న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
July 11th, 01:15 pm
‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.న్యూజిలాండ్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
July 11th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం
July 04th, 12:50 pm
ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.2026 వ సంవత్సరం జూన్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 135 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 28th, 11:30 am
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్‌కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 19th, 11:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని
June 11th, 08:09 pm
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ ఏడాది సమావేశాన్ని ‘వికసిత్ భారత్- 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ సమావేశానికి 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులుగా ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు హాజరయ్యారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 04:30 pm
విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 04:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.గుజరాత్‌లోని వడోదరాలో సర్దార్‌ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం ప్రసంగం
May 11th, 06:15 pm
గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 11th, 06:00 pm
గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.ప్రపంచ సవాళ్ల నడుమ ప్రతి భారతీయునికి ప్రధాని మోదీ గట్టి విజ్ఞప్తి
May 10th, 08:39 pm
హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఇటీవలి సంఘర్షణలు, సరఫరా గొలుసు అంతరాయాల వల్ల తలెత్తిన ప్రపంచ ఆర్థిక సవాళ్ల గురించి మాట్లాడారు. భారతదేశ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి సామూహిక జాతీయ బాధ్యత అవసరమని ఆయన పిలుపునిచ్చారు. దిగుమతులపై ఒత్తిడిని తగ్గించి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలని, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పౌరులను కోరారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ
May 10th, 06:05 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న స్థాయి, బీజేపీ సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాల ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ సవాళ్ల నేపథ్యంలో దేశం యొక్క సమిష్టి బాధ్యత గురించి మాట్లాడారు.హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ ర్యాలీ: స్వయం సమృద్ధి మరియు 'వికసిత తెలంగాణ'పై దృష్టి
May 10th, 06:00 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న స్థాయి, బీజేపీ సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాల ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ సవాళ్ల నేపథ్యంలో దేశం యొక్క సమిష్టి బాధ్యత గురించి మాట్లాడారు.బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
May 10th, 11:05 am
ఈ ఉదయం నాకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. వేద మంత్రోచ్చారణతో చిన్నారులు పలికిన స్వాగతం, శ్రీ గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ జన్మదినోత్సవం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం.. ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ అద్భుతమైన ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 10th, 11:00 am
కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికున్న పవిత్రత గురించి ప్రధాని తెలియజేశారు. వేద మంత్రాలతో చిన్నారులు స్వాగతం పలకడం, గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ సంవత్సరం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలతో ఈ ఉదయం ప్రత్యేకంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 28th, 05:30 pm
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులోని నా సహచరులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు, ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులు, యూపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ పంకజ్ చౌదరి గారు, జిల్లా పంచాయత్ చైర్‌పర్సన్ సోదరి పూనం మౌర్య గారు, వేదికపై ఉన్న కాశీ నగర మహిళా కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసిన నా తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలు అందరికీ నమస్కారం.వారణాసిలో మహిళా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 28th, 05:00 pm
ఈ రోజు వారణాసిలో జరిగిన మహిళా సదస్సులో భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అక్కడ ఆయన వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.DMK’s policy is by the family, of the family and for the family: PM Modi in Coimbatore, Tamil Nadu
April 18th, 06:20 pm
Election, Coimbatore, Tamil Nadu, BJP, Lord Murugan, Puthandu, Nari Shakti Vandan Adhiniyam, Nari Shakti, Women Empowerment, Women's Reservation Bill, Parliament, Corruption, Highway, Roadways, Next Generation Infrastructure, Railway, Inclusive Growth, C. P. Radhakrishnan, Surya Ghar Muft Bijli Yojana, Rooftop Solar, Electricity for all, Investment, Jobs, Jal Jeevan Mission, MUDRA, Pradhan Mantri Ujjwala Yojana, Business, Income Tax, GST Bachat Utsav, Education, Healthcare, Ayushman Bharat Yojana, Jan Aushadhhi Kendra, Yuva Shakti, First Time Voters, Census, MSME, Economy, Natural Farming, Farmer Welfare, Innovation, Employment, Viksit Bharat Viksit Tamil Nadu,PM Modi’s fiery speech electrifies Coimbatore
April 18th, 06:00 pm
Prime Minister Narendra Modi today delivered a high-energy and politically charged address in Coimbatore, Tamil Nadu, drawing an enthusiastic response from the public. Addressing a large gathering, Prime Minister Modi said the people of Tamil Nadu are sending a clear message ahead of the upcoming polls: “NDA is in, DMK is out.”