India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta
July 07th, 11:47 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
July 07th, 05:30 pm
ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.2026 వ సంవత్సరం జూన్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 135 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 28th, 11:30 am
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్‌కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.నెదర్లాండ్స్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందాలు... ఒడంబడికలు
May 17th, 02:47 am
భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక [2026-2030]నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ ఎటెన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక చర్చలు
May 17th, 02:35 am
ఈ సమావేశంలో భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, విశ్వాసంతోపాటు సమన్వయం, సహకారం ఇనుమడించడాన్ని ప్రతిబింబిస్తూ, ఈ స్నేహబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, అత్యాధునిక-కీలక సాంకేతికతలు, సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం, విద్యా రంగాల్లో సహకార విస్తృతి దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యంపై భవిష్యత్ ప్రణాళిక ఆమోదానికి నిశ్చయించారు. ఉభయ పక్షాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత-ఆవిష్కరణల భాగస్వామ్య విస్తరణ సహా భారత వృద్ధి ప్రస్థానం డచ్ కంపెనీలకు ఆశావహ వ్యాపార అవకాశాలను కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.వియత్నాం అధ్యక్షుడి అధికారిక భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
May 06th, 03:44 pm
ఐఆర్ఈఎల్ (భారత్), వియత్నాంకు చెందిన రేడియోధార్మిక - అరుదైన మూలకాల సాంకేతిక సంస్థ (ఐటీఆర్ఆర్ఈ) మధ్య పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందంగంగోత్రి నుండి గంగాసాగర్ వరకు... ప్రతిచోటా వికసిస్తున్న కమలం: బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి ప్రధాని మోదీ
May 04th, 07:01 pm
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో ఘన విజయాల అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ క్షణం చారిత్రాత్మకమైనదని, భావోద్వేగభరితమైనదని, ప్రజాస్వామ్యంపై, పనితీరు ఆధారిత పాలనపై నమ్మకానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు. ధోవతితో కూడిన సాంప్రదాయ బెంగాలీ దుస్తులలో కనిపించిన ప్రధాని, బెంగాల్‌తో తనకున్న గాఢమైన సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆ రాష్ట్రానికి లభించిన చారిత్రాత్మక తీర్పు యొక్క ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచారు.వివిధ రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగం
May 04th, 07:00 pm
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో ఘన విజయాల అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ క్షణం చారిత్రాత్మకమైనదని, భావోద్వేగభరితమైనదని, ప్రజాస్వామ్యంపై, పనితీరు ఆధారిత పాలనపై నమ్మకానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు. ధోవతితో కూడిన సాంప్రదాయ బెంగాలీ దుస్తులలో కనిపించిన ప్రధాని, బెంగాల్‌తో తనకున్న గాఢమైన సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆ రాష్ట్రానికి లభించిన చారిత్రాత్మక తీర్పు యొక్క ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచారు.మలేషియా ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి అధికారిక చర్చలు
February 08th, 11:19 am
ఈ రోజు పెర్దానా పుత్రా కాంప్లెక్స్‌లో మలేషియా ప్రధానమంత్రి గౌరవ దాతోసేరి అన్వర్ ఇబ్రహీం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సంప్రదాయ పూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక నివాసం సెరి పెర్దానాలో ప్రతినిధి బృందం స్థాయిలో చర్చలు జరిపారు.RJD and Congress are putting Bihar’s security and the future of its children at risk: PM Modi in Katihar, Bihar
November 03rd, 02:30 pm
In a massive public rally in Katihar, Bihar, PM Modi began with the clarion call, “Phir ek baar - NDA Sarkar, Phir ek baar - Susashan Sarkar.” He accused the RJD and Congress of risking Bihar’s security for votes and questioned whether benefits meant for the poor should be taken away by infiltrators. He remarked that under Nitish Ji’s leadership, NDA brought governance and growth, emphasizing that every single vote will play a role in building a Viksit Bihar.Be it Congress or RJD, their love is only for infiltrators: PM Modi in Saharsa, Bihar
November 03rd, 02:15 pm
Amidst the ongoing election campaigning in Bihar, PM Modi's rally spree continued as he addressed a public meeting in Saharsa. He said that only two days are left for the first phase of voting in Bihar. Many young voters here will be voting for the first time. He urged all first-time voters in Bihar, “Do not let your first vote go to waste. The NDA is forming the government in Bihar and your vote should go to the alliance that is actually winning. Your vote should be for a Viksit Bihar.”Massive public turnout as PM Modi campaigns in Saharsa and Katihar, Bihar
November 03rd, 02:00 pm
Amid the ongoing election campaign in Bihar, PM Modi continued his rally spree, addressing large public meetings in Saharsa and Katihar. He reminded people that only two days remain for the first phase of voting, noting that many young voters will be casting their vote for the first time. Urging them not to waste their first vote, he said, “The NDA is forming the government in Bihar. Your vote should go to the alliance that is actually winning - your vote should be for a Viksit Bihar.”మంగోలియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం
