ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద ప్రైవేట్ భాగస్వామికి దీర్ఘకాలిక లైసెన్స్ ద్వారా నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయ ఉన్నతీకరణ-ఆధునికీకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
May 13th, 03:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)తోపాటు మిహాన్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) సంస్థకు ఇచ్చిన భూమి లీజు కాలాన్ని 06.08.2039 తర్వాత కూడా పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. తద్వారా నాగ్‌పూర్ విమానాశ్రయాన్ని వాణిజ్య కార్యకలాపాల ఆరంభ తేదీ (సీఓడీ) నుంచి 30 ఏళ్ల పాటు ఒప్పంద సంస్థ ‘జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్’ (జీఎన్‌ఐఏఎల్)కు నిర్వహణ లైసెన్స్ కింద ‘ఎంఐఎల్’ అప్పగిస్తుంది.మే 10న కర్ణాటక, తెలంగాణలో పీఎం పర్యటన
May 09th, 11:17 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.నవీ ముంబైలో జరిగిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ శహీదీ సమాగమ్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి
March 01st, 06:28 pm
జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకాల్! నేడు 'హింద్ ది చాదర్' శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ జీ 350వ వర్థంతి సందర్బంగా భక్తితో ఆయన్ని స్మరించుకుందాం. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న వారందరికీ నా వందనాలు. ఈ చారిత్రాత్మక, పవిత్రమైన కార్యక్రమంలో భాగమవటం నా అదృష్టంగా భావిస్తున్నాను.PM Modi addresses 350th Shaheedi Samagam of Sri Guru Teg Bahadur Ji; highlights initiatives for the Sikh community and social unity
March 01st, 06:00 pm
PM Modi addressed the 350th Martyrdom Year (Shaheedi Samagam) of ‘Hind di Chadar’ Sri Guru Teg Bahadur Sahib Ji. Paying his respects, the PM stated that today we all remember the great Guru on this significant anniversary and expressed that it is a matter of great fortune to be part of such a historic and sacred event.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కర్మాగారం పేలుడులో ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
March 01st, 12:09 pm
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.అనువాదం: నయా రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ రజతోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 01st, 03:30 pm
గౌరవనీయులైన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ డేకా గారు, ప్రజాదరణ గల చైతన్యవంతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సీనియర్ సహచరులు జువల్ ఓరం గారు, దుర్గా దాస్ ఉయ్కే గారు, తోఖాన్ సాహు గారు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్ గారు.. ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో గారు, విజయ్ శర్మ జీ.. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఛత్తీస్‌గఢ్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా…ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 01st, 03:26 pm
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నేడు నవ రాయ్‌పూర్‌లో జరిగిన ఛత్తీస్‌గఢ్ రజత మహోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.కర్ణాటకలోని బెంగళూరులో వివిధ మెట్రో ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 10th, 01:30 pm
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారూ, కేంద్రంలోని నా సహచరులు మనోహర్ లాల్ ఖట్టర్ గారూ, హెచ్ డీ కుమారస్వామి గారూ, అశ్విని వైష్ణవ్ గారూ, వి. సోమన్న గారూ, శోభ గారూ, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ గారూ, కర్ణాటక మంత్రి బి. సురేశ్ గారూ, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ గారూ, ఎంపీ తేజస్వి సూర్య గారూ, డాక్టర్ మంజునాథ్ గారూ, ఎమ్మెల్యే విజయేంద్ర యడియూరప్ప గారూ, కర్ణాటక సోదర సోదరీమణులారా...కర్ణాటకలోని బెంగళూరు లో సుమారు రూ.22,800 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టుల ప్రారంభం...శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
August 10th, 01:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని బెంగళూరులో సుమారు రూ.7,160 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో యెల్లో లైన్‌ను ప్రారంభించారు. మరోపక్క రూ.15,610 కోట్లకు పైగా విలువైన బెంగళూరు మెట్రో 3వ దశ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కర్ణాటక నేలపై కాలుపెట్టగానే ఒక అనిర్వచనీయ అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కర్ణాటక సంస్కృతి వైభవం, ప్రజల స్నేహపూర్వకత, హృదయాన్ని హత్తుకునే కన్నడ భాష మాధుర్యాన్ని ప్రస్తావిస్తూ... శ్రీ మోదీ ముందుగా బెంగళూరుకు అధిష్ఠాన దేవత అన్నమ్మ తాయికి నమస్కరించారు. శతాబ్దాల క్రితం నాదప్రభు కెంపెగౌడ బెంగళూరు నగరానికి పునాది రాయి వేశారని గుర్తుచేసిన ప్రధానమంత్రి, సంప్రదాయాలతో మమేకమై అభివృద్ధి శిఖరాలను అధిరోహించే నగరాన్ని కెంపెగౌడ ఆనాడే ఊహించారని అన్నారు. “బెంగళూరు ఎల్లప్పుడూ ఆ భావాన్ని కొనసాగిస్తూ దాన్ని కాపాడుతూ వచ్చింది. ఈ రోజు ఆ కలను సాకారం చేసుకుంటోంది” అని ప్రధాని అన్నారు.పదమూడు జిల్లాల్లో మల్టిట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం.. ఈ జిల్లాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందినవి.. ఈ ప్రాజెక్టులతో సుమారు 574 కి.మీ. మేర విస్తరించనున్న భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్
