నవ్కార్ మహామంత్ర దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 09th, 08:15 am
మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు స్థిరంగా ఉంది. శాంతి మాత్రమే ఉంది. అద్భుతమైన అనుభూతి. మాటలకు చాలనిది - ఆలోచనలకు అతీతమైనది - నవ్కార్ మహామంత్రం ఇంకా మనస్సులో మార్మోగుతోంది. నమో అరిహంతాణం. నమో సిద్ధాణం. నమో ఆయర్యాణం. నమో ఉవజ్ఝాయాణం. నమో లోయే సవ్వసాహుణం. ఒకే స్వరం, ఒకే ప్రవాహం, ఒకే శక్తి, ఎలాటి హెచ్చుతగ్గులూ లేవు. కేవలం స్థిరత్వం మాత్రమే. అంతా సమభావమే. అలాంటి చైతన్యం, ఒకే విధమైన లయ, అంతర్గతంగా ఒకే విధమైన కాంతి. నవ్కార్ మహామంత్రం ఆధ్యాత్మిక శక్తిని నేను ఇప్పటికీ అనుభూతి చెందుతున్నాను. కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఇలాంటి సామూహిక మంత్రోచ్ఛారణకు సాక్షిగా ఉన్నాను. ఈ రోజు తిరిగి నాకు అదే స్థాయిలో అదే అనుభూతి కలిగింది. ఈ సారి లక్షలాది పవిత్రాత్మలు ఒకే చైతన్యంతో కలిశాయి. ఒకే మాటలు కలసి పలికాయి. ఒకే శక్తి కలసి మేల్కొంది. భారత్‌లోనే కాదు - విదేశాల్లోనూ కూడా. ఇది నిజంగా అపూర్వమైన సంఘటన.నవ్‌కార్ మహామంత్ర దివస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 09th, 07:47 am
న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఈరోజు ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ కర్ మహామంత్ర దివస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానసిక శాంతిని, స్థిరచిత్తాన్ని అందించే సామర్థ్యం గల నవ్ కర్ మంత్రం.. దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుందని అన్నారు. మంత్ర పఠనం వల్ల సిద్ధించే నిర్వికార స్థితి మాటలకు, ఆలోచనలకు అతీతమైనదని, చేతనలో, అంతరాత్మలో ఆ భావన స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని అన్నారు. పవిత్రమైన నవ్‌కార్ మంత్రంలోని పంక్తులను చదివి వినిపించిన శ్రీ మోదీ- సంయమనం, స్థితప్రజ్ఞత, మనసు-అంతరాత్మల మధ్య సమన్వయం సాధించే నిరంతరాయ శక్తిప్రవాహంగా మంత్రశక్తిని అభివర్ణించారు. తన సొంత ఆధ్యాత్మిక అనుభూతిని గురించి చెబుతూ, నవ్ కర్ మంత్రం ఇప్పటికీ తన అంతరాళాల్లో ప్రభావాన్ని చూపుతూనే ఉందన్నారు. కొన్నేళ్ళ కిందట బెంగుళూరులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన సామూహిక మంత్ర పఠన ప్రభావం ఇప్పటికీ తనని వీడి పోలేదన్నారు. దేశ విదేశాల్లోని పవిత్ర హృదయాలు ఒకే చైతన్యంతో ఒక సామూహిక అనుభవంలో భాగమవడం తిరుగులేని అనుభూతి అని సంతోషం వెలిబుచ్చారు. ఈ సామూహిక చర్య ద్వారా ఒకే లయలో ఒదిగే పంక్తుల పఠనం అసాధారమైన శక్తిని వెలువరించి మాటల్లో చెప్పలేని దివ్యానుభూతిని కలిగిస్తుందని శ్రీ మోదీ చెప్పారు.ఏప్రిల్ 9న న్యూఢిల్లీలో నవ్కార్ మహామంత్ర దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
April 07th, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 8 గంటలకు న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే నవ్కార్ మహామంత్ర దివస్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు