నమీబియా జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 08:14 pm
ప్రతి ఒక్కరికి శుభాభినందనలతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అద్భుత అవకాశాన్ని మీకు మీ ప్రజలు కల్పించారు. రాజకీయాల్లో ఇదొక గొప్ప అవకాశమే కాక, పెద్ద సవాలు కూడా! మీ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయగలరని ఆశిస్తున్నాను.Prime Minister addresses the Namibian Parliament
July 09th, 08:00 pm
PM Modi addressed the Parliament of Namibia and expressed gratitude to the people of Namibia for conferring upon him their highest national honour. Recalling the historic ties and shared struggle for freedom between the two nations, he paid tribute to Dr. Sam Nujoma, the founding father of Namibia. He also called for enhanced people-to-people exchanges between the two countries.పత్తి దిగుబడిపై చర్చ కోసం ఉన్నత స్థాయి సమావేశాన్ని
July 09th, 07:55 pm
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పంటల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఈనెల 11న కోయంబత్తూరులో పత్తి దిగుబడి అంశంపై కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో తెలిపారు. భారత రైతు సోదరసోదరీమణులంతా పత్తి దిగుబడి పెంపు గురించి సూచనలు ఇవ్వాలని ఆయన ఆహ్వానించారు.అనువాదం: నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్ స్వీకరిస్తున్న సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 09th, 07:46 pm
నమీబియా అధ్యక్షురాలి చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్’ పురస్కారాన్ని అందుకోవడాన్ని గొప్ప గౌరవంగానూ, గర్వంగానూ భావిస్తున్నాను.నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధానమంత్రి
July 09th, 07:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమీబియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి నమీబియా అధ్యక్షురాలు గౌరవ నెటుంబో నాండి-ఎన్‌డైత్వా ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నేత ఆయనే.PM Modi arrives in Windhoek, Namibia
July 09th, 12:15 pm
Prime Minister Narendra Modi arrived in Namibia a short while ago. In Namibia, PM Modi will hold discussions with President Netumbo Nandi-Ndaitwah and also address the Joint Session of Namibian Parliament.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.