October 14th, 01:15 pm
ఆరేళ్ల అనంతరం మంగోలియా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం చాలా ప్రత్యేకమైన సందర్భం. భారత్, మంగోలియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 10 సంవత్సరాలైన వేళ ఈ పర్యటన చోటుచేసుకొంది. ఈ సందర్భంగా ఈ రోజున మేం ఒక సంయుక్త తపాలా బిళ్లను విడుదల చేశాం.. ఇది మన ఉమ్మడి వారసత్వం, వైవిధ్యం, నాగరికత పరమైన సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 04th, 10:45 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విదేశీ అతిథులు, టెలికాం రంగ ప్రముఖులు, వివిధ కళాశాలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా యువ మిత్రులు, సోదరీసోదరులారా!కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువత లక్ష్యంగా రూ.62,000 కోట్లకు పైగా విలువైన కార్యక్రమాలు ప్రారంభం
October 04th, 10:29 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువత అభివృద్ధి లక్ష్యంగా రూ. 62,000 కోట్లకు పైగా విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఐటీఐలతో అనుబంధం ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు, బీహార్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని సంవత్సరాల కిందటే ప్రభుత్వం ఐటీఐ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున స్నాతకోత్సవ వేడుకలను నిర్వహించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించిందని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఆ సంప్రదాయంలో మరో ముందడుగును సూచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.యువత పురోగతికి ఉద్దేశించిన వేర్వేరు కార్యక్రమాలను అక్టోబరు 4న ప్రకటించనున్న ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమాల విలువ రూ.62,000 కోట్లు
October 03rd, 03:54 pm
యువజనాభివృద్ధికి అండగా నిలిచే ఒక మహత్తర కార్యక్రమానికి నాందీప్రస్తావన జరగబోతోంది.. యువత పురోగతిపై దృష్టి సారించి రూ.62,000 కోట్ల కన్నా ఎక్కువ నిధులను ఖర్చు పెట్టే వివిధ కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 4న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమాలు దేశం నలుమూలలా విద్య బోధన, నైపుణ్య సాధనకు దోహదపడడంతో పాటు, వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయాలన్న తపనకు కూడా అండగా నిలుస్తాయి. ఇదే కార్యక్రమంలో, నేషనల్ స్కిల్ కాన్వొకేషన్ నాలుగో సంచిక ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’ను కూడా నిర్వహిస్తున్నారు. దీనిని ప్రధానమంత్రి దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించారు. దీనిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వ శాఖ ఆధీనంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో అఖిల భారత్ స్థాయి అగ్రగాములుగా నిలిచిన 46 మందిని సత్కరిస్తారు.బిహార్‌లోని భాగల్‌పూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
February 24th, 02:35 pm
ప్రపంచ ప్రఖ్యాత విక్రమశిల మహావిహారం ఉన్న, వసుపూజయ మహర్షి తపస్సు చేసిన, బాబా బుధనాథుని పవిత్ర భూమి, అంగ రాజు దాన వీర శూర కర్ణుడికి చెందిన ఈ ప్రాంత సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు!బీహార్ భాగల్పూర్ నుంచీ ‘పీఏం కిసాన్’ 19వ విడత నిధుల విడుదల సహా పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 24th, 02:30 pm
వ్యవసాయదారుల సంక్షేమమే పరమావధిగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పీఏం కిసాన్ పథకం 19వ విడత నిధులను బీహార్ భాగల్పూర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించారు. అంతర్జాలం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రధాని స్వాగతం పలికారు. మహాకుంభ్ పావన సందర్భంలో మందరాంచల్ ప్రాంతంలోకి అడుగు పెట్టడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, వారసత్వ సంపదలకు ఆలవాలమైన ఈ ప్రాంతం వికసిత్ భారత్ లక్ష్యానికి కూడా అనువైనదని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు తిల్కా మాంఝీ స్మృతికే గాక భాగల్పూర్ పట్టు నగరంగా కూడా ప్రసిద్ధి చెందిందన్నారు. బాబా అజ్గైబినాథ్ నడయాడిన పవిత్ర క్షేత్రంలో, రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు. ఇటువంటి శుభదినాల్లో పీఏం కిసాన్ 19వ విడత నిధులను విడుదల చేసే అదృష్టం తనకు దక్కిందని, సుమారు రూ. 22,000 కోట్ల సొమ్ము ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ అయ్యిందన్నారు.కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ 'హలా మోదీ 'లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
December 21st, 06:34 pm
నేను కువైట్‌కు వచ్చి కేవలం రెండున్నర గంటలు మాత్రమే అయింది. అయితే, నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతం అనే భావన, ఆత్మీయతా భావం నన్ను అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. మీరు అందరూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, కానీ మీ అందరినీ చూసినప్పుడు, నాకు ఒక మినీ భారత దేశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల నుంచి వేర్వేరు భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాను. అయినా, అందరి హృదయాలలో ఒకే విధమైన ప్రతిధ్వని వినిపిస్తోంది, అందరి హృదయాలలో ఒకే గొంతు మారుమోగుతోంది – భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై!కువైట్‌లో ‘హలా మోదీ’ కార్యక్రమం: భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 21st, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ నగరంలో షేక్ సాద్ అల్-అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ‘హలా మోదీ’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కువైట్‌లోని విభిన్న వర్గాలకు చెందిన భారత జాతీయులు హాజరయ్యారు.