పూర్వ ప్రధానమంత్రి చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి.. ప్రధానమంత్రి నివాళులు
December 23rd, 09:39 am
పూర్వ ప్రధానమంత్రి, భారత్ రత్న చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల సంక్షేమం, వ్యవసాయ రంగ పురోగతి, రైతులకు సౌభాగ్యం .. ఈ ఆశయాల సాధనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ నిర్మాణానికి ఆయన అందించిన సేవలను, కృతజ్ఞులైన దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని శ్రీ మోదీ అన్నారు.