ఘనా జాతీయ పురస్కారాన్ని అందుకున్న వేళ ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
July 03rd, 02:15 am
అధ్యక్షుల వారు ఘనా జాతీయ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’తో నన్ను గౌరవించడం నాకు అత్యంత గర్వకారణం కావడంతో పాటు గౌరవం కూడా.ఘనా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ప్రధానమంత్రి
July 03rd, 02:12 am
ఘనా జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞతకూ, ప్రపంచ స్థాయి నాయకత్వానికీ గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఘనా అధ్యక్షుడు డాక్టర్ జాన్ డ్రమానీ మహామా అందజేశారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయుల పక్షాన ప్రధానమంత్రి స్వీకరించారు. భారతదేశ యువత ఆకాంక్షలకూ, భారత్ సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు భిన్నత్వానికీ, అలాగే ఘనాకూ, భారత్‌కూ మధ్య గల చరిత్రాత్మక సంబంధాలకూ ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.