సిక్కింలోని నామ్చీలో సొరంగం కూలిన ఘటనలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
July 21st, 01:01 pm
సిక్కింలోని నామ్చీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.ఏప్రిల్ 27–28 తేదీల్లో సిక్కింలో ప్రధాని పర్యటన
April 26th, 03:47 pm
2026 ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిక్కింలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన గ్యాంగ్‌టక్ చేరుకుంటారు. ఏప్రిల్ 28న ఉదయం దాదాపు 9:30 గంటలకు గ్యాంగ్‌టక్‌లోని ఆర్కిడేరియాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. సిక్కిం రాష్ట్ర పర్యావరణ, పుష్ప వైభవాన్ని చాటేలా.. అత్యాధునిక, ప్రపంచ స్థాయి ఆర్కిడ్ అనుభూతి కేంద్రంగా స్వర్ణజయంతి మైత్రీ మంజరి పార్కును అభివృద్ధి చేశారు.