సార్థక్-పీడీఎస్ అనే ప్రధాన పథకం కింద ఉన్న రెండు ఉప పథకాలు.. (i) ‘ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద అంతర్గత ఆహార ధాన్యాల రవాణా- ఎఫ్‌పీఎస్ డీలర్ల మార్జిన్ కోసం రాష్ట్ర సంస్థలకు సహాయం’ (ii) ‘ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునికీకరణ- సంస్కరణల పథకాలను (స్మార్ట్ పీడీఎస్)’ విలీనం చేసి కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

May 27th, 02:53 pm

‘సార్థక్ పీడీఎస్‍’ను (స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్-ఇన్‌కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్) ఒక ప్రధాన పథకంగా (అంబ్రెల్లా స్కీమ్) కొనసాగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం అవార్డు కాలంలో రూ. 25,530 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు.