దమన్‌లో నమో ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి
June 05th, 10:25 pm
నేడు దమమన్‌లో నమో ఆసుపత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ ఆసుపత్రి... ఈ కేంద్రపాలిత ప్రాంతం, దీని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల వైద్య అవసరాలను తీర్చడంలో సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.మార్చి 7, 8 లలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్‌తో పాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
March 07th, 07:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 7, 8 లలో కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్ తోపాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఆయన మార్చి 7వ తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల వేళ సిల్‌వాసాకు చేరుకొని నమో ఆసుపత్రి ఒకటో దశ (NAMO Hospital)ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటల 45 నిమిషాలకు, సిల్‌వాసాలో కేంద్రపాలిత ప్రాంతానికి ఉద్దేశించిన రూ. 2580 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. దీని తరువాత ఆయన సూరత్‌కు వెళ్తారు. ఆయన సాయంత్రం సుమారు 5 గంటలకు సూరత్ ఆహార భద్రత విస్తృత ప్రచార ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. మార్చి 8న ప్రధాని నవ్‌సారీకి వెళ్తారు. ఉదయం దాదాపు 11 గంటల 30 నిమిషాలకు లఖ్‌పతి దీదీలతో (లక్షాధికారి సోదరీమణులు) భేటీ అయ్యి వారితో మాట్లాడతారు. తరువాత ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పథకాలను ప్రారంభించనున్నారు.