మాదకద్రవ్య రహిత భారత్ సాధనలో పాలుపంచుకోవాలని 'మన్ కీ బాత్'లో పౌరులకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
August 30th, 11:30 am
ఈ నెల 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ, జాతీయ చేనేత దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఆగస్టు నెలలోని ముఖ్య సంఘటనలతో పాటు, రాబోయే జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి పండుగల గురించి, దేశభక్తి సంకల్పాన్ని బలోపేతం చేయడం, 'వోకల్ ఫర్ లోకల్' వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అటవీ సంరక్షణ, భారత చరిత్ర, పరిశుభ్రత, మహిళా సాధికారత వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26th, 10:22 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: వికసిత్ భారత్ దిశగా తదుపరి దశ కోసం ప్రధాని పిలుపు
August 15th, 12:51 pm
2047 నాటికి వికసిత్ భాతర్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. దేశ పనితీరు, ఆలోచన విధానం, ఆశయాల పరిధిలో మార్పు రావాలని కోరుతూ.. ప్రజలు, ప్రభుత్వాలు, పరిశ్రమలు, రైతులు, యువత, సమాజంలోని ఇతర వర్గాలు కలసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం
August 15th, 06:50 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది
August 15th, 06:45 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల శక్తి, సంకల్పంతో 2047 నాటికి వికసిత భారత్‌ను నిర్మించాలనే కల గురించి మాట్లాడారు. శాంతి చట్టం, రైల్వే విద్యుదీకరణ, భారతదేశ వాణిజ్య ఒప్పందాలు, నక్సలిజం అంతం వంటి కీలకమైన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 'శక్తి కీ సప్తధార'ను స్వీకరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం యువతకు గట్టిగా అండగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
August 02nd, 11:25 am
‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీసీ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, యువతను మాదకద్రవ్యాలనే ప్రాణాంతక ముప్పుకు దూరంగా ఉంచడమే ఈ ప్రచార లక్ష్యమని ఆయన నొక్కి చెప్పారు. యువతను భారతదేశపు అమృత తరం అని అభివర్ణిస్తూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ, ఈ ఉచ్చు నుండి యువతను కాపాడాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ రోజు తీసుకున్న ఈ ప్రతిజ్ఞ రాబోయే 100 వారాల పాటు కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ లో భాగంగా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
August 02nd, 11:00 am
వికసిత భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే ‘నషా ముక్త్ యువా’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 28,000 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన కోటిమందికి పైగా యువతకు ప్రధానమంత్రి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరిస్తూ, ఈ సమావేశాన్ని ఒక ప్రగాఢమైన జాతీయ ప్రతిజ్ఞగా అభివర్ణించారు. ఈరోజు మన దేశవాసులందరం ఒక గొప్ప, అత్యంత ముఖ్యమైన సంకల్పం కోసం ఏకమయ్యాం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త్ యువ’ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
August 01st, 04:04 pm
‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా యుక్త్ యువ’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించనున్నారు. యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచేలా ప్రేరేపించడం, వారి కమ్యూనిటీల్లో సానుకూల సామాజిక మార్పునకు యువత కృషి చేసేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.