తమిళనాడులోని పరమకుడి - రామనాథపురం విభాగాన్ని (ఎన్‌హెచ్-87) రూ. 1853 కోట్ల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు క్యాబినెట్ ఆమోదం

July 01st, 03:13 pm

మధురై, పరమకుడి, రామనాథపురం, మండపం, రామేశ్వరం, ధనుష్కోటి మధ్య అనుసంధానం ప్రస్తుతం ఉన్న 2 వరుసల జాతీయ రహదారిపై, రాష్ట్ర రహదారులపై ఆధారపడి ఉంది. అధిక ట్రాఫిక్ వల్ల ఈ రహదారులన్నీ ఇరుకుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కీలక పట్టణాలతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించేందుకు పరమకుడి నుంచి రామనాథపురం వరకు దాదాపు 46.7 కి.మీ మేర జాతీయ రహాదారి-87ను నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఇది రద్దీని తగ్గించి, భద్రతను మెరుగుపరటమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరమకుడి, సత్తిరకుడి, అచుందన్వాయల్, రామనాథపురం పట్టణాల రవాణా అవసరాలను తీరుస్తుంది.