సృజనాత్మకత, సుస్థిరత, సమాజ స్ఫూర్తికి ప్రతీకగా అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన: ప్రధానమంత్రి ప్రశంసలు
January 02nd, 03:45 pm
సృజనాత్మకత, సుస్థిరత, సమాజ భాగస్వామ్యాన్ని ఒకచోట చేర్చడంలో అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన విశేషమైన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ప్రదర్శన నగరం ఉత్సాహభరితమైన స్ఫూర్తిని, ప్రకృతిపై శాశ్వత ప్రేమను అందంగా ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు.Critical minerals are a shared resource of humanity: PM Modi at G20 Johannesburg Summit Session - 2
November 22nd, 09:57 pm
In his statement during the G20 Summit Session - 2 in Johannesburg, South Africa, PM Modi touched upon important topics like critical minerals, natural disasters, space technology and clean energy. The PM highlighted that India is promoting millets. He also said that the G20 must promote comprehensive strategies that link nutrition, public health, sustainable agriculture and disaster preparedness to build a strong global security framework.Prime Minister participates in G20 Summit in Johannesburg
November 22nd, 09:35 pm
Prime Minister participated today in the G20 Leaders’ Summit hosted by the President of South Africa, H.E. Mr. Cyril Ramaphosa in Johannesburg. This was Prime Minister’s 12th participation in G20 Summits. Prime Minister addressed both the sessions of the opening day of the Summit. He thanked President Ramaphosa for his warm hospitality and for successfully hosting the Summit.ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ 25వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
November 09th, 09:05 am
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ఛత్తీస్గఢ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 01st, 09:24 am
ఛత్తీస్గఢ్ అవతరణ దినోత్సవం 25వ వార్షికోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.రోజ్గార్ మేళా కింద 51,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
July 12th, 11:30 am
కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సిఫార్సు లేదు, అవినీతి లేదు- ఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. నేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇలాంటి రోజ్గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారు. ఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారు. కొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగా, మరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగా, మరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. మీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. విభాగం, పని, హోదా, ప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యం. మళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలి. ప్రజలే ప్రథమం: ఇదే మన మార్గదర్శక సూత్రం. దేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించింది. జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలు. కెరీర్లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 12th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు వీడియో అనుసంధానం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఈ యువత కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నదని తెలిపారు. వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభిస్తున్న యువకులను ఆయన అభినందించారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ.. పౌరులకు ప్రథమ ప్రాధాన్యం అనే సూత్ర మార్గనిర్దేశంలో దేశానికి సేవ చేయడమే వారి సమష్టి లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 21st, 07:06 am
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు కె. రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ జాదవ్ ప్రతాపరావు గణపత్రావు గారు, చంద్రశేఖర్ గారు, భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీసోదరీమణులందరికీ నా నమస్కారాలు.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 21st, 06:30 am
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (ఐవైడీ) కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి సామూహిక యోగా సాధనలో పాల్గొన్నారు.పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో నగర గ్యాస్ సరఫరా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 29th, 01:30 pm
ఈ చారిత్రాత్మక అలీపుర్దువార్ గడ్డ నుంచి బెంగాల్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను!పశ్చిమ బెంగాల్లోని అలీపూర్దౌర్లో రూ.1010 కోట్లకుపైగా విలువైన ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
May 29th, 01:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పశ్చిమ బెంగాల్లోని అలీపూర్దౌర్లో నగర గ్యాస్ సరఫరా (సిజిడి) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నగర గ్యాస్ సరఫరా (సిజిడి) నెట్వర్క్ విస్తరణలో ఇదొక కీలక ముందడుగు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో- చారిత్రక అలీపూర్దౌర్ గడ్డమీదినుంచి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత సుసంపన్న సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దీని సరిహద్దులే కాకుండా ఇక్కడి ప్రాచీన సంప్రదాయాలు, సంబంధాలు కూడా ఈ అంశాన్ని స్పష్టంగా నిర్వచిస్తాయని చెప్పారు. మన పొరుగు దేశం భూటాన్తో అలీపూర్దౌర్ సరిహద్దును పంచుకుంటుండగా, దీనికి సరసనేగల అస్సాం ఈ ప్రాంతాన్ని అక్కున చేర్చుకుంటుందన్నారు. మరోవైపు జల్పాయ్గురి ప్రకృతి సౌందర్యం, కూచ్బెహార్ ప్రతిష్ఠ ఈ ప్రాంతంలో అంతర్భాగాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాల్ వారసత్వం, ఐక్యతలోనూ విశిష్ట పాత్రగల ఈ సుసంపన్న అలీపూర్దౌర్ నేలను సందర్శించడం తనకు దక్కిన గౌరవమని ఆయన హర్షం ప్రకటించారు.సిక్కిం@50 కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
