జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాహవంతులైన సిబ్బందికి ప్రధానమంత్రి వందనం

January 19th, 09:30 am

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆ దళంలోని సిబ్బంది చూపే ధైర్యసాహసాలను, అంకితభావాన్ని, నిస్వార్థ సేవలను ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Talking to you felt like talking to a family member, not the Prime Minister: Farmers say to PM Modi

October 12th, 06:45 pm

During the interaction with farmers at a Krishi programme in New Delhi, PM Modi enquired about their farming practices. Several farmer welfare initiatives like Government e-Marketplace (GeM) portal, PM-Kisan Samman Nidhi, Pradhan Mantri Matsya Sampada Yojana, and PM Dhan Dhaanya Krishi Yojana were discussed. Farmers thanked the Prime Minister for these initiatives and expressed their happiness.

కృషి కార్యక్రమంలో భాగంగా రైతులతో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 12th, 06:25 pm

న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)లో ఈ రోజు ఒక వ్యవసాయ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా రైతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. రైతుల సంక్షేమం, వ్యవసాయంలో స్వయంసమృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనను బలపరిచే దిశగా ప్రధానమంత్రి కనబరుస్తున్న నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది. శ్రీ మోదీ ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొని, వ్యవసాయ రంగంలో రూ.35,440 కోట్ల ఖర్చుతో రెండు ప్రధాన పథకాలను ప్రారంభించారు. అంతకు ముందు, రైతులతో ఆయన సంభాషించారు. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ పథకానికి రూ.24,000 కోట్లు ఖర్చు చేస్తారు. ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భర్‌తా ఇన్ పల్సెస్’ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ పథకానికి రూ.11,440 కోట్లు ఖర్చు చేస్తారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య పరిశ్రమ, ఆహార శుద్ధి రంగాల్లో రూ.5,450 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో సంకల్పించిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. వీటికి అదనంగా, సుమారు రూ.815 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఇతర ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

డెహ్రాడూన్‌లో ప్రధాని పర్యటన.. ఉత్తరాఖండ్‌లో వరద నష్టం అంచనాపై సమీక్ష సమావేశం

September 11th, 06:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబరు 11న డెహ్రాడూన్‌ను సందర్శించి.. ఉత్తరాఖండ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద పరిస్థితినీ, మేఘ విస్ఫోటం, వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల కలిగిన నష్టాన్నీ సమీక్షించారు.

పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే

September 09th, 05:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 9న పంజాబ్‌ చేరుకుని… వరద పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేశారు.

హిమాచల్ ప్రదేశ్ లోని వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పీఎం ఏరియల్ సర్వే

September 09th, 03:01 pm

హిమాచల్ ప్రదేశ్ లో మేఘ విస్ఫోటనం వల్ల వచ్చిన వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 9 సెప్టెంబర్ 2025న ఆ రాష్ట్రానికి వెళ్లారు.