వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా చిప్ లిమిటెడ్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
February 21st, 05:30 pm
అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ అత్యంత వేగంగా పని చేస్తోంది. ఆగేందుకు లేదా విశ్రమించేందుకు భారతదేశానికి సమయం లేదని నేను ఎర్రకోట నుంచి చెప్పాను. 2026 ప్రారంభం నుంచి భారత్ తన వేగాన్ని మరింత పెంచింది. జనవరి 12న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో లక్షలాది దేశ యువత పాల్గొన్నారు. దేశంలో అంకుర సంస్థల విప్లవానికి నూతన ఉత్సాహాన్ని జోడిస్తూ జనవరి 16న మనం జాతీయ అంకుర సంస్థల దినోత్సవం నిర్వహించుకున్నాం. ఇదే జనవరిలో నిర్వహించిన ఇండియా ఎనర్జీ సదస్సు ద్వారా తన సామర్థ్యంతో ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షించింది. ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్‌కు కొత్త వేగాన్ని అందించింది. ఈ వారం కూడా భారత్‌కు చరిత్రాత్మకమైనదే. ప్రపంచంలో అనేక దేశాల అధినేతలు, సాంకేతిక ప్రపంచంలో దిగ్గజాలు అందరూ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశ ఏఐ సామర్థ్యాన్ని ఈ సదస్సు ద్వారా ప్రపంచం చూసింది. మన దార్శనికతను అర్థం చేసుకొని, ప్రశంసించింది.ఉత్తరప్రదేశ్‌లోని హెచ్‌సిఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్న ప్రధానమంత్రి
February 21st, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని హెచ్‌సిఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు తర్వాత, ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతున్న భారత్ ప్రయాణంలో ఈ కార్యక్రమం ఒక చరిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది.స్టార్టప్ ఇండియా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 16th, 01:30 pm
నా మంత్రివర్గ సహచరులు శ్రీ పీయూష్ గోయల్, దేశం నలుమూలల నుంచి విచ్చేసిన అంకుర సంస్థలకు చెందిన మిత్రులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరసోదరీలారా!‘స్టార్టప్ ఇండియా’కు పదేళ్లు నిండిన నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 16th, 09:28 am
‘జాతీయ అంకుర దినోత్సవం’ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అంకురావరణంతో అనుసంధానితులైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.జాతీయ అంకుర సంస్థల దినం.. స్టార్టప్ ఇండియాకు పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా జనవరి 16న నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
January 15th, 09:00 am
స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేయడం మొదలుపెట్టి పది సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తుగా 2026 జనవరి 16న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అదే రోజు.. జాతీయ అంకుర సంస్థల దినం కూడా.