సేవా సంకల్ప ప్రతిపాదన
February 24th, 04:53 pm
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ‘సేవా తీర్థ్’లోని ప్రధానమంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి వర్గ మొదటి సమావేశం జరుగుతుంది.సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 13th, 06:55 pm
నూతన చరిత్రకు ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షులం. విక్రమ సంవత్ 2082, ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి, శక సంవత్ 1947 మాఘ 24, నేటి సాధారణ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 13-ఈ శుభదినాన భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. మన శాస్త్రాల ప్రకారం, విజయ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తీసుకునే ఏ సంకల్పమైనా తప్పక ఫలిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ఇవాళ మనం సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లోకి అడుగుపెడుతున్నాం. మన లక్ష్య సాధనలో విజయమనే దైవిక ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయి. సేవా తీర్థ, నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, పీఎంఓ బృందానికి, కేబినెట్ సెక్రటేరియట్‌కు, వివిధ శాఖల ఉద్యోగులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లకు, కార్మికులకూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.న్యూఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 13th, 06:30 pm
న్యూఢిల్లీలో నేడు జరిగిన సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1,2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనమందరం ఒక కొత్త చరిత్ర సృష్టిని వీక్షిస్తున్నామని పేర్కొన్నారు. 2082 విక్రమ సంవత్సరం నాడు ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి శుభ సందర్భంగా మాఘ 24, ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం 2026 ఫిబ్రవరి 13న ఉన్న శక సంవత్సరం 1947న భారత్ తన అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త ఆరంభానికి సాక్షిగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రాల ప్రకారం విజయ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ రోజున తీసుకున్న సంకల్పం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుందని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పంతో మనమందరం నేడు సేవా తీర్థ్, కర్తవ్య భవన్‌లోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్యంలో విజయానికి దైవిక ఆశీస్సులు మనకు ఉన్నాయని ఆయన చెప్పారు. సేవా తీర్థ్, ఈ కొత్త భవనాల నిర్మాణానికి గానూ ప్రధానమంత్రి కార్యాలయ బృందానికి, మంత్రివర్గ సచివాలయం, వివిధ శాఖల ఉద్యోగులతో సహా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మిక మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.'నాగరికదేవో భవ' స్ఫూర్తితో 'సేవా తీర్థ్'ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి కర్తవ్యం, కరుణ, ఇండియా ఫస్ట్ దార్శనికత పట్ల నిబద్ధతకు చిహ్నంగా ‘సేవా తీర్థ్’
February 13th, 05:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సేవా తీర్థ్‌ను జాతికి అంకితం చేశారు. భారత ప్రజలకు సేవ చేయాలనే తన అచంచల సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ... 'నాగరికదేవో భవ' పవిత్ర స్ఫూర్తిని దానికి మార్గదర్శక శక్తిగా ప్రకటించారు.