జాతీయ పురస్కారాలందుకున్న ఉపాధ్యాయుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 04th, 05:35 pm
మన సంప్రదాయంలో ఉపాధ్యాయులపై సహజమైన గౌరవం ఉంది. వారు సమాజానికి గొప్ప బలం కూడా. ఉపాధ్యాయులను ఆశీర్వాదాల కోసం నిలబడేలా చేయడం తప్పు. నేను అలాంటి పాపం చేయాలనుకోను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరినీ కలవడం నాకు అద్భుతమైన అనుభవం. మీలో ప్రతి ఒక్కరికి మీ సొంత కథ ఉండి ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మీరు ఈ స్థాయికి చేరుకునేవారు కాదు. ఆ కథలన్నింటినీ తెలుసుకోవడానికి తగినంత సమయం దొరకడం కష్టం. కానీ మీ నుంచి నేను నేర్చుకోగలిగినది నిజంగా స్ఫూర్తిదాయకం.. దాని కోసం నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ జాతీయ పురస్కారం అందుకోవడం ముగింపు కాదు. ఈ పురస్కారం అందుకున్న తర్వాత అందరి దృష్టి మీపైనే ఉంటుంది. దీని అర్థం మీ పరిధి గణనీయంగా విస్తరించింది. గతంలో మీ ప్రభావం, ఆదేశం పరిధి పరిమితమే. ఇప్పుడు ఈ గుర్తింపు తర్వాత అది చాలా విస్తృతంగా పెరుగుతుంది. ఇది ప్రారంభం అని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు వీలైనంత వరకు అందరితో పంచుకోవాలి. మీరు అలా చేస్తే మీలో సంతృప్తి పెరుగుతుంది. మీరు ఆ దిశలో కృషి చేస్తూనే ఉండాలి. ఈ పురస్కారానికి మీరు ఎంపిక కావడం మీ కృషికి, నిరంతర అంకితభావానికి నిదర్శనం. అందుకే ఇది సాధ్యమైంది. ఒక ఉపాధ్యాయుడు వర్తమానానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు తరాలను కూడా రూపొందిస్తాడు.. భవిష్యత్తును మెరుగుపరుస్తాడు. ఇది దేశానికి చేసే సేవ కంటే తక్కువ కాదని నేను నమ్ముతున్నాను. నేడు మీవంటి కోట్లాది మంది ఉపాధ్యాయులు అదే దేశభక్తి, నిజాయితీ, అంకితభావంతో దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం లభించకపోవచ్చు. బహుశా చాలామంది ప్రయత్నించి ఉండకపోవచ్చు.. కొందరు గమనించి ఉండకపోవచ్చు. అలాంటి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులు అనేకమంది ఉన్నారు. వారందరి సమిష్టి కృషి వల్లే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.. భావి తరాలూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. దేశం కోసం జీవించే అందరి సహకారం దీనిలో ఉంటుంది.Prime Minister Narendra Modi addresses National Awardee Teachers
September 04th, 05:33 pm
During a meeting with National Awardee Teachers, PM Modi remarked that teachers shape not only the present but also the future generation, highlighting India’s guru-disciple tradition. He announced that from 22nd September, the GST reforms will take effect, making essentials cheaper for millions of families. The PM emphasized that every home adopt Swadeshi, with teachers promoting it in schools.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యావేత్తలకు నివాళులు అర్పించిన - ప్రధానమంత్రి
September 05th, 09:51 pm
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలలు కనడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దే, ఉత్సుకతను రేకెత్తించే విద్యావేత్తలందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.ఉపాధ్యాయుల దినంనాడు ఉపాధ్యాయుల కు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
September 05th, 09:58 am
భవిష్యత్తు ను నిర్మించడం లో మరియు కలల కు ప్రేరణ ను ఇవ్వడం లో గురువు లు చాటుకొంటున్న అచంచలమైనటువంటి సమర్పణ భావాని కి మరియు వారు ప్రసరింపచేస్తున్నటువంటి మహా ప్రభావాని కి గాను గురువుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినం సందర్భం లో నమస్కరించారు.జాతీయ ఉపాధ్యాయుల పురస్కారం 2023 విజేతల తో ఉపాధ్యాయులదినాని కి ముందు రోజు సాయంత్రం పూట భేటీ అయిన ప్రధాన మంత్రి
September 04th, 10:33 pm
ఉపాధ్యాయుల దినం కంటే ముందు రోజు సాయంత్రం పూట, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరాని కి గాను ‘జాతీయ గురువుల పురస్కారం’ గెలుచుకొన్న వ్యక్తుల తో 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో సమావేశమయ్యారు. ఈ సంభాషణ కార్యక్రమం లో 75 మంది పురస్కార విజేత లు పాలుపంచుకొన్నారు.జాతీయ ఉపాధ్యాయ పురస్కారం-2022 విజేతలతో సెప్టెంబరు 5న ముచ్చటించనున్న ప్రధానమంత్రి
September 04th, 01:29 pm
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 సెప్టెంబర్ 5 న సాయంత్రం 4:30 గంటలకు 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో 2022కుగాను జాతీయ ఉపాధ్యాయ పురస్కారం-2022 విజేతలతో సంభాషిస్తారు.జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల గ్రహీతల తో సంభాషించిన ప్రధాన మంత్రి
September 03rd, 06:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న, లోక్ కల్యాణ్ మార్గ్ లో జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల గ్రహీతల తో ముఖాముఖి సంభాషించారు.