July 31st, 03:13 pm
ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమై, దాదాపు రూ.11,169 కోట్ల వ్యయంతో రైల్వేల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన 4 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఇవీ..:హర్యానాలో హిసార్ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 11:00 am
నేను బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాను, మీరంతా రెండుసార్లు చెప్పండి - అమర్ రహే! అమర్ రహే! (దీర్ఘాయుష్షు! దీర్ఘాయుష్షు!)హిసార్లో రూ.410 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
April 14th, 10:16 am
దేశ ప్రజలందరికీ సురక్షిత, సౌలభ్య విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలన్న సంకల్పం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్యానాలోని హిసార్‌లో రూ.410 కోట్లపైగా వ్యయంతో నిర్మించే మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- హర్యానా ప్రజల శక్తిసామర్థ్యాలు, క్రీడాస్ఫూర్తి, సోదరభావం రాష్ట్రానికి ప్రతీకలుగా అభివర్ణిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ముమ్మర పంట కోతల వేళ కూడా పెద్ద సంఖ్యలో ఆశీర్వదించేందుకు వచ్చారంటూ ప్రజలకు తజ్ఞతలు తెలిపారు.నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిని సందర్శించిన ప్రధాని.. అంబేడ్కర్ దార్శనికతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన
March 30th, 12:02 pm
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ దార్శనికతకు కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
March 30th, 11:53 am
గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత గౌరవనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర గౌరవ ప్రముఖులు, ఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారా! ఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద ఎంతో ప్రత్యేకమైన రోజు. పవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వా, ఉగాది, నవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు ఝులేలాల్ జీ, గురు అంగద్ దేవ్ జీ జయంతి కూడా. ఇవే కాకుండా, ఈ రోజు మన స్ఫూర్తి ప్రదాత, అత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడా. అలాగే, ఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోంది. ఈ సందర్భంలో, ఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించి, గౌరవనీయ డాక్టర్ సాహెబ్, గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి దేశంలోని పౌరులందరికీ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే మా ప్రాధాన్యత: ప్రధాని
March 30th, 11:52 am
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి పండుగలు జరుగుతున్నాయన్న ఆయన.. భగవాన్ ఝులేలాల్, గురు అంగద్ దేవ్ జయంతి అయిన ఈ రోజు ప్రాముఖ్యతను ప్రధానంగా తెలియజేశారు. స్ఫూర్తిదాయకమైన డాక్టర్ కేబీ హెడ్గేవార్ జయంతి ఇవాళ అని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మహోన్నత ప్రయాణం శతాబ్ది కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన రోజున డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గోల్వాల్కర్ గురూజీలకు నివాళులు అర్పించటానికి స్మృతి మందిరాన్ని సందర్శించడం ఎంతో గౌరవంతో కూడుకున్న విషయమని అన్నారు.నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
March 30th, 11:48 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ కేబీ హెడ్గేవార్, ఎంఎస్ గోల్వాల్కర్‌లకు నివాళులు అర్పించారు.మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రధానమంత్రి పర్యటన
March 28th, 02:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు.Mahayuti in Maharashtra, BJP-NDA in the Centre, this means double-engine government in Maharashtra: PM Modi in Chimur
November 12th, 01:01 pm
Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing a public meeting in Chimur. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.PM Modi addresses public meetings in Chimur, Solapur & Pune in Maharashtra
November 12th, 01:00 pm
Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing multiple public meetings in Chimur, Solapur & Pune. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 09th, 01:09 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...