న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
January 28th, 04:00 pm
కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌జీ, వేదికపై ఉన్న అతిథులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, శకటాల కళాకారులు, రాష్ట్రీయ రంగశాల ఉద్యోగులు, నా యువ మిత్రులు.. మీ అందరి కృషి ఇక్కడ కనిపిస్తోంది. మంచి సమన్వయంతో మీరు చక్కటి ప్రదర్శన ఇచ్చారు.ఢిల్లీలో జరిగిన వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 28th, 03:30 pm
ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు నిర్వహించిన వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ కేడెట్లు, నాటక కళాకారులు, జాతీయ రంగశాల కళాకారులు, దేశంలోని వివిధ ప్రాంతాల యువ ప్రతినిధుల కృషి.. సమన్వయంతో కూడిన ఈ ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. నేటి ఉదయం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ గారితోపాటు కొందరు సహచరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దేశానికి ఎంతో శోకాన్ని మిగిల్చిందని ఆవేదన చెందారు. మహారాష్ట్రతోపాటు దేశాభివృద్ధిలో అజిత్ దాదా విశేష కృషి చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలోనూ, అక్కడకు వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు, ముఖ్యంగా మిత్ర దేశాల నుంచి వచ్చిన వారికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది బాలికల భాగస్వామ్యం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.మొదటి ఓటు నుండి స్టార్టప్ ఇండియా వరకు, మన్ కీ బాత్‌లో భారతదేశ యువత పట్ల ప్రధానమంత్రి మోదీ ఉత్సాహం
January 25th, 11:30 am
ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు జరిగిన మొదటి మన్ కీ బాత్‌లో, ప్రధానమంత్రి మోదీ ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. స్టార్టప్‌లు, నీటి సంరక్షణ, నాణ్యత, సంస్కృతి & పండుగలు మరియు పరిశుభ్రత వంటి కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు పాల్గొనే రాబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రధాని హైలైట్ చేశారు.జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి ఓటరుగా నమోదవ్వడం ఒక వేడుకగా పేర్కొన్న ప్రధాని, మై-భారత్ వాలంటీర్లకు లేఖ
January 25th, 10:24 am
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశ పౌరులందరికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.రోజ్‌గార్ మేళాలో భాగంగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 24th, 11:30 am
2026 సంవత్సరం ప్రారంభం మీ జీవితాల్లో సరికొత్త సంతోషాలకు నాంది పలుకుతోంది. దీనికి తోడు నిన్ననే వసంత పంచమి ముగిసింది.. మీ జీవితాల్లోనూ కొత్త వసంతం మొదలవుతోంది. రాజ్యాంగం పట్ల విధులతో మిమ్మల్ని అనుసంధానిస్తున్న సమయమిది. యాదృచ్ఛికంగా ఇప్పుడు దేశంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిన్న జనవరి 23న నేతాజీ సుభాష్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ జరుపుకున్నాం. రేపు జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని, అనంతరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. ‘జన గణ మన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరా’న్ని జాతీయ గేయంగా రాజ్యాంగం ఆమోదించినది ఈ రోజునే. ఈ విశేషమైన రోజున 61 వేలకు పైగా యువత తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు.18వ రోజ్‌గార్ మేళానుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
January 24th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 18వ రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో కొత్త సంతోషాలను తెస్తూ, రాజ్యాంగపరమైన బాధ్యతలతో దేశ పౌరులను అనుసంధానిస్తూ 2026 సంవత్సరం ప్రారంభమైందన్నారు. ఇది గణతంత్ర మహోత్సవ వేళ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశం పరాక్రమ్ దివస్ జరుపుకొందని, రేపు అంటే జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం, ఆ వెంటనే గణతంత్ర దినోత్సవం వస్తున్నాయని శ్రీ మోదీ గుర్తు చేశారు. ‘జన గణ మన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరా’న్ని జాతీయ గేయంగా రాజ్యాంగం ఆమోదించిన ఈ రోజు కూడా ఎంతో విశేషమైనదని ప్రధానమంత్రి చెప్పారు. ఈ విశేషమైన రోజున 61 వేలకు పైగా యువత ప్రభుత్వోద్యోగాలకు నియామక పత్రాలను స్వీకరించి.. తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నియామక పత్రాలను దేశ నిర్మాణానికి ఆహ్వానంగానూ, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మరింత వేగంగా ఆవిష్కరించే ప్రతినగానూ శ్రీ మోదీ అభివర్ణించారు. చాలా మంది యువత దేశ భద్రతను బలోపేతం చేస్తారనీ, విద్య - ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను శక్తిమంతం చేస్తారని, ఆర్థిక సేవలు - ఇంధన భద్రతనూ పటిష్టం చేస్తారని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువత అందరికీ ఈ సందర్భంగా ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.ఢిల్లీలోని కరియప్ప పెరేడ్ మైదానంలో ఎన్‌సిసి ర్యాలీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రిమండలిలోని నా సహచరులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ సంజయ్ సేథ్, ‘సిడిఎస్’ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ కార్యదర్శి గారు, ‘ఎన్‌సిసి’ డీజీగారు, ఇతర అతిథులు నా ప్రియ ‘ఎన్‌సిసి’ యువ మిత్రులారా!వార్షిక ‘ఎన్‌సిసి పిఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 04:30 pm
