'2047 నాటికి అందరికీ బీమా' లక్ష్యంతో ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తాం: ప్రధానమంత్రి
September 04th, 08:55 pm
అందరికీ ఆర్థిక భద్రత, ఆరోగ్య సేవలను అందించడం ప్రభుత్వ నిబద్ధతలో ఒక ప్రధాన అంశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణలలో జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు ఇచ్చిన గణనీయమైన పన్ను రాయితీలు ప్రతి పౌరుడికి వాటిని మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తెస్తాయి.