ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 08th, 11:15 am
ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ వేడుకకు ఉన్న భావోద్వేగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. క్యాంపస్‌లోని ఉత్సాహభరితమైన, కలలతో నిండిన వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో వర్చువల్‌గా హాజరైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... పట్టభద్రులైన విద్యార్థులతో నేరుగా ఈ కార్యక్రమానికి హాజరవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ క్యాంపస్‌లో మీతో ఈ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవటం నాకు కూడా ఎంతో ప్రత్యేకం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 08th, 11:00 am
ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ వేడుకకు ఉన్న భావోద్వేగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. క్యాంపస్‌లోని ఉత్సాహభరితమైన, కలలతో నిండిన వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో వర్చువల్‌గా హాజరైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... పట్టభద్రులైన విద్యార్థులతో నేరుగా ఈ కార్యక్రమానికి హాజరవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ క్యాంపస్‌లో మీతో ఈ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవటం నాకు కూడా ఎంతో ప్రత్యేకం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.Prime Minister receives telephone call from Prime Minister of the United Kingdom
July 31st, 07:28 pm
In a telephone conversation with UK PM Andy Burnham, PM Modi congratulated him on assuming office. The two leaders discussed ways to further strengthen the India-UK Comprehensive Strategic Partnership and agreed to deepen cooperation across priority areas. They also exchanged views on issues of mutual interest and welcomed the recent entry into force of the India-UK CETA.ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 07th, 03:15 pm
ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 07th, 03:00 pm
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.ఇండొనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
July 06th, 09:00 am
ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతొ ఆహ్వానించడంతో, నేను ఈ నెల 6 నుంచి 8 వరకూ ఇండొనేషియాలో పర్యటిస్తాను. 2018లో నేను మొదటిసారి ఇండొనేషియా పర్యటనకు వెళ్లినప్పుడు భారత్, ఇండొనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందింపచేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెరిగిన తరువాత ఇదే నేను చేపట్టబోయే మొదటి ద్వైపాక్షిక పర్యటన. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ అధికార పర్యటన అనంతరం నా ఈ పర్యటన చోటుచేసుకోనుంది. అప్పట్లో అంటే.. 2025 జనవరి 26న ఆయన మన గణతంత్ర దినోత్సానికి ముఖ్య అతిథిగా వచ్చారు. భారత్, ఇండొనేషియా మధ్య బలమైన నాగరికత సంబంధమైన ప్రజా సంబంధాలు నెలకొన్నాయి. నా ఈ పర్యటన మన బహుముఖీన భాగస్వామ్యానికి చెందిన అన్ని అంశాలనూ మరింత దృఢతరంగా మారుస్తుంది. నా పర్యటన కాలంలో, నేను ఇండొనేషియాలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులతోనూ సమావేశమవుతాను. అధ్యక్షుడు శ్రీ ప్రబొవొతో కలిసి యోగ్యకర్తలోని ప్రంబానన్ దేవాలయ పరిసరాలను సందర్శిస్తాను. ఆ దేవాలయం మన సన్నిహిత సాంస్కృతిక సంబంధాలకు మరొక అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది.సీషెల్స్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
June 28th, 02:02 pm
అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సేవా తీర్థ్‌లో యోగా
June 21st, 03:51 pm
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని సేవాతీర్థ్‌లో ఈ రోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.జి7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ చాన్సలర్‌తో ప్రధానమంత్రి సమావేశం
June 17th, 05:34 pm
ఈ సందర్భంగా భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్య పునరుజ్జీవనంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో చాన్సలర్ భారత పర్యటనకు రాగా, భారత-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించారు. ఈ ఏడాదిలోనే భారత్-జర్మనీ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, కాలుష్య రహిత సుస్థిర అభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, రవాణా తదితర రంగాల్లో సహకార బలోపేతంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. రక్షణ పారిశ్రామిక సహకారంపై వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికపై సంతకాలు పూర్తి కావడంపై వారు హర్షం ప్రకటించారు. జర్మనీ మీదుగా ప్రయాణించే భారత పౌరులకు ట్రాన్సిట్ వీసా మినహాయింపు విధానానికి శ్రీకారం చుట్టడాన్ని స్వాగతించారు.స్వావలంబన, ఆవిష్కరణల ద్వారా గడచిన దశాబ్దంలో రక్షణ సామర్థ్యాల్లో భారత్ సాధించిన పరివర్తన గురించి వివరించిన ప్రధానమంత్రి
June 17th, 12:34 pm
ఆత్మనిర్భరత లక్ష్యం ఆధారంగా.. ఆవిష్కరణలూ, సాంకేతిక పరిజ్ఞానమూ, స్వదేశీ తయారీ రంగం అందిస్తున్న శక్తితో భారతదేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ స్థాయిలో రూపాంతరం చెందాయని శ్రీ మోదీ అన్నారు.జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ప్రధానమంత్రి భేటీ
June 16th, 10:36 pm
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జూన్ 16, 2026న జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
June 15th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్లోవాక్ పర్యటన సందర్భంగా చారిత్రాత్మక బ్రాటిస్లావా కోట వద్ద ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో అధికార లాంచనాలతో ఘనస్వాగతం పలికారు.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.వరుసగా అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన కేబినెట్
June 10th, 01:50 pm
భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో 2026 జూన్ 10ని ఒక చరిత్రాత్మక మైలురాయిగా అభివర్ణిస్తూ కేంద్ర క్యాబినెట్ ఈ రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నిరంతరాయంగా అత్యధిక కాలంపాటు దేశానికి సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీని ఈ సందర్భంగా కేబినెట్ అభినందించింది. ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా 4,399 రోజుల పాటు బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. 1952 నుంచి 1964 వరకు వరుసగా 4,398 రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న గత రికార్డును ఆయన అధిగమించారు. దేశమే ప్రథమమన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న నాయకుడికి ప్రజలు అందించిన అపూర్వమైన మద్దతుకు ఈ ఘట్టం అద్దం పడుతోందని, భారత ప్రజాస్వామ్య చేతనకు, ప్రజా విశ్వాసానికి, ప్రజా భాగస్వామ్య శక్తికి ఇది ప్రతీక అని ఈ తీర్మానంలో కేబినెట్ పేర్కొన్నది.సైప్రస్ దేశాధ్యక్షుడి అధికారిక పర్యటన సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన
May 22nd, 09:31 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ 2026 మే 20 నుంచి 23 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేపట్టారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్‌కు సైప్రస్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడంతో ఇది మరింత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 18th, 05:00 am
ముందుగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం గోథెన్‌బర్గ్‌లో జరగడం నాకు సంతోషంగా ఉంది. ఈ నగరం ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినది. ఈ నగరం యూరప్ తయారీ రంగ స్ఫూర్తికి చిహ్నంగానూ నిలుస్తుంది.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని (ఈఆర్‌టీ) ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
May 17th, 12:12 am
గోథెన్‌బర్గ్‌లో 2026 మే 17న నిర్వహించిన 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' (ఈఆర్‌టీ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వోల్వో గ్రూప్ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపాకు చెందిన సీనియర్ పారిశ్రామిక ప్రముఖులు, ప్రముఖ యూరోపియన్- భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)
May 11th, 09:00 pm
ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది.. సాయుధ దళాలకు ప్రధానమంత్రి వందనం
May 07th, 10:23 am
ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించి ఈ రోజుకు ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా, సాయుధ దళాల ధైర్య సాహసాలకీ, కచ్చితత్వానికీ, దృఢసంకల్పానికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివాదం చేశారు.