ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
July 09th, 12:34 pm
ప్రస్తుతం ఉన్న భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనను (2009) ఇది పునరుద్ధరిస్తుంది. దళాల పరస్పర నిర్వహణ, సామర్థ్య పెంపుదల, సముద్ర తీర పరిధి, రక్షణ పారిశ్రామిక సహకారం, సైబర్ భద్రత- సాంకేతికత, ఉగ్రవాద నిరోధం, హెచ్ఏడీఆర్లతో పాటు యూఎన్సీఎల్ఓఎస్, ఆసియాన్, పీఐఎఫ్, ఐఓఆర్ఏలలో ఏకీకృత విధానాన్ని అనుసరించడాన్ని ఇది సహకార రంగాలుగా గుర్తిస్తుంది.