రూ.10,998.32 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో ఉత్తరప్రదేశ్‌లోని వరుణ నది ఒడ్డున ఎక్కి- దిగే మార్గాలు, వృత్తాకార మార్గాలతో కూడిన 6, 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
July 15th, 04:47 pm
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వరుణ నది వెంబడి ఉన్న ఎన్‌హెచ్-31, వారణాసి రింగ్ రోడ్డును కలుపుతూ 43.218 కిలోమీటర్ల పొడవైన అనుసంధాన కారిడార్ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధాన రహదారి, వంతెనలు, వృత్తాకార మార్గాలు, ఎక్కి-దిగే మార్గాలు, సర్వీసు రోడ్లతో 6,4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ఏఐ) నిర్మించనుంది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.10,998.32 కోట్లు కాగా.. సివిల్ నిర్మాణ పనులకు రూ.4,565.33 కోట్లు, భూసేకరణకు రూ.934.91 కోట్లు కేటాయించారు.ఉత్తర ప్రదేశ్‌లో రూ.7,145.14 కోట్ల మూలధన వ్యయంతో ఎన్‌హెచ్-34 కాన్పూర్- కబ్రాయ్ 4/6 లైన్ల యాక్సెస్- కంట్రోల్డ్ రహదారి నిర్మాణం
July 01st, 03:09 pm
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్-కబ్రాయ్ యాక్సెస్- కంట్రోల్డ్ నూతన రహదారి నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల కార్యక్రమం ద్వారా రూపుదిద్దుకుంటున్న భోపాల్-కాన్పూర్ ఎకనామిక్ కారిడార్‌లో ఈ రహదారి కీలకం కానుంది. ప్రస్తుతం ఇది 4 లైన్ల యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్‌గా నిర్మితమతున్నప్పటికీ, భవిష్యత్తులో దీనిని 6 లైన్లుగా విస్తరించడానికి వీలుగా దీనికి రూపకల్పన చేశారు. మొత్తం రూ.7,145.14 కోట్ల మూలధన వ్యయంతో వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), బీఓటీ టోల్ పద్ధతిలో అమలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త రహదారి నిర్మాణంతో పాటు ప్రస్తుత ఎన్‌హెచ్-34 లోని కాన్పూర్-కబ్రాయ్ విభాగం నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఎన్‌హెచ్ఏఐ చూసుకుంటుంది.