
The new complex will enhance the ease of living for MPs in Delhi: PM Modi
August 11th, 11:00 am
PM Modi inaugurated newly built flats for Members of Parliament at Baba Kharak Singh Marg, New Delhi, commending the engineers and shramjeevis behind the project. He noted that MPs from across India will now live together, symbolising ‘Ek Bharat, Shreshtha Bharat’, and encouraged collective celebration of regional festivals to enhance the complex's cultural vibrancy.
PM Modi inaugurates newly constructed flats for Members of Parliament in New Delhi
August 11th, 10:30 am
PM Modi inaugurated newly built flats for Members of Parliament at Baba Kharak Singh Marg, New Delhi, commending the engineers and shramjeevis behind the project. He noted that MPs from across India will now live together, symbolising ‘Ek Bharat, Shreshtha Bharat’, and encouraged collective celebration of regional festivals to enhance the complex's cultural vibrancy.
PM to inaugurate newly constructed flats for Members of Parliament in New Delhi
August 10th, 10:44 am
PM Modi to inaugurate 184 newly built Type-VII Multi-Storey Flats for Members of Parliament at Baba Kharak Singh Marg, New Delhi. Addressing the housing shortage for MPs, the eco-friendly and Divyang-friendly complex meets GRIHA 3-star and NBC 2016 norms, is earthquake-resistant, promotes energy conservation and waste management, offers 5,000 sq. ft. units with modern amenities, and uses advanced, durable construction technology.ఆగస్టు 10న కర్ణాటకలో పర్యటించనున్న ప్రధానమంత్రి
August 09th, 02:20 pm
ఆగస్టు 10న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బెంగళూరు మెట్రో పసుపు రంగు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఆర్వీ రోడ్ (రాగిగుడ్డ) నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు.న్యూఢిల్లీ కర్తవ్య పథ్‌లో కర్తవ్య భవన్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 06th, 07:00 pm
ఆగస్టు నెల విప్లవాల మాసం. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఈ చరిత్రాత్మక ఘట్టం! నవ భారత నిర్మాణం దిశగా ఒక్కో విజయమూ సాకారమవుతోంది. ఇక్కడే దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథ్, కొత్త సంసద్ భవన్ (పార్లమెంట్ భవనం), కొత్త రక్షా భవన్ (రక్షణ కార్యాలయ సముదాయం), భారత్ మండపం, యశోభూమి, అమరవీరుల స్మారకార్థం జాతీయ యుద్ధ స్మారక చిహ్నం, నేతాజీ సుభాష్ బాబు విగ్రహం, ఇప్పుడు ఈ కర్తవ్య భవన్లను నిర్మించాం. ఇవి కేవలం కొత్త భవనాలో లేదా సాధారణ మౌలిక సదుపాయాలో మాత్రమే కాదు... ఈ భవనాల్లోనే ఈ అమృతకాలంలో ‘వికసిత భారత్’ కోసం విధానాలు రూపుదిద్దుకోబోతున్నాయి. ‘వికసిత భారత్’ కోసం కీలక నిర్ణయాలను ఇందులోనే తీసుకోబోతున్నారు. వచ్చే దశాబ్దాల్లో ఈ భవనాలే దేశం దశా దిశా నిర్ణయించబోతున్నాయి. కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, కార్మికులందరికీ కూడా ఈ వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కర్తవ్య భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని
August 06th, 06:30 pm
ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఈరోజు కర్తవ్య భవన్-3 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆగస్టు 15 కంటే ముందే క్రాంతికారక మాసమైన ఈ నెల మరో చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తోందని అన్నారు. ఆధునిక భారత్ నిర్మాణంతో ముడిపడి ఉన్న కీలక మైలురాళ్లను దేశం ఒకదాని తర్వాత ఒకటి దాటుతోందని ప్రధానంగా చెప్పారు. ఢిల్లీ గురించి మాట్లాడుతూ మౌలిక సదుపాయాల విషయంలో ఇటీవల జరిగిన పురోగతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కర్తవ్య పథ్, కొత్త పార్లమెంట్ భవనం, కొత్త రక్షణ కార్యాలయాల సముదాయం, భారత్ మండపం, యశోభూమి, అమరవీరులకు సంబంధించిన జాతీయ యుద్ధ స్మారక చిహ్నం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహంతో పాటు ప్రస్తుత ప్రారంభోత్సవం జరుగుతోన్న కర్తవ్య భవన్లను ప్రస్తావించారు. ఇవి కేవలం కొత్త భవనాలు లేదా సాధారణ మౌలిక సదుపాయాలు కాదని ప్రధానంగా చెబుతూ.. అమృత్ కాలంలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రూపొందించే విధానాలు వీటిలో తయారౌతాయని అన్నారు. రాబోయే దశాబ్దాల్లో దేశం ప్రయాణించే మార్గం కూడా వీటిలోనే నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు. కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు, కార్మికులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.భారత ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంయుక్త ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం
August 05th, 11:06 am
భారతదేశానికి వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన బృందానికి మొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాది భారత్, ఫిలిప్పీన్స్ 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకలను జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన దౌత్య సంబంధాలు ఈమధ్యే ప్రారంభమైనవైనప్పటికీ, మన నాగరికతల బంధం చాలా పురాతనమైనది. ఫిలిప్పీన్స్ రామాయణ రూపం అయిన మహారదియా లవానా మన సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతను తెలియజెబుతుంది. ఇరుదేశాల జాతీయ పుష్పాలతో విడుదల చేసిన తపాలా స్టాంపులు మన స్నేహ పరిమళాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
August 02nd, 11:30 am
నమఃపార్వతీ పతయే.. హర హర మహాదేవ.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీలోని నా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ సందర్భంగా మీకందరికీ ఇదే నా ప్రణామం.వారణాసిలో దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 02nd, 11:00 am
