గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 25th, 10:22 am
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,గ్రేటర్ నోయిడాలో... ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శననుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 25th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.అధికారిక కార్యక్రమాల్లో పొందిన బహుమతుల ఆన్ లైన్ వేలంలో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని ఆహ్వానం
September 24th, 01:09 pm
తన అధికారిక కార్యాక్రమాలు, సమావేశాల సందర్భంగా స్వీకరించిన బహుమతుల వేలం ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వేలంలో పౌరులు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. గంగా నది సంరక్షణ, పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకం- నమామి గంగే.ఉత్తరాఖండ్‌లోని హర్శిల్‌లో శీతాకాల పర్యాటక కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 06th, 02:07 pm
ఈ వేదికపై ఆసీనులైన నా సోదరుడు, చురుకైన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామ్ గారు, కేంద్ర మంత్రి శ్రీ అజయ్ టమ్టాగారు, రాష్ట్ర మంత్రి సత్పాల్ మహరాజ్ గారు, పార్లమెంటులో నా సహ సభ్యులైన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు మహేంద్ర భట్ గారు, మాలా రాజ్యలక్ష్మిగారు, ఎమ్మెల్యే సురేష్ గారు, ఇతర ప్రముఖులు, సభకు హాజరైన సోదరీసోదరులారా!ఉత్తరాఖండ్ లోని హర్సిల్ లో శీతాకాల పర్యాటక కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 06th, 11:17 am
ఉత్తరాఖండ్ లోని హార్సిల్ లో ట్రెక్, బైక్ ర్యాలీని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... అనంతరం శీతాకాల పర్యాటక కార్యక్రమంలో పాల్గొన్నారు. మఖ్వా ప్రాంతంలోని శీతాకాలపు గంగామాత దర్శన ప్రాంతాన్ని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనా గ్రామంలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలు సంఘీభావంగా నిలుస్తున్నారని, ఇది బాధిత కుటుంబాలకు మనోనిబ్బరాన్ని అందిస్తుందని అన్నారు.బిహార్‌లోని భాగల్‌పూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
February 24th, 02:35 pm
ప్రపంచ ప్రఖ్యాత విక్రమశిల మహావిహారం ఉన్న, వసుపూజయ మహర్షి తపస్సు చేసిన, బాబా బుధనాథుని పవిత్ర భూమి, అంగ రాజు దాన వీర శూర కర్ణుడికి చెందిన ఈ ప్రాంత సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు!బీహార్ భాగల్పూర్ నుంచీ ‘పీఏం కిసాన్’ 19వ విడత నిధుల విడుదల సహా పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 24th, 02:30 pm
వ్యవసాయదారుల సంక్షేమమే పరమావధిగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పీఏం కిసాన్ పథకం 19వ విడత నిధులను బీహార్ భాగల్పూర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించారు. అంతర్జాలం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రధాని స్వాగతం పలికారు. మహాకుంభ్ పావన సందర్భంలో మందరాంచల్ ప్రాంతంలోకి అడుగు పెట్టడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, వారసత్వ సంపదలకు ఆలవాలమైన ఈ ప్రాంతం వికసిత్ భారత్ లక్ష్యానికి కూడా అనువైనదని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు తిల్కా మాంఝీ స్మృతికే గాక భాగల్పూర్ పట్టు నగరంగా కూడా ప్రసిద్ధి చెందిందన్నారు. బాబా అజ్గైబినాథ్ నడయాడిన పవిత్ర క్షేత్రంలో, రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు. ఇటువంటి శుభదినాల్లో పీఏం కిసాన్ 19వ విడత నిధులను విడుదల చేసే అదృష్టం తనకు దక్కిందని, సుమారు రూ. 22,000 కోట్ల సొమ్ము ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ అయ్యిందన్నారు.Maha Kumbh is a divine festival of our faith, spirituality and culture: PM in Prayagraj
December 13th, 02:10 pm
PM Modi inaugurated development projects worth ₹5500 crore in Prayagraj, highlighting preparations for the 2025 Mahakumbh. He emphasized the cultural, spiritual, and unifying legacy of the Kumbh, the government's efforts to enhance pilgrimage facilities, and projects like Akshay Vat Corridor and Hanuman Mandir Corridor.ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
December 13th, 02:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.ఏఐఐఏలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి అనువాదం
October 29th, 01:28 pm
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రివర్గ సహచరులు, శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, మన్సుఖ్ మాండవీయ, ప్రతాప్ రావ్ జాదవ్, శ్రీమతి అనుప్రియా పటేల్, శోభా కరంద్లాజే, ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తోన్న శ్రీ రామ్‌వీర్ సింగ్ బిధూరీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన వివిధ రాష్ట్రాల గవర్నర్లు, గౌరవ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆయుర్వేదాన్ని, ఆయుష్‌ను ప్రాక్టీస్ చేస్తున్నవారు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న నిపుణులు, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారికి, అఖిల భారత ఆయుర్వేద సంస్థకు చెందిన వైద్యులు, ఇతర సిబ్బందికి, సోదరసోదరీమణులారా!ఆరోగ్య రంగంలో రూ. 12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల ఆవిష్కరణ, ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 29th, 01:00 pm
ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా... ఈరోజు న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆరోగ్య రంగానికి సంబంధించి దాదాపు రూ.12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొన్నింటిని ప్రారంభించగా, మరికొన్నింటిని ఆవిష్కరించారు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.స్వచ్చతా హీ సేవ - 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం
October 02nd, 10:15 am
నేడు పూజ్య బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి. ఈ భరతమాత గొప్ప కుమారులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. గాంధీజీ, ఇతర మహనీయులు భారతదేశం కోసం కన్న కలను సాకారం చేసేందుకు కలిసి పనిచేయడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది.స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 02nd, 10:10 am
పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన సామూహిక ఉద్యమాల్లో ఒకటైన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ 155వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ స్వచ్ఛభారత్ దివస్ 2024 కార్యక్రమం నిర్వహించారు. అమృత్, అమృత్ 2.0, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోబర్‌ధన్ పథకాల కింద పలు ప్రాజెక్టులతో పాటు మొత్తం రూ. 9600 కోట్ల విలువైన అనేక పారిశుధ్య, పరిశుభ్రతా ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ‘స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత’ ఈ ఏడాది స్వచ్ఛతా హి సేవా నినాదం అని తెలిపారు.‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి
September 06th, 01:00 pm
‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్‌లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి
September 06th, 12:30 pm
‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్‌లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.Our govt is engaged in enhancing the capabilities of every poor, tribal, dalit & deprived person of country: PM
March 02nd, 03:00 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth Rs 21,400 crores in Aurangabad, Bihar. Addressing the gathering, the Prime Minister said that a new chapter of Bihar’s development is being written today on the land of Aurangabad which has given birth to many freedom fighters and great personalities such as Bihar Vibhuti Shri Anugrah Narayan.బీహార్‌లోని ఔరంగాబాద్‌లో రూ. 21,400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి
March 02nd, 02:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు బీహార్‌లోని ఔరంగాబాద్‌లో రూ. 21,400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, కొన్నిటిని జాతికి అంకితం చేశారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులలో రోడ్డు, రైల్వే, నమామి గంగే రంగాలు ఉన్నాయి. ప్రధాని ఫోటో గ్యాలరీని కూడా వీక్షించారు.ప్రధాన మంత్రితాను అందుకొన్న జ్ఞాపికల వేలంపాట లో పాల్గొనవలసింది గా పౌరుల ను ఉత్సాహపరచారు
October 27th, 01:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను అందుకొన్న జ్ఞాపిక ల వేలంపాట లో పౌరులు పాల్గొని, ఆ జ్ఞాపికల ను గెలుచుకోవడాని కి వారి వారి బిడ్ లను వేయవలసిందంటూ ఉత్సాహపరచారు. దీనిలో వచ్చే సొమ్ము ను నమామి గంగే కు ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.జాతీయ ఆధునిక చిత్రకళా గ్యాలరీలో ప్రధానికి వచ్చిన కానుకల ప్రదర్శన
October 02nd, 04:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో అందిన కానుకలు, జ్ఞాపికలతో న్యూఢిల్లీలోని జాతీయ ఆధునిక చిత్రకళా గ్యాలరీ (ఎన్‌జిఎంఎ)లో విస్తృత ప్రదర్శన ఏర్పాటైంది. దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని ప్రజలతో పంచుకున్నారు.Lokmanya Tilak was a great institution builder and a nurturer of traditions: PM Modi
August 01st, 12:00 pm
PM Modi was conferred the Lokmanya Tilak National Award in Pune. PM Modi described the honour bestowed on him by the place and institution directly linked with the Lokmanya as ‘unforgettable’. He dedicated the Lokmanya Tilak Award to the 140 crore citizens of India. He assured them that the government will leave no stone unturned to help them achieve their dreams and aspirations. The Prime Minister also donated the cash prize to the Namami Gange Project.