ఉత్తరప్రదేశ్‌లోని జాతీయ రహదారి- 19, వారణాసి రింగ్ రోడ్డు నడుమ

July 15th, 04:53 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా.. జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్ మధ్య గంగా నది తీరం వెంబడి సరికొత్త లింక్/కనెక్టర్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 46.039 కిలోమీటర్ల ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ‘మిశ్రమ వార్షిక చెల్లింపు విధానం (హ్యామ్)’లో చేపట్టనున్నారు. దీని మొత్తం వ్యయం రూ.14,447.64 కోట్లు కాగా.. ఇందులో సివిల్ నిర్మాణ పనుల కోసం రూ.6,037.85 కోట్లు (జీఎస్టీ మినహా ప్రజా సదుపాయాల మార్పిడి వ్యయం సహా), జాతీయ రహదారుల (ఓ) కింద భూసేకరణ కోసం రూ.541.11 కోట్లు కేటాయించారు. ఆరు వరుసల ఎత్తయిన ప్రధాన వాహన మార్గాన్నీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కేబుల్ వంతెననూ, అత్యాధునిక సాంకేతికతతో వాహనదారులూ పాదచారులిద్దరికీ సేవలందించే ప్రత్యేకమైన వంతెననూ, మెట్ల మార్గాలూ, ర్యాంపు మార్గాలూ, లింక్ రోడ్లనూ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు.

ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన

April 26th, 03:46 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం సుమారు 5 గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.