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వారణాసిని సందర్శించడం, ఇక్కడి ప్రజలను కలవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వారణాసి ప్రజలతో తనకు భావోద్వేగ అనబంధముందన్న శ్రీ మోదీ.. ఆదరాభిమానాలను కనబరిచిన నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులతో సంభాషించడంపై శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.పదమూడు జిల్లాల్లో మల్టిట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం.. ఈ జిల్లాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందినవి.. ఈ ప్రాజెక్టులతో సుమారు 574 కి.మీ. మేర విస్తరించనున్న భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్వర్క్
July 31st, 03:13 pm
ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమై, దాదాపు రూ.11,169 కోట్ల వ్యయంతో రైల్వేల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన 4 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఇవీ..:రూ. 2,000 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ పథకం "గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ)కు కేబినెట్ ఆమోదం
July 31st, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ’ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రూ. 2,000 కోట్ల వ్యయంతో 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేళ్ల కాలానికి (ఏటా రూ. 500 కోట్లు) అమలు చేయనున్నారు.తమిళనాడు తూత్తుకుడిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
July 26th, 08:16 pm
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, నా కేబినెట్ సహచరులు కింజరపు రామమోహన్ నాయుడు గారు, డా. ఎల్. మురుగన్ గారు, తమిళనాడు మంత్రులు తంగం తెన్నరసు గారు, డా. టి.ఆర్.బి. రాజా గారు, పి. గీతా జీవన్ గారు, అనితా ఆర్. రాధాకృష్ణన్ గారు, ఎంపీ కణిమొళి గారు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మన ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ గారు, తమిళనాడు సోదర సోదరీమణులారా!తమిళనాడు తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
July 26th, 07:47 pm
తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రాంతీయంగా అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరచడంతోపాటు.. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంచేలా, శుద్ధ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ రంగాల్లో వరుసగా చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ వీర సైనికులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. సాహసికులైన వీరయోధులకు ప్రణమిల్లారు. దేశం కోసం ప్రాణత్యాగానికీ వెనుకాడని అమరులకు మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.ప్రధానమంత్రి మాల్దీవ్స్ పర్యటనలో ముఖ్యాంశాలు
July 26th, 07:19 am
మాల్దీవ్స్‌కు రూ.4,850 కోట్ల దశలవారీ రుణ (ఎల్వోసీ) సౌకర్యం పొడిగింపుమాల్దీవ్స్ అధ్యక్షుడితో సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
July 25th, 06:00 pm
ఇది భారత్-మాల్దీవ్స్ దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవ ఏడాది కూడా కావడం విశేషం. వాస్తవానికి ఈ బంధానికిగల మూలాలు చరిత్రకన్నా ప్రాచీనమైనవేగాక, సముద్రమంతటి లోతైనవి కూడా. అనాదిగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ రోజు స్మారక స్టాంపును ఆవిష్కరించాం. దీనిపై కనిపించే రెండు దేశాల సంప్రదాయ పడవల చిత్రం చూస్తే- చరిత్రలో మనం ఇరుగుపొరుగు మాత్రమే కాదని, సహ ప్రయాణికులమని స్పష్టమవుతుంది.జులై 26, 27 తేదీల్లో ప్రధాని తమిళనాడు పర్యటన
July 25th, 10:09 am
యూకే, మాల్దీవుల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళనాడు సందర్శిస్తారు. ట్యుటికోరన్‌లో జులై 26 రాత్రి 8 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 4,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేస్తారు.పశ్చిమ బెంగాల్... దుర్గాపూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
July 18th, 02:35 pm
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు హర్దీప్ సింగ్ పురీ గారు, శాంతనూ ఠాకుర్ గారు, సుఖాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, పార్లమెంటులో నా సహచరులు సౌమిక్ భట్టాచార్య గారు, జ్యోతిర్మయ్ సింగ్ మహతో గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా, నమస్కారం!పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
July 18th, 02:32 pm
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయగా, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన దుర్గాపూర్, భారతీయ శ్రామిక శక్తికి కూడా ఒక ప్రధాన కేంద్రమని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధికి ఈ నగరం అందిస్తున్న గణనీయమైన సహకారాన్ని గుర్తిస్తూ.. దాని సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఈ రోజు లభించిందన్నారు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాయని, గ్యాస్ ఆధారిత రవాణాను, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తాయని, ఉక్కు నగరంగా దుర్గాపూర్ గుర్తింపును పెంపొందిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ‘‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’’ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయని, పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు తోడ్పడతాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో యువతకు లెక్కలేనన్ని నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని హామీ ఇచ్చారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.జులై 18న... బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటన
July 17th, 11:04 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18న బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం 11:30 గంటలకు బీహార్ లోని మోతీహారీలో రూ. 7,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు. అనంతరం, ఒక బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.నమీబియా జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 08:14 pm
ప్రతి ఒక్కరికి శుభాభినందనలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అద్భుత అవకాశాన్ని మీకు మీ ప్రజలు కల్పించారు. రాజకీయాల్లో ఇదొక గొప్ప అవకాశమే కాక, పెద్ద సవాలు కూడా! మీ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయగలరని ఆశిస్తున్నాను.