PM chairs 52nd PRAGATI Meeting

June 24th, 09:04 pm

PM Modi reviewed major infrastructure projects worth around ₹30,000 crore and stressed timely implementation through PM GatiShakti. He also reviewed progress under the TB Mukt Bharat Abhiyan, emphasizing the use of digital technologies and AI. PM Modi further called for stronger coordination, faster response mechanisms and improved grievance redressal to tackle cyber crime and digital fraud.

న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

January 28th, 04:00 pm

కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి, రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌జీ, వేదికపై ఉన్న అతిథులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, శకటాల కళాకారులు, రాష్ట్రీయ రంగశాల ఉద్యోగులు, నా యువ మిత్రులు.. మీ అందరి కృషి ఇక్కడ కనిపిస్తోంది. మంచి సమన్వయంతో మీరు చక్కటి ప్రదర్శన ఇచ్చారు.

ఢిల్లీలో జరిగిన వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 03:30 pm

ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు నిర్వహించిన వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ కేడెట్లు, నాటక కళాకారులు, జాతీయ రంగశాల కళాకారులు, దేశంలోని వివిధ ప్రాంతాల యువ ప్రతినిధుల కృషి.. సమన్వయంతో కూడిన ఈ ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. నేటి ఉదయం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ గారితోపాటు కొందరు సహచరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దేశానికి ఎంతో శోకాన్ని మిగిల్చిందని ఆవేదన చెందారు. మహారాష్ట్రతోపాటు దేశాభివృద్ధిలో అజిత్ దాదా విశేష కృషి చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలోనూ, అక్కడకు వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు, ముఖ్యంగా మిత్ర దేశాల నుంచి వచ్చిన వారికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది బాలికల భాగస్వామ్యం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జనవరి 28న ఎన్ సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

January 27th, 05:52 pm

ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్ లో 28 జనవరి 2026న జరిగే వార్షిక ఎన్ సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం

February 06th, 04:21 pm

భారత్ సాధించిన విజయాలను, భారత్ పట్ల ప్రపంచ అంచనాలను, 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణం కోసం దేశంలోని సామాన్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంకల్పాన్ని గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎంతో చక్కగా వివరించారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా సాగిన వారి ప్రసంగం మనందరికీ భవిష్యత్ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఈ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రసంగానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్యస‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మాధానం

February 06th, 04:00 pm

పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, భారత్‌పై ప్రపంచం అంచనాలు, వికసిత భారత్‌ సంకల్ప సాకారంలో సామాన్యుల ఆత్మవిశ్వాసంవగైరాలను రాష్ట్రపతి ప్రసంగం విశదీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రభావవంతమైన ఈ ప్రసంగం భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసేదిగా ఉందని అభివర్ణించారు. ఇంతటి ఉత్తేజకర ప్రసంగం చేసినందుకుగాను రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.

ఢిల్లీలోని క‌రియ‌ప్ప పెరేడ్ మైదానంలో ఎన్‌సిసి ర్యాలీ సంద‌ర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 27th, 05:00 pm

కేంద్ర మంత్రిమండలిలోని నా సహచరులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ సంజయ్ సేథ్, ‘సిడిఎస్‌’ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ కార్యదర్శి గారు, ‘ఎన్‌సిసి’ డీజీగారు, ఇతర అతిథులు నా ప్రియ ‘ఎన్‌సిసి’ యువ మిత్రులారా!

వార్షిక ‘ఎన్‌సిసి పిఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 27th, 04:30 pm

దేశ రాజధాని ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ నిర్వహించిన వార్షిక ‘నేషనల్ కేడెట్‌ కోర్‌ (ఎన్‌సిసి) పీఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించడంతోపాటు ఉత్తమ కేడెట్లకు పురస్కార ప్రదానం చేశారు. ‘ఎన్‌సిసి దినోత్సవం’ నేపథ్యంలో సభికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ- 18 మిత్రదేశాల నుంచి దాదాపు 150 మంది కేడెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారందరినీ స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ‘మేరా యువ భారత్’ (మై భారత్) పోర్టల్ ద్వారా దేశం నలుమూలల నుంచి ఆన్‌లైన్‌లో పాల్గొన్న యువతను కూడా ఆయన అభినందించారు.

గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే ‘ఎన్‌సిసి’.. ‘ఎన్‌ఎస్‌ఎస్‌’ కార్యకర్తలతో ప్రధానమంత్రి సంభాషణ

January 25th, 03:30 pm

సర్‌... మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలన్న నా కల ఈ రోజు నెరవేరింది

‘ఎన్‌సిసి’ కేడెట్లు.. ‘ఎన్‌ఎస్‌ఎస్‌’ వలంటీర్లు.. గిరిజన అతిథులు.. శకట కళాకారులతో ప్రధానమంత్రి మాటామంతీ

January 25th, 03:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న (జనవరి 24న) గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ‘ఎన్‌సిసి’ కేడెట్లు, ‘ఎన్‌ఎస్‌ఎస్‌’ వలంటీర్లు, గిరిజన అతిథులు, శకట కళాకారులతో ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోగల తన నివాసంలో ముచ్చటించారు. దేశ ప్రధానిని ప్రత్యక్షంగా కలుసుకోవడంపై వారంతా ఎంతో సంతోషం ప్రకటించగా- “ఇది భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్లు, గిరిజన ప్రతినిధులు, శకటాల కళాకారులతో ప్రధాని సంభాషణ

January 24th, 08:08 pm

త్వరలో జరగబోతున్న గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్ఎస్ వాలంటీర్లు, గిరిజన ప్రతినిధులు, శకటాల కళాకారులతో లోకకల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సంభాషించారు. అనంతరం భారతదేశ సంస్కృతి, వైవిధ్యాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.

భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

November 24th, 11:30 am

మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్‌లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.

న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగం

January 27th, 05:00 pm

కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అజయ్ భట్ గారు, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, డిజి ఎన్ సిసి, అందరూ విశిష్ట అతిథులు మరియు ఎన్ సిసి నుండి నా యువ కామ్రేడ్ లు!

ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని

January 27th, 04:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించారు. శ్రీ మోదీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. బెస్ట్ క్యాడెట్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్‌సీసీ బాలికల మెగా సైక్లోథాన్, ఝాన్సీ నుండి ఢిల్లీ వరకు నారీ శక్తి వందన్ రన్ (ఎన్ఎస్ఆర్వి) లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను ఒక మాజీ ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్నందున, వాటిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమని అన్నారు. “ ఎన్‌సీసీ క్యాడెట్‌ల మధ్య ఉండటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచనను హైలైట్ చేస్తుంది”, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్యాడెట్‌లను చూసిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎన్‌సిసి రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేసిన ఆయన, నేటి సందర్భం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ పథకం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా గ్రామాల సర్పంచ్‌లు, దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఉన్నారని ఆయన గుర్తించారు.