శ్రీ ఎన్.టీ రామారావు గారికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి

May 28th, 10:00 am

శ్రీ ఎన్.టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అంజలి ఘటించారు. ‘‘సమాజ సేవలోనూ, పేదల, నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి కారణంగా ఆయన ఎంతగానో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ వాఖ్యానించారు.