May 29th, 10:00 am
సిక్కిం గవర్నరు శ్రీ ఒ.పి.ప్రకాశ్ మాథుర్ గారూ, ప్రియతమ ముఖ్యమంత్రీ నా మిత్రుడూ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారూ, నా పార్లమెంటు సహచరులు డోర్జీ షెరింగ్ లెప్చా గారూ, డాక్టర్ ఇంద్రా హంగ్ సుబ్బా గారూ.. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులందరూ, సోదరీ సోదరులారా!‘సిక్కిం@50’ సంబరాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 29th, 09:45 am
గ్యాంగ్టక్లో నేడు జరిగిన ‘సిక్కిం@50’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘లక్ష్యానికి తగిన పురోగతి, వృద్ధిని పెంపొందించే ప్రకృతి’ అన్న ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 ఏళ్లు పూర్తయిన ఈ ప్రత్యేకమైన రోజున ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందోత్సాహాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్నప్పటికీ, ప్రతికూల వాతావరణం వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని చెప్పారు. త్వరలోనే సిక్కింలో పర్యటించి వారి విజయాలు, వేడుకల్లో భాగమవుతానని మాటిచ్చారు. గడిచిన 50 ఏళ్లలో వారు సాధించిన విజయాలను చాటే రోజుగా దీనిని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేయడంలో సిక్కిం ముఖ్యమంత్రి, ఆయన బృందం ఉత్సాహంతో వ్యవహరించారంటూ ప్రశంసించారు. సిక్కిం రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.అరుణోదయ ఈశాన్య పెట్టుబడిదారుల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:00 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ సుకాంత మజుందార్, మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ హిమంత బిశ్వ శర్మ, శ్రీ పెమా ఖండు, శ్రీ మాణిక్ సాహా, శ్రీ కాన్రాడ్ సంగ్మా, శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, శ్రీ నైఫూ రియో, శ్రీ లాల్ధుమా సహా వివిధ పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు, సోదరీసోదరులందరికీ ప్రణామం!రైజింగ్ నార్త్ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు-2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 10:30 am
రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సు- 2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రధానమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈశాన్య ప్రాంతంపై ఆత్మీయతను, పురోగతిపై అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతం గర్వకారణమన్నారు. ఈ మధ్యే భారత్ మండపంలో అష్టలక్ష్మీ మహోత్సవాన్ని నిర్వహించామని, నేటి కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడుల వేడుకను తలపిస్తోందని చెప్పారు. సదస్సుకు భారీగా పారిశ్రామికవేత్తలు హాజరవడంపై హర్షణీయమన్న ప్రధానమంత్రి.. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు గల అవకాశాలు వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని శ్రీ మోదీ అభినందించారు. ఈ ప్రాంత నిరంతర అభివృద్ధి, సంక్షేమాలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి.. నార్త్ఈస్ట్ రైజింగ్ సదస్సును అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.బవలియాలీ ధామ్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
March 20th, 04:35 pm
ముందుగా, భర్వాడ్ సమాజ సంప్రదాయాలకు, గౌరవనీయులైన సాధువులు, మహంతులకు, ఈ పవిత్ర సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు తమ జీవితాలను అంకితం చేసిన వారికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈ రోజు మన ఆనందం ఎన్నో రెట్లు పెరిగింది. ఈ సారి నిర్వహించిన మహాకుంభ్ చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా, మనందరికీ గర్వకారణంగా నిలిచింది. ఎందుకంటే ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగానే మహంత్ శ్రీ రామ్ బాపూజీని మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించుకున్నాం. ఇది మనందరికీ అమితానందనాన్ని కలిగిస్తోంది. రామ్ బాపూజీకి, మన సమాజానికి చెందిన అన్ని కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.బవళియాళి ధామ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 20th, 04:30 pm
గుజరాత్లోని భర్వాడ్ సమాజ బవలియాళి ధామ్ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా సందేశమిచ్చారు. ముందుగా మహంత్ శ్రీరామ్ బాపూజీ, సమాజ నాయకులు, కార్యక్రమానికి హాజరైన వేలాది భక్తజనానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భర్వాడ్ సమాజ సంప్రదాయాలకు, వాటిని కొనసాగించడంలో జీవితం అంకితం చేసిన గౌరవనీయ సాధువులు, మహంతులకు గౌరవ నివాళి అర్పించారు. చారిత్రక మహాకుంభ్తో ముడిపడిన అమితానందం, ప్రతిష్టను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా మహంత్ శ్రీరామ్ బాపూజీకి ‘మహామండలేశ్వర్’ బిరుదు ప్రదానాన్ని ఓ కీలక ఘట్టంగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఇదొక చిరస్మరణీయ ఘనత మాత్రమేగాక అందరికీ అమితానందం కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. మహంత్ శ్రీరామ్ బాపూజీతోపాటు భర్వాడ్ సమాజంలోని కుటుంబాల సేవను, వారి విజయాలను స్మరించుకుంటున్న నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు.పాడ్ క్యాస్ట్లో లెక్స్ ఫ్రిడ్మాన్తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం
March 16th, 11:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 16th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.థాయిలాండ్లో సంవాద్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 14th, 08:30 am
థాయిలాండ్లో జరుగుతున్న ఈ సంవాద్ (SAMVAD) కార్యక్రమంలో మీ అందరితో భేటీ కావడం నాకు దక్కిన గౌరవం. థాయిలాండ్తోపాటు భారత్, జపాన్ కు చెందిన అనేక మంది ప్రముఖులు, ప్రధాన సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పాలుపంచుకొంటున్నాయి. వారు చేస్తున్న ప్రయత్నాలకు గాను వారికి నా అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.