భారత్, సైప్రస్ దేశాల మధ్య సమగ్ర భాగస్వామ్య అమలుపై సంయుక్త ప్రకటన

June 16th, 03:20 pm

అధికారిక పర్యటన నిమిత్తం రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్‌కు వెళ్లిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడ్యులైడ్స్ స్వాగతం పలికారు. సైప్రస్‌లో ప్రధాని జూన్ 15,16 లలో పర్యటిస్తారు. గడచిన రెండు దశాబ్దాల్లో భారత ప్రధాని సైప్రస్‌‌ను సందర్శించడం ఇదే మొదటి సారి. ఈ చరిత్రాత్మక మైలు రాయి.. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దృఢమైన స్నేహాన్ని సూచిస్తుంది. ఈ పర్యటన ఉమ్మడి చరిత్రను మాత్రమే కాకుండా.. రెండు దేశాల వ్యూహాత్మక దృక్పథం, పరస్పర నమ్మకం, గౌరవంతో కూడిన భాగస్వామ్య భవిష్యత్తుకు నిదర్శనంగా నిలుస్తుంది

సైప్రస్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

June 16th, 03:15 pm

భారత్-సైప్రస్ సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు వారి సార్వభౌమత్వాన్నీ, ప్రాదేశిక సమగ్రతనూ పరస్పరం గౌరవిస్తున్నట్లు తెలిపారు. 2025, ఏప్రిల్‌ నెలలో పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించిన సైప్రస్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాల బలమైన నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. సైప్రస్ ఐక్యతకు.. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ఈయూ అక్విస్ విషయంలో సైప్రస్ ఇబ్బందులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

June 16th, 01:45 pm

సాదరంగా స్వాగతం పలికి, మంచి ఆతిథ్యమిచ్చిన గౌరవ అధ్యక్షుడికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్న సైప్రస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అధ్యక్షుడూ, ఇక్కడి ప్రజలూ చూపిన ఆప్యాయతానురాగాలు నిజంగా నా హృదయాన్ని తాకాయి.

సైప్రస్ లో ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III’ స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 16th, 01:35 pm

ఇది ఒక్క నరేంద్ర మోదీకి ఇచ్చిన సత్కారం కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు బహూకరించిన సన్మానం. ఇది వారి బలానికీ, ఆకాంక్షలకూ గుర్తింపు. ఇది మా ఘన సాంస్కృతిక వారసత్వానికీ, ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే మా దర్శనానికీ గుర్తింపు.

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III ను అందుకున్న ప్రధానమంత్రి

June 16th, 01:33 pm

సైప్రస్‌లో ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’’ను ఆ దేశ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టొడౌలిడెస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు.

సైప్రస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

June 15th, 06:06 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం సైప్రస్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఘన స్వాగతం పలికారు.

సైప్రస్, కెనడా, క్రొయేషియాల్లో పర్యటనకు ముందు ప్రధాని ప్రకటన

June 15th, 07:00 am

సైప్రస్, కెనడా, క్రొయేషియా- మూడు దేశాల పర్యటనకు ఈ రోజు నేను బయలుదేరుతున్నాను.

జూన్ 15 నుండి 19 వరకు సైప్రస్ రిపబ్లిక్, కెనడా మరియు క్రొయేషియాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

June 14th, 11:58 am

ప్రధాని మోదీ జూన్ 15-16 తేదీలలో సైప్రస్‌లో, జూన్ 16-17 తేదీలలో జీ-7 శిఖరాగ్ర సమావేశానికి కెనడాకు మరియు జూన్ 18న క్రొయేషియాకు వెళతారు. ప్రధాని మోదీ సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో చర్చలు జరుపుతారు మరియు లిమాసోల్‌లో వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తరువాత కెనడాలో, జీ7 శిఖరాగ్ర సమావేశంలో, ప్రధాని మోదీ జీ-7 దేశాల నాయకులతో అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారు. క్రొయేషియాలో, ప్రధాని మోదీ పీఎం ప్లెన్కోవిక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు మరియు క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్‌తో సమావేశమవుతారు.