అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో రూ.14,105.83 కోట్ల వ్యయంతో 1200 ఎండబ్ల్యూ సామర్థ్యం గల కలై-II జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
April 08th, 04:28 pm
అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో లోహిత్ నదిపై రూ.14,105.83 కోట్ల వ్యయంతో 1200 ఎండబ్ల్యూ సామర్థ్యం గల కలై-II జల విద్యుత్ ప్రాజెక్టు (హెచ్ఈపీ) నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 78 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా.'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
March 29th, 11:30 am
ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.వికసిత భారతం సంకల్ప యాత్రలో మహిళలే ప్రధాన భాగస్వాములు
November 30th, 01:26 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో 10,000వ జనౌషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 20 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.