డాక్టర్ కే కస్తూరి రంగన్ మృతికి ప్రధాని సంతాపం

April 25th, 02:34 pm

భారత సైన్స్, విద్యా రంగాల్లో మహోన్నత వ్యక్తిగా పేరు గాంచిన డాక్టర్ కే కస్తూరి రంగన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. అంకితభావంతో ఇస్రోకు సేవలందించిన డాక్టర్ కే కస్తూరి రంగన్, భారతీయ అంతరిక్ష రంగాన్ని నూతన శిఖరాలు అధిరోహించేలా చేశారని శ్రీ మోదీ అన్నారు. ‘‘జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ముసాయిదాను రూపొందించడంలో, దేశంలో అభ్యాసం సమగ్రంగా, భవిష్యత్తుకు తగినట్టుగా ఉండేలా డాక్టర్ కస్తూరి రంగన్‌ చేసిన కృషికి భారత్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది. ఎంతో మంది యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఆయన ఉత్తమ మార్గదర్శిగా ఉన్నారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి ముఖాముఖి సంభాషణ పాఠం

September 06th, 04:15 pm

ఉపాధ్యాయురాలు - గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ, నమస్కారం! నా పేరు ఆశారాణి, జార్ఖండ్ లోని బొకారోలోని చందన్కియారీలోని '12 హైస్కూల్' లో పని చేస్తున్నాను.

జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి

September 06th, 04:04 pm

జాతీయ విద్యా విధాన ప్రభావం, మాతృభాషలో విద్యాభ్యాస ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వారితో చర్చించారు. వేర్వేరు భాషల్లో స్థానిక జానపద కథలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవడంతో పాటు వైవిధ్యమైన భారతదేశ సంస్కృతి గురించి తెలుసుకుంటారని అన్నారు.