దేశ రాజధాని ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ నిర్వహించిన వార్షిక ‘నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సిసి) పీఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించడంతోపాటు ఉత్తమ కేడెట్లకు పురస్కార ప్రదానం చేశారు. ‘ఎన్‌సిసి దినోత్సవం’ నేపథ్యంలో సభికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ- 18 మిత్రదేశాల నుంచి దాదాపు 150 మంది కేడెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారందరినీ స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ‘మేరా యువ భారత్’ (మై భారత్) పోర్టల్ ద్వారా దేశం నలుమూలల నుంచి ఆన్‌లైన్‌లో పాల్గొన్న యువతను కూడా ఆయన అభినందించారు.ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా సాధికారిత కల్పించే జాతీయ ఓటర్ల దినోత్సవం... ఓ ప్రజాస్వామ్య వేడుక: ప్రధానమంత్రి
January 25th, 08:45 am
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. మన శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకోవడం, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సాధికారతను కల్పించడం జాతీయ ఓటర్ల దినోత్సవం ఉద్దేశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈసందర్భంగా అన్నారు.మన్ కీ బాత్: ‘నా మొదటి ఓటు - దేశం కోసమే’...మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ
February 25th, 11:00 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్‌కి స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన సూచనలు, స్పందనలు, వ్యాఖ్యలను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్‌లో ఏ అంశాలను చేర్చాలనేదే సవాలు. నేను సానుకూల వైఖరితో నిండిన అనేక స్పందనలను అందుకున్నాను. ఇతరులకు ఆశాకిరణంగా మారడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి.అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 28th, 11:30 am
మిత్రులారా! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భం కోట్లాది మంది దేశ ప్రజలను కట్టిపడేసిందనిపిస్తుంది. అందరి భావాలు ఒక్కటే. అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో రాముడు. అందరి హృదయాల్లో రాముడు. ఈ సమయంలో దేశంలోని చాలా మంది ప్రజలు రామభజనలను పాడి, శ్రీరాముని చరణాలకు సమర్పించుకున్నారు. జనవరి 22 సాయంత్రం యావద్దేశం రామజ్యోతులను వెలిగించి, దీపావళిని జరుపుకుంది. ఈ సమయంలో దేశం సామూహిక శక్తిని దర్శించింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన తీర్మానాలకు ప్రధాన ఆధారం. మకర సంక్రాంతి నుండి జనవరి 22వ తేదీ వరకు స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని నేను దేశ ప్రజలను కోరాను. లక్షలాది మంది ప్రజలు భక్తితో తమ ప్రాంతాల్లోని ధార్మిక స్థలాలను శుభ్రం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను నాకు ఎంతో మంది పంపారు. ఈ భావన ఆగకూడదు. ఈ ప్రచారం ఆగకూడదు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని కొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది.The next 25 years are crucial to transform India into a 'Viksit Bharat': PM Modi
January 25th, 12:00 pm
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”PM Modi’s address at the Nav Matdata Sammelan
January 25th, 11:23 am
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”జాతీయ వోటర్ ల దినం సందర్భం లో అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
January 25th, 09:44 am
జాతీయ వోటర్ ల దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
January 25th, 11:49 am
జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.జాతీయ వోటర్ ల దినం నాడు ఎన్నికల సంఘాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
January 25th, 01:17 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు, అంటే ఈ నెల 25న, జాతీయ వోటర్ ల దినం సందర్భం లో ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు.వోటర్ ల జాతీయ దినం నాడు ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
January 25th, 11:01 am
‘‘వోటర్ ల జాతీయ దినం సందర్భం లో ఇవే నా అభినందన లు. మన ఎన్నికల ప్రక్రియ ను మరింత సచేతనం గా, మరింత ఎక్కువ మంది వోటింగ్ లో పాల్గొనేటట్టుగా మలచే దిశ లో బహుళ ప్రయత్నాల ను చేస్తున్నందుకు ఇసిఐ కి మనం కృతజ్ఞతల ను తెలియజేద్దాము. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధం గా వోటర్ లలో చైతన్యం అధికం అయ్యేలాగాను మరియు మరింత ఎక్కువ మంది వోటింగ్ లో పాలు పంచుకొనే విధం గా మనం కృషి చేసేలాగాను మనకు ఈ దినం స్ఫూర్తి ని ఇచ్చుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.మన్ కీ బాత్ – మనసులో మాట ప్రసారణ తేదీ : 27-01-2019
January 27th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! ఈ నెల 21వ తేదీన దేశానికి ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది. ఏమిటంటే, కర్ణాటక లోని తుముకూరు జిల్లాకు చెందిన శ్రీ సిధ్ధగంగా మఠాథిపతి డా. శ్రీ శ్రీ శ్రీ శివకుమార్ స్వామి గారు ఇక లేరనే వార్త. శివ కుమార్ స్వామి గారు తన యావత్ జీవితాన్నీ సమాజ సేవకే సమర్పించేసారు.జాతీయ వోటర్ల దినోత్సవం నాడు ప్రజల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
January 25th, 12:49 pm
జాతీయ వోటర్ల దినోత్సవం సందర్భం గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.అర్హులైన ఓటర్లు అందరూ వారి పేర్లను నమోదు చేసుకొని, వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ జాతీయ ఓటర్ల దినం సందర్భంగా విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
January 25th, 10:56 am
అర్హులైన ఓటర్లు అందరూ వారి వారి పేర్లను నమోదు చేయించుకొని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జాతీయ ఓటర్ల దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.