరించింది. సమావేశాల ఆరంభంలో, అదీనూ 2026 సంవత్సరం మొదలయ్యీ మొదలవక ముందే, గౌరవ రాష్ట్రపతి గారు సభలో పేర్కొన్న విషయాలు చాలా సరళ భాషలో దేశాధినేతగా చెప్పిన మాటలు. ఈ మాటలను పట్టి చూస్తే పార్లమెంటు గౌరవ సభ్యులంతా ఈ మాటల్ని గంభీరంగా లెక్క లోకి తీసుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను. నిజానికి, ఈ సమావేశాలు ఎంతో కీలకం. బడ్జెట్ సమావేశాలివి.

పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో విలేకరులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 29th, 10:00 am

పార్లమెంటు 2026 బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది పౌరుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజల కఠోర శ్రమను, యువతరం ఆకాంక్షలను ప్రస్ఫుటం చేసిందని వ్యాఖ్యానించారు. సమావేశాల ప్రారంభానికి ఎంతో ముందుగానే... 2026 ఆరంభ సమయాన అనేక మార్గదర్శకాంశాలను రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులందరి ముందుంచారని ఆయన గుర్తుచేశారు. దేశాధినేతగా రాష్ట్రపతి సరళ ప్రసంగంలో వెలిబుచ్చిన ఆకాంక్షలను ఎంపీలందరూ తప్పక పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఈ సమావేశాలు కీలకమైనవి కాగలవని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇది బడ్జెట్ సమావేశం కావడంతోపాటు 21వ శతాబ్దపు తొలి త్రైమాసికం ముగింపు సహా రెండో త్రైమాసికం ఆరంభాన్ని సూచిస్తుందని ఆయన చెప్పారు. దేశం 2047 నాటికి వికసిత భారత్‌ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో కీలకమన్నారు. ఈ బడ్జెట్ ప్రస్తుత శతాబ్దపు రెండో త్రైమాసికంలో మొదటిదని పేర్కొన్నారు. దేశ తొలి మహిళా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం మన పార్లమెంటరీ చరిత్రలోనే గర్వకారణ క్షణమని ప్రధానమంత్రి అభివర్ణించారు.

భారత ఆర్థిక వ్యవస్థను, మా ప్రభుత్వ సంస్కరణల గురించి ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చాలా స్పష్టంగా వివరించారు: ప్రధానమంత్రి

February 15th, 04:00 pm

భారత ఆర్థిక వ్యవస్థను, మా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను గురించి ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చాలా స్పష్టంగా వివరించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంశించారు.

కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

February 01st, 03:00 pm

దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ఓ ముఖ్య మజిలీకి చేరుకొన్నాం. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్, ఇది మన దేశంలో ప్రతి ఒక్కరి కలలను నెరవేర్చే బడ్జెట్. అనేక రంగాల్లో యువత ప్రవేశించడానికి వీలుగా వాటి తలుపులను మేం తెరిచాం. అభివృద్ధి చెందిన భారత్ ఉద్యమాన్ని ముందుకు నడిపేది సామాన్య పౌరులే. ఈబడ్జెట్ బలాన్ని ఇంతలంతలు చేసేస్తుంది. పొదుపు మొత్తాలను, పెట్టుబడిని, వినియోగాన్ని, వృద్ధిని శరవేగంగా పెంచేయనుంది. ఈ జనతా జనార్దన్ బడ్జెట్ ను.. ప్రజల బడ్జెట్ ను తీసుకువచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీని, ఆమెకు సహకారాన్ని అందించిన ఆమె బృందం సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను.

