ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 16th, 03:00 pm

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ప్రజాదరణ పొందిన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏలు అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు...

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.13,430 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 16th, 02:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత అహోబిలంలోని నరసింహ స్వామితోపాటు మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పించారు. అలాగే సకలజన సౌభాగ్యం ఆకాంక్షిస్తూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కోరారు.

అందరికీ మహా నవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

October 01st, 09:26 am

ఈ రోజు మహా నవమి. ఈ సందర్భంగా, దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మహా అష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

September 30th, 09:11 am

మహా అష్టమి శుభ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ సుఖశాంతులనూ, ఉత్తమమైన ఆరోగ్యాన్నీ అందించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. అమ్మవారి స్తుతిని కూడా శ్రీ మోదీ పంచుకున్నారు.

BJP’s connection with Delhi goes back to the Jana Sangh days and is built on trust and commitment to the city: PM Modi

September 29th, 08:40 pm

Inaugurating the Delhi BJP’s new office, PM Modi said, “On this auspicious occasion of Navratri, Delhi BJP has received its new office today. It is a moment filled with new dreams and fresh resolutions.” He added, “For us, every BJP office is no less than a shrine, no less than a temple. A BJP office is not merely a building. It is a strong link that connects the Party with the grassroots and with people’s aspirations.”

PM Modi inaugurates Delhi BJP’s new office at Deendayal Upadhyaya Marg

September 29th, 05:00 pm

Inaugurating the Delhi BJP’s new office, PM Modi said, “On this auspicious occasion of Navratri, Delhi BJP has received its new office today. It is a moment filled with new dreams and fresh resolutions.” He added, “For us, every BJP office is no less than a shrine, no less than a temple. A BJP office is not merely a building. It is a strong link that connects the Party with the grassroots and with people’s aspirations.”

దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించిన ప్రధానమంత్రి

September 29th, 09:43 am

నవరాత్రి సందర్భంగా దేశ ప్రజల అభ్యున్నతీ, సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మ వారికి నిండుమనసుతో ప్రార్థన చేశారు.

అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి.. అందరికీ శక్తితో పాటు సుఖశాంతులు దక్కాలని కోరుకున్న ప్రధాని

September 28th, 09:00 am

దేశానికి మంచి జరిగేందుకు ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమ్మవారికి ప్రార్థనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో దేశ ప్రజలంతా సుఖశాంతులతో, ధైర్యంతో, మనోనిబ్బరంతో ఉండేలా అనుగ్రహించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించారు.

అందరికీ విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ప్రసాదించాలని కోరుతూ నవరాత్రి ప్రార్థన చేసిన ప్రధానమంత్రి

September 27th, 08:42 am

నవరాత్రి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జగన్మాతకు భక్తితో నమస్కరించి, పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బీహార్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 26th, 11:30 am

ఈ నవరాత్రి పర్వదిన సమయాన ఇవాళ బీహార్ రాష్ట్ర నారీశక్తి ఆనందంలో పాలుపంచుకునే అదృష్టం నాకు దక్కింది. ఇక్కడ టీవీ తెరపై లక్షలాదిగా తల్లులు..చెల్లెమ్మలు నాకు కనిపిస్తున్నారు. ఈ పండుగ వేళ మీ ఆశీస్సులే మాకు ఎనలేని ఉత్సాహాన్నిస్తాయి. ఇందుకుగాను మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్రంలో “ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం” నేటి నుంచి అమలులోకి వచ్చింది. నాకు లభించిన సమాచారం ప్రకారం... ఇప్పటికే 75 లక్షల మంది అక్కచెల్లెళ్లు ఈ పథకంలో చేరగా, ఇప్పుడు వారందరి బ్యాంకు ఖాతాలకు ఏకకాలంలో తలా రూ.10,000 వంతున నగదు జమ చేశారు.

బీహార్‌ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 26th, 11:00 am

బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నవరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ మహిళలతో కలిసి వారి వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ఈ రోజు ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇప్పటికే 75 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమంలో చేరారని శ్రీ మోదీ తెలిపారు. ఈ 75 లక్షల మంది మహిళల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలకు ఒకేసారిగా రూ. 10,000 బదిలీ చేసినట్లు ఆయన ప్రకటించారు.

నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 26th, 10:00 am

నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని భక్తజనులందరికీ శ్రేయస్సును కలగజేయాల్సిందని ప్రార్థించారు.

నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 25th, 08:08 am

నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మ వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

నవరాత్రి మూడో రోజున చంద్రఘంట దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 24th, 08:43 am

నవరాత్రి మూడో రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ చంద్రఘంట దేవిని ప్రార్థించారు.

నవరాత్రి సందర్భంగా రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 23rd, 09:23 am

నవరాత్రి సందర్భంగా రెండో రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించారు.

త్రిపురలో ఉదయ్ పూర్ లోని మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రార్థనలు చేసిన ప్రధానమంత్రి

September 22nd, 09:41 pm

త్రిపురలోని ఉదయ్ పూర్ లో మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన చేశారు. భారతీయులంతా ఆరోగ్యంగానూ, సుభిక్షంగానూ ఉండాలని కోరుకున్నాను అని శ్రీ మోదీ తెలిపారు.

నవరాత్రి సందర్భంగా పండిట్ జస్రాజ్ గారి మధురగీతాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

September 22nd, 09:32 am

నవరాత్రి సందర్భంగా భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ ఆలపించిన మధుర గీతాన్ని ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. నవరాత్రి అంటే పవిత్రమైన భక్తితో కూడినదనీ, చాలా మంది ఈ భక్తిని సంగీతం రూపంలో చెప్పారని శ్రీ మోదీ అన్నారు. మీరు పాడిన ఏదైనా భజన పాటను లేదా మీకు ఇష్టమైన భజనను నాతో పంచుకోండి. వాటిల్లో కొన్నింటిని రాబోయే రోజుల్లో నేను పోస్టు చేస్తాను! అని శ్రీ మోదీ తెలిపారు.

నవరాత్రి సందర్భంగా మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి

September 22nd, 09:29 am

నవరాత్రి సందర్భంగా తొలి రోజు ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ శైలపుత్రి అమ్మవారిని ప్రార్థించారు.

నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

September 22nd, 09:26 am

దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి నవరాత్రి చాలా ప్రత్యేకమైనదని భావిస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ పొదుపు ఉత్సవంతో పాటు స్వదేశీ మంత్రం ఈ సమయంలో కొత్త శక్తిని పుంజుకుంటుంది. అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్ భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసేందుకు సమష్టిగా కృషి చేద్దాం అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.

అనువాదం: జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

September 21st, 06:09 pm

శక్తిని ఆరాధించే పండగ అయిన నవరాత్రి రేపు ప్రారంభమవుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. నవరాత్రి మొదటి రోజే.. దేశం ఆత్మనిర్భర్ భారత్‌ వైపు మరో ముఖ్యమైన ముందడుగు వేస్తోంది. రేపు అంటే సెప్టెంబర్ 22న నవరాత్రి మొదటి రోజు నాడు సూర్యుడు ఉదయించే మాదిరిగానే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు కూడా అమలులోకి రానున్నాయి. ఒక విధంగా దేశంలో రేపటి నుంచి జీఎస్టీ పొదుపు అనే పండగ ప్రారంభం కానుంది. ఈ జీఎస్టీ పండగ మీ పొదుపులను పెంచుతుంది.. మీరు కావలసిన వస్తువులను మరింత తక్కువ ధరకు కొనుక్కునేలా చూసుకుంటుంది. మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, నవ- మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పొదుపు అనే పండగ నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. అంటే ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరు తీపి కబురు ఉండటంతో పాటు దేశంలోని ప్రతి కుటుంబం ఆశీర్వాదం పొందుతుందన్న మాట. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాటు పొదుపనే ఈ పండగ విషయంలో దేశంలోని కోట్లాది కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తాయి. వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.. పెట్టుబడులు పెట్టటాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది.. అభివృద్ధికి సంబంధించిన పోటీలో ప్రతి రాష్ట్రాన్ని సమాన స్థానంలో నిలబెడుతుంది.