మాత సిద్ధిదాత్రి ఆశీర్వాదాలను కోరుకుంటూ.. సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 27th, 10:44 am

మాత సిద్ధిదాత్రి ఆశీస్సులు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారు. భక్తులందరూ సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వారు సాధించేటట్లు దేవీమాత ఆశీర్వాదాలను అందజేయాలని ప్రధాని ప్రార్థించారు.

మాత మహాగౌరి ఆశీర్వాదాలను కోరుకుంటూ... సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 26th, 08:13 am

మహాగౌరి మాత ఆశీస్సులు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారు. దేవి దివ్య చరణాలకు ప్రణామాలర్పించారు. మాత దివ్య కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్నీ, సమృద్ధినీ, మంచి ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.

మాత కాలరాత్రి ఆశీర్వాదాలను కోరుకుంటూ... సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 25th, 09:00 am

మాత కాలరాత్రి ఆశీర్వాదాలు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారు. ఆమె కృపతో ప్రతి ఒక్కరి జీవితం సాహసంతోనూ, సంకల్పంతోనూ, గెలుపుతోనూ సమృద్ధం కావాలని ఆయన ప్రార్థించారు.

నవరాత్రి ఆరాధనతో అపార శక్తి

March 22nd, 09:12 am

నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన అభిప్రాయాలను పంచుకున్నారు. అమ్మవారి పట్ల భక్తితో అపార శక్తి, బలం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

నవరాత్రి వేడుకల్లోని అచంచల విశ్వాస ప్రస్థానంపై ప్రధానమంత్రి భావన

March 21st, 08:49 am

నవరాత్రి పండగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ.. జగన్మాతపై అంచంచలమైన విశ్వాసం కలిగించే మార్పులను ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తి స్తోత్రాన్ని పంచుకున్నారు.

చంద్రఘంటా అమ్మవారి దివ్యమైన, కరుణామయమైన అనుగ్రహాన్ని కోరుతూ.. సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

March 21st, 08:05 am

చంద్రఘంటా అమ్మవారి దివ్యమైన, శుభప్రదమైన అనుగ్రహాన్ని కీర్తిస్తూ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

An RSS shakha is a ground of inspiration, where the journey from 'me' to 'we' begins: PM Modi

October 01st, 10:45 am

In his address at the centenary celebrations of the Rashtriya Swayamsevak Sangh (RSS), PM Modi extended his best wishes to the countless swayamsevaks dedicated to the resolve of national service. He announced that, to commemorate the occasion, the GoI has released a special postage stamp and a coin. Highlighting the RSS’ five transformative resolutions, the PM remarked that in times of calamity, swayamsevaks are among the first responders.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శత వార్షికోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 01st, 10:30 am

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శత వార్షికోత్సవాలు ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున మహా నవమి.. సిద్ధిధాత్రి అమ్మవారిని ఆరాధించేది ఈ రోజేనని ఆయన గుర్తు చేశారు. రేపు విజయదశమి మహా పర్వదినం.. ఈ పండుగ భారతీయ సంస్కృతిలో ఓ శాశ్వత జయఘోషకు సంకేతం.. అన్యాయంపై న్యాయం, అసత్యంపై సత్యం, చీకటిపై వెలుగు పైచేయిని సాధించిన సన్నివేశమని ఆయన అభివర్ణించారు. అంతటి పవిత్ర సందర్భంలో, వంద సంవత్సరాల కిందట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. ఇది యాదృచ్ఛిక ఘటన ఏమీ కాదని ఆయన ఉద్ఘాటించారు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడమే.. దీనిలో భాగంగా ప్రతి యుగంలోనూ అప్పటి సవాళ్లను ఎదుర్కోవడానికి జాతీయ అంతశ్చేతన కొత్త కొత్త రూపాలను తీసుకొంటూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ యుగంలో, నిత్య జాతీయ చైతన్యం మూర్తీభవించిన ఓ ప్రతిరూపంగా సంఘ్ నిలుస్తోందని ఆయన తేల్చి చెప్పారు.

ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 27th, 11:45 am

ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారు. ఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పేరు, చిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుంది. అక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నాను. అతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండి. వెనక మీ పేరు, చిరునామా రాసి ఉంటే, నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. ఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకు, చిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 27th, 11:30 am

ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత నవరాత్రి పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామచండీలు కొలువైన పవిత్ర భూమిని సందర్శించి.. ఇక్కడి ప్రజలను కలిసే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు పాల్గొనడం ఆనందంగా ఉందన్న ప్రధానమంత్రి.. వారి ఆశీర్వాదాలే నిజమైన బలమన్నారు. ప్రజలకు వందనాలు తెలిపిన ఆయన.. అందరికీ శుభాకాంక్షలూ తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 22nd, 11:36 am

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవ కే.టీ. పర్నాయక్ గారు, ప్రజాదరణతో.. చైతన్యవంతమైన పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు కిరణ్ రిజిజు గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, నా సహ పార్లమెంటు సభ్యులు నబమ్ రెబియా గారు, తపిర్ గావ్ గారు, అందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అరుణాచల్ ప్రదేశ్‌లోని నా ప్రియమైన సోదరీ సోదరులారా,

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

September 22nd, 11:00 am

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భగవాన్ డోన్యీ పోలోకు ప్రణామాలు అర్పించి, అందరిపై ఆయన ఆశీస్సులు ప్రసరించాలని ప్రార్థించారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 17th, 11:20 am

మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీ సోదరులారా!