కేంద్ర బడ్జెటు 2025-26పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన

February 01st, 02:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర బడ్జెటు 2025-26పై తన అభిప్రాయాలను ఈ రోజు వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. భారతదేశం అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ఒక ముఖ్య ఘట్టాన్ని ఆవిష్కరించిందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ఈ బడ్జెటు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అద్దంపట్టడంతోపాటు దేశంలో ప్రతి ఒక్కరి కలలను నెరవేరుస్తుందని వ్యాఖ్యానించారు. యువత కోసం అనేక రంగాల్లో తలుపులను తెరిచారు, సామాన్య పౌరుడే వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాడని ఆయన స్పష్టంచేశారు. ఈ బడ్జెటు బలాన్ని అనేక రెట్లు పెంచనుందని, ఈ బడ్జెటు పొదుపును, పెట్టుబడిని, వినియోగాన్ని, వృద్ధిని ఇంతలంతలు చేస్తుందని ప్రధాని అన్నారు. ‘ప్రజల బడ్జెటు’ను ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు, ఆమె బృందానికి అభినందనలు తెలిపారు.

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి 81% మంది ఇండియా ఇంక్. మద్దతు ఇస్తున్నారు: పరిశ్రమ యొక్క గేమ్-ఛేంజింగ్ మద్దతును నిర్మలా సీతారామన్ ప్రశంసించారు!

January 17th, 04:34 pm

యువత మరియు దేశ ఆర్థిక వ్యవస్థ కోసం దాని పరివర్తన సామర్థ్యాన్ని ఉటంకిస్తూ, ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి కార్పొరేట్ ఇండియా నుండి వచ్చిన అధిక ప్రతిస్పందనను కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. ఈ పథకానికి ఇండియా ఇంక్. నుండి 81% మద్దతు లభిస్తుందని హైలైట్ చేసే నివేదికలపై మాట్లాడుతూ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు విద్య మరియు ఉపాధి అవకాశాల మధ్య అంతరాన్ని ఈ చొరవ తగ్గిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

గ్రామీణ భారతదేశంలో క్రెడిట్-ఆధారిత వినియోగాన్ని నిర్మలా సీతారామన్ ప్రశంసించారు, మన దేశ వృద్ధి కథలో పాల్గొనడానికి ప్రధాని మోదీ గ్రామీణ పేదలకు ఉపకరణాలు ఇచ్చారని చెప్పారు.

October 02nd, 09:19 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క ఆర్థిక చేరిక విధానాలకు మద్దతుగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు గ్రామీణ భారతదేశంలో క్రెడిట్-ఆధారిత వినియోగంలో అనూహ్యమైన పెరుగుదలను జరుపుకున్నారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజెడివై) కింద కొత్త బ్యాంకు ఖాతా తెరవడం మరియు వినియోగదారుల ఫైనాన్సింగ్‌లో లోతుగా ప్రవేశించడం, సీతారామన్ విప్లవాత్మక మార్పు అని పిలుస్తున్నది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశపు తయారీ రంగ పునరాగమన ఉద్యోగాలు 7.6%, వేతనాల పెరుగుదల 5.5%, FY-23 లో జివిఏ 21% పెరుగుదల

October 01st, 08:11 pm

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల FY-23లో తయారీ ఉద్యోగాలు మరియు కార్మికుల వేతనాలలో గణనీయమైన పెరుగుదలను అభినందించారు. ప్రభుత్వ సర్వే ప్రకారం, FY-23లో తయారీ రంగ ఉద్యోగాలు 7.6% పెరిగాయి మరియు వేతనాలు 5.5% పెరిగాయి.

వికసిత భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్, చెన్నైలోని VELS విశ్వవిద్యాలయంలో

April 02nd, 05:30 pm

వికసిత భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ చెన్నైలోని వీఈఎల్ఎస్ యూనివర్సిటీలో జరిగింది. విభిన్న నేపథ్యాల నుండి 1,000 మంది విద్యార్థులు మరియు నగరంలోని 20 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, నిపుణులు మరియు నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ హాజరైన వారిలో FICCI, FLO, EO మరియు YPO నుండి ప్రతినిధులు ఉన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రధాని ప్రసంగం పాఠం

January 31st, 10:45 am

గత పదేళ్లలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా పార్లమెంటులో ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుపోయారని ఆశిస్తున్నాను. . అయితే ప్రజాస్వామిక విలువలను ధ్వంసం చేసే దుష్ప్రచారానికి అలవాటు పడిన అటువంటి చెల్లుబాటయ్యే ఎంపీలందరూ ఈ రోజు చివరి సెషన్‌లో సమావేశమైనప్పుడు, అలాంటి గుర్తింపు పొందిన ఎంపీలందరూ పదేళ్లలో ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకుంటారని, తమ పార్లమెంటరీ నియోజకవర్గంలో 100 మందిని కూడా అడగాలని నేను ఖచ్చితంగా చెబుతాను. ఎవరికీ గుర్తుండదు, ఆ పేరు ఎవరికీ తెలియదు, ఇంత హడావుడి ఎవరు చేసేవారు. అయితే నిరసన గళం పదునైనదైనా, విమర్శలు పదునైనవే అయినా సభలో మంచి ఆలోచనలతో సభకు లబ్ధి చేకూర్చిన వారిని ఇప్పటికీ చాలా మంది గుర్తుంచుకుంటారు.

పార్లమెంటుసమావేశాలు మొదలవడాని కి పూర్వం ప్రసార మాధ్యమాల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

January 31st, 10:30 am

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, క్రొత్త పార్లమెంటు యొక్క ఒకటో సమావేశాన్ని గుర్తుకు తీసుకు వస్తూ, ఆ తొలి సమావేశం లో తీసుకొన్నటువంటి ముఖ్య నిర్ణయాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ ఎండ్ ఎడ్యులేశన్ యాక్టు కు ఆమోదం లభించడం మన దేశ ప్రజల కు ఒక మహత్తరమైనటువంటి క్షణాని కి సూచిక గా నిలచింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26 వ తేదీ నాటి గణతంత్ర దినం సంబురాల ను గురించి ఆయన పేర్కొంటూ, దేశం నారీ శక్తి తాలూకు బలాన్ని, పరాక్రమాన్ని మరియు దృఢ సంకల్పాన్ని అక్కున చేర్చుకొంది అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం మరియు ఆర్థిక మంత్రి నిర్మల సీతారమణ్ గారు సమర్పించబోయేటటువంటి మధ్యంతర బడ్జెటు ల ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ, ఈ ఘటన క్రమాలు మహిళా సాధికారిత ను చాటిచెప్పే వేడుక వంటివి అంటూ అభివర్ణించారు.

యూనియన్ బడ్జెటు 2023 ను గురించి ప్రధాన మంత్రి పలికిన మాటలు

February 01st, 02:01 pm

అమృత కాలం లోని ఈ ఒకటో బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క విరాట సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఒక బలమైన పునాది ని నిర్మించ గలుగుతుంది. ఇది వంచితుల కు పెద్దపీట ను వేసినటువంటి బడ్జెటు. ఈ బడ్జెటు ఆకాంక్ష లు నిండినటువంటి నేటి కాలం సమాజం యొక్క- గ్రామాల, పేదల , రైతు ల మరియు మధ్య తరగతి జనత యొక్క- చెప్పాలంటే అందరి యొక్క కలల ను నెరవేర్చగలదు.

ఈ బడ్జెటు పేదల కు ప్రాధాన్యాన్నిఇస్తున్నది: ప్రధాన మంత్రి

February 01st, 02:00 pm

భారతదేశం యొక్క ‘అమృత కాలం’ లో తొలి బడ్జెటు అయినటువంటి ఈ బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం ఆకాంక్షల ను మరియు సంకల్పాల ను నెరవేర్చేందుకు ఒక గట్టి పునాది ని వేసింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ బడ్జెటు వంచితుల కు ప్రాథమ్యాన్ని కట్టబెట్టిందని, మరి ఇది ఆకాంక్షభరిత సమాజం, పేద ప్రజలు, పల్లె వాసులు, ఇంకా మధ్య తరగతి ప్రజానీకం ల యొక్క కలల ను నెరవేర్చడం కోసం పాటుపడుతుంది అని కూడా ఆయన అన్నారు.