గుజరాత్‌లోని వడోదరాలో సర్దార్‌ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం ప్రసంగం
May 11th, 06:15 pm
ప్రజాదరణ పొందిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, కేంద్రమంత్రి, వ్యవస్థాపక ట్రస్టీ మన్‌సుఖ్ మాండవీయ, సర్దార్‌ధామ్ అధ్యక్షుడు గగ్జీ భాయ్ సుతారియా, దుష్యంత్ భాయ్ పటేల్, పంకజ్ భాయ్ పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ, వేదికపైనున్న గుజరాత్ మంత్రులు, దాతలు, ట్రస్టీలు, విశిష్ట అతిథులు, గుజరాత్ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదరీసోదరులందరికీ నమస్కారం.గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 11th, 06:00 pm
గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.భోపాల్‌లోని దేవి అహిల్యాబాయి మహిళా సశక్తీకరణ్ మహా సమ్మేళన్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 31st, 11:00 am
మధ్యప్రదేశ్ గవర్నర్ గౌరవనీయ శ్రీ మంగు భాయ్ పటేల్, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్, సాంకేతిక మాధ్యమాల ద్వారా పాలు పంచుకుంటున్న కేంద్ర మంత్రులు- ఇండోర్ నుంచి శ్రీ తో ఖాన్ సాహు, దాటియా నుంచి శ్రీ రామ్మోహన్ నాయుడు, సత్నా నుంచి శ్రీ మురళీధర్ మోహుల్, వేదికను అలంకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ జగదీష్ దేవ్డా, శ్రీ రాజేంద్ర శుక్లా, లోక్‌సభలో నా సహచరులు శ్రీ వి.డి.శర్మ, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీ సోదరులారా!లోకమాత దేవీ అహల్యా బాయి హోల్కర్ 300వ జన్మదినోత్సవ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళనంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 31st, 10:27 am
లోకమాత దేవి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భోపాల్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా 'మా భారతి'కి నివాళులు అర్పిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, భారత మహిళా శక్తి గొప్పతనాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, వారు ఈ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు లోకమాత దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమైన సందర్భం, జాతి నిర్మాణంలో గొప్ప ప్రయత్నాలకు మద్దతునిచ్చే క్షణంగా ఈ సందర్భాన్ని ప్రధానమంత్రి అభివర్ణించారు. దేవి అహల్యాబాయిని ఉటంకిస్తూ, నిజమైన పాలన అంటే ప్రజలకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడం అని ఆయన పునరుద్ఘాటించారు. నేటి కార్యక్రమం అహల్యాదేవి దార్శనికతను ప్రతిబింబిస్తూ, ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకువెళుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండోర్ మెట్రో ప్రారంభంతో పాటు, దాటియా, సత్నాలకు విమాన కనెక్టివిటీని జోడించడాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తాయని, అభివృద్ధిని వేగవంతం చేస్తాయని అలాగే కొత్త ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల ప్రారంభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.