ప్రధానమంత్రితో నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమా సమావేశం
June 25th, 10:40 pm
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ద్రవ్య వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న నెదర్లాండ్స్ మహారాణి మాగ్జిమా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దీనిపై ప్రధానమంత్రి వివరిస్తూ- “దేశమంతటా చౌకగా, విస్తృతంగా ఆర్థిక సేవల ప్రదానంలో భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల విప్లవం తోడ్పాటు సహా ఇతరత్రా అంశాలపై మేం చర్చించాం” అని పేర్కొన్నారు. ప్రపంచంలోని భాగస్వామ్య దేశాలతో ఈ అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.
May 31st, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:15 am
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.నెదర్లాండ్స్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందాలు... ఒడంబడికలు
May 17th, 02:47 am
భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక [2026-2030]నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ ఎటెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక చర్చలు
May 17th, 02:35 am
ఈ సమావేశంలో భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, విశ్వాసంతోపాటు సమన్వయం, సహకారం ఇనుమడించడాన్ని ప్రతిబింబిస్తూ, ఈ స్నేహబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, అత్యాధునిక-కీలక సాంకేతికతలు, సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం, విద్యా రంగాల్లో సహకార విస్తృతి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యంపై భవిష్యత్ ప్రణాళిక ఆమోదానికి నిశ్చయించారు. ఉభయ పక్షాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత-ఆవిష్కరణల భాగస్వామ్య విస్తరణ సహా భారత వృద్ధి ప్రస్థానం డచ్ కంపెనీలకు ఆశావహ వ్యాపార అవకాశాలను కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.నెదర్లాండ్స్ పీఎం రాబ్ జెట్టెన్‌తో ప్రతినిధుల స్థాయి సమావేశం సందర్భంగా పీఎం ప్రసంగం
May 16th, 11:58 pm
నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత నెదర్లాండ్స్‌ను సందర్శించటం నాకెంతో సంతోషంగా ఉంది. గత పదేళ్లలో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యం గణనీయంగా పురోగతిని సాధించింది.సెమీకండక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సంతకాలు చేసిన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్
May 16th, 10:30 pm
గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్‌లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమక్షంలో సంతకాలు చేశాయి.చోళ తామ్ర పత్రాలు భారత్‌కు అప్పగింత
May 16th, 10:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ రాబ్ జెట్టెన్‌ల సమక్షంలో ఈ రోజు 11వ శతాబ్దపు చోళుల తామ్ర పత్రాలను లైడెన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయం భారత ప్రభుత్వానికి అప్పగించింది.నెదర్లాండ్స్‌లో సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రధాని ప్రసంగం
May 16th, 10:00 pm
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు నిలయాలైన కొన్ని కంపెనీల అధినేతల నడుమ ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు 300కు పైగా డచ్ కంపెనీలు భారత్ ప్రస్థానంలో భాగమయ్యాయి. భారత్ పట్ల మీకున్న సానుకూల దృక్పథం, విశ్వాసం వల్లే.. ఐరోపా నుంచి భారత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా, రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ నిలిచింది.నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రధానమంత్రి
May 16th, 08:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హేగ్‌లోని ప్యాలెస్ హౌస్ టెన్ బాష్‌లో నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.నెదర్లాండ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
May 15th, 11:35 pm
తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా రెండో దశలో ప్రధాని మోదీ నెదర్లాండ్స్‌కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
May 15th, 07:56 am
ప్రధాని మోదీ 2026 మే 15 నుండి 20 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన వివిధ దేశాధినేతలతో సమావేశమై, కీలక రంగాలలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో జరిగే 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' మరియు ఓస్లోలో జరిగే '3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్'లో ఆయన పాల్గొనడం ఈ పర్యటనలోని ముఖ్యాంశాలు.ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)
May 11th, 09:00 pm
ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.నెదర్లాండ్స్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
March 30th, 09:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో మాట్లాడారు. “భారత-నెదర్లాండ్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై మేం చర్చించాం. ముఖ్యంగా సెమీకండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, నిపుణుల పరస్పర పర్యటనలు వంటి రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్య అవకాశాల గురించి ప్రస్తావించాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిసుస్థిరతలను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాబ్ జెట్టెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
February 24th, 02:33 pm
నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాబ్ జెట్టెన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.Visit of H.E. Mr. Dick Schoof, Prime Minister of the Netherlands, to India
February 19th, 08:47 pm
PM Modi held a bilateral meeting with H.E. Mr. Dick Schoof, Prime Minister of the Netherlands. Prime Minister Schoof underscored the importance of the Summit and expressed confidence that the Summit Declaration will steer future policy discussions. Reviewing the bilateral relationship, both leaders welcomed the steady progress in the India-Netherlands partnership.ఫిబ్రవరి 16న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026'ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
February 15th, 02:21 pm
2026 ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్
December 18th, 06:51 pm
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్ భారత ప్రధానమంత్రి శ్ర నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించారు.నెదర్లాండ్స్ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు ప్రధాని మోదీ అభినందనలు
July 02nd, 08:22 pm
నెదర్లాండ్స్ ప్రధాని డిక్ షూఫ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనం, జల నిర్వహణ, వ్యవసాయం తదితర రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా సంయుక్త కృషికి భారత్ సిద్ధంగా ఉందని శ్రీ మోదీ తెలిపారు.