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం

September 17th, 11:19 am

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి - వాగ్దేవికి నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజు దేవశిల్పీ, నైపుణ్యం, సృజనాత్మకతకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతి అని చెబుతూ ఆయనకు శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. హస్త కళా నైపుణ్యం, అంకితభావంతో దేశ నిర్మాణంలో పాలుపంచు కొంటున్న కోట్లాది సోదరీసోదరులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.

బీహార్ రాష్ట్ర జీవ‌నోపాధి నిధి స‌హ‌కార రుణ ప‌ర‌ప‌తి స‌మాఖ్య లిమిటెడ్‌ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 02nd, 01:00 pm

బీహార్‌ ప్రజలకు అభిమానపాత్రులైన ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ కుమార్ సిన్హా, ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది సోదరీమణులారా... మీకందరికీ హృదయపూర్వక వందనం!

బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 02nd, 12:40 pm

బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ మంగళప్రదమైన మంగళవారం రోజు, చాలా ఆశాజనక కార్యక్రమానికి నాందీప్రస్తావన చేసుకుంటున్నామన్నారు. జీవికా నిధి రుణ సహకార సంఘ రూపంలో బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఒక కొత్త సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం గ్రామాల్లో జీవికతో అనుబంధం కలిగి ఉన్న మహిళలకు మరింత సులభంగా ఆర్థిక సహాయ సహకారాన్ని అందుబాటులోకి తీసుకు వస్తుందని, వారు పనిలోను, వ్యాపారాల్లోను ముందడుగు వేయడానికి ఇది సాయపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. జీవికా నిధి వ్యవస్థ పూర్తి డిజిటల్ మాధ్యమంలో పనిచేస్తుందని, పనిగట్టుకొని కాళ్లరిగేలా తిరిగే అవసరం ఇక ఉండదని, ప్రతి పనినీ ఇప్పుడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే చక్కబెట్టవచ్చని చెబుతూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జీవికా నిధి రుణ సహకార సంఘం ప్రారంభం అయినందుకు బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ అసాధారణ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకు వచ్చినందుకు శ్రీ నీతీశ్ కుమార్‌ను, బీహార్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు.

'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

Our Sankalp Patra is a reflection of the young aspirations of Yuva Bharat: PM Modi at BJP HQ

April 14th, 09:02 am

Releasing the BJP Sankalp Patra at Party headquarters today, PM Modi stated, The entire nation eagerly awaits the BJP's manifesto. There is a significant reason for this. Over the past 10 years, the BJP has implemented every point of its manifesto as a guarantee. The BJP has once again demonstrated the integrity of its manifesto. Our Sankalp Patra empowers 4 strong pillars of developed India - Youth, women, poor and farmers.”

పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సంకల్ప్ పత్ర విడుదల సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు

April 14th, 09:01 am

ఈరోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి సంకల్ప్ పత్రాన్ని విడుదల చేస్తూ, పిఎం మోదీ, యావత్ దేశం బిజెపి మేనిఫెస్టో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. గత 10 సంవత్సరాలుగా, బిజెపి తన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసింది. అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క 4 బలమైన స్తంభాలు - యువత, మహిళలు, పేదలు మరియు రైతులను శక్తివంతం చేసే మా సంకల్ప్ పత్రం యొక్క సమగ్రతను బిజెపి మరోసారి ప్రదర్శించింది. మా సంకల్ప్ పత్ర యువ భారత్ యువ ఆకాంక్షలకు ప్రతిబింబం: ప్రధాని మోదీ మా సంకల్ప్ పత్ర అభివృద్ధి చెందిన భారతదేశానికి 4 బలమైన స్తంభాలకు శక్తినిస్తుంది - యువత, మహిళలు, పేదలు మరియు రైతులు, ప్రధాని మోదీ ముద్రా యోజన కింద రూ. 10 లక్షల వరకు రుణాలు అందించారు. ఇప్పుడు బీజేపీ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచాలని నిర్ణయించింది: బీజేపీ సంకల్ప్ పత్రాన్ని విడుదల చేస్తూ ప్రధాని మోదీ 70 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తిని ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిలోకి తీసుకువస్తామని బీజేపీ ఇప్పుడు 'సంకల్ప్' తీసుకుంది: ప్రధాని మోదీ గత పదేళ్లు మహిళల గౌరవం మరియు మహిళలకు కొత్త అవకాశాల కోసం అంకితం చేయబడ్డాయి. రాబోయే 5 సంవత్సరాలు నారీ శక్తిలో కొత్త భాగస్వామ్యం అవుతుందని ప్రధాని మోదీ అన్నారు 2025లో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు. గిరిజన వారసత్వంపై పరిశోధనలను కూడా బీజేపీ ప్రోత్సహిస్తుంది: ప్రధాని మోదీ

Namo Bharat Train is defining the new journey of New India and its new resolutions: PM Modi

October 20th, 04:35 pm

The Prime Minister, Shri Narendra Modi inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor at Sahibabad RapidX Station in Ghaziabad, Uttar Pradesh today. He also flagged off the Namo Bharat RapidX train connecting Sahibabad to Duhai Depot, marking the launch of the Regional Rapid Transit System (RRTS) in India. Shri Modi dedicated to the nation, two stretches of east-west corridor of Bengaluru Metro.