మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి పదకొండేళ్లు…: ప్రధానమంత్రి
September 25th, 01:01 pm
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ 11వ వార్షికోత్సవం ఈ రోజు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థలో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఈ కార్యక్రమం గొప్ప మార్పును తీసుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించి ఏడేళ్లయిందన్న ప్రధానమంత్రి
September 23rd, 12:52 pm
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఈ పథకం కోట్లాది మందికి నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఆర్థిక భద్రత, గౌరవాన్ని కల్పించటం ద్వారా ఆరోగ్య సేవలకు కొత్త నిర్వచనమిచ్చిందన్నారు.సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటన
September 16th, 02:49 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ధార్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ’ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పలు ఇతర కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతోపాటు ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.పదేళ్ల డిజిటల్ ఇండియా ప్రస్థానానికి ప్రధాని ప్రశంసలు
July 01st, 09:40 am
విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దశాబ్దం తర్వాత ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన, నవయుగ సాధికారతకు నాంది పలికిన ప్రయాణానికి మనం సాక్షులుగా నిలిచామని ప్రధాని పేర్కొన్నారు. ‘‘140 కోట్ల భారతీయుల సమష్టి సంకల్పంతో డిజిటల్ చెల్లింపుల్లో భారత్ గొప్ప పురోగతిని సాధించింది.’’జూన్ 20-21 తేదీల్లో ప్రధానమంత్రి బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటన
June 19th, 05:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 20-21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. జూన్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీహార్‌లోని శివాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.వన్యప్రాణుల సంరక్షణ పట్ల దేశ నిబద్ధతను ప్రముఖంగా చాటిన ప్రధానమంత్రి
March 03rd, 07:14 pm
ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వివిధ వన్యప్రాణుల సంరక్షణ పట్ల దేశం పూర్తి నిబద్ధత కలిగి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తెలిపారు. మైగవ్ఇండియా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్ట్ కు ప్రధానమంత్రి స్పందిస్తూ:పరీక్షల ఒత్తిడిని అధిగమించడంలో విజయం సాధించిన ఎగ్జామ్ వారియర్ల అనుభవాలను వినమని ప్రధానమంత్రి సూచన
February 17th, 07:41 pm
పరీక్షల ఒత్తిడిపై జయించిన ఎగ్జామ్ వారియర్లతో కూడిన ‘పరీక్షా పే చర్చా’ ప్రత్యేక కార్యక్రమం ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఒత్తిడిని జయించడం, ఆందోళనను అదుపులో ఉంచుకోవడం వంటి అంశాలు సహా కార్యక్రమంలో పాల్గొనే వారు పరీక్షలకు సంబంధించి తమ అనుభవాలను, వ్యూహాలను పంచుకుంటారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు సానుకూలతే ప్రధాన నేస్తం: ప్రధానమంత్రి
February 15th, 05:58 pm
పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సానుకూలతే ప్రధాన ఆయుధమవుతుందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్ అందరూ చూడాలని కోరారు.సాంకేతికత.. సుపరిపాలనల సామర్థ్య సద్వినియోగంతో గ్రామీణ భూ డిజిటలీకరణ ద్వారా ఇనుమడిస్తున్న గ్రామీణ సాధికారత: ప్రధానమంత్రి
January 18th, 10:54 am
గ్రామీణ భూ డిజిటలీకరణ ద్వారా గ్రామీణ సాధికారత మరింత ఇనుమడిస్తున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వ్యాఖ్యానించారు. ఈ దిశగా సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సుపరిపాలన సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు.గొప్ప మార్పులను తెచ్చే స్వామిత్వ పథకం: మరింత సమాచారాన్ని అందించిన ప్రధానమంత్రి
January 18th, 10:07 am
ఈ రోజు స్వామిత్వ పథకం గురించిన విస్తృత సమాచారాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.భారత ప్రతిభాశాలి యువత వివిధ రంగాల్లో గతంలో లేని స్థాయిలో వృద్ధికి తోడ్పడుతోంది: ప్రధానమంత్రి
January 04th, 04:14 pm
వివిధ రంగాల్లో భారతదేశం గొప్ప విజయాల్ని సాధిస్తుండడాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయాల ఖ్యాతి అంతా మన దేశ యువతీయువకుల్లోని శక్తీ, ప్రతిభలదే అని ఆయన అన్నారు.ఢిల్లీలో వీర బాల దినోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
December 25th, 01:58 pm
దేశ భవిష్యత్తుకు బాలలనే పునాదిగా చాటే దేశవ్యాప్త వేడుక అయిన వీర బాల దివస్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.మన యువ శక్తి అద్భుతాలు చేయగలదు: ప్రధాని
November 28th, 07:41 pm
భారత యువశక్తి అద్భుతాలు చేయగలదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. వారిలో ఉత్తేజం నింపడంలో, అన్ని అవకాశాలను అందించి వారు రాణించేలా చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.Prime Minister hails Make In India success story for global economic boost
July 16th, 10:28 pm
The Prime Minister, Shri Narendra Modi has hailed Make In India success story for global economic boost. Shri Modi has shared a glimpse of how Make In India is propelling India's economy onto the global stage.డిజిటల్ ఇండియా కార్యక్రమాని కి 9 సంవత్సరాలు పూర్తికావడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
July 01st, 01:49 pm
డిజిటల్ ఇండియా కార్యక్రమాని కి 9 సంవత్సరాల కాలం ఫలప్రదం గా పూర్తి అయిన సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం సశక్త భారతదేశాని కి ఒక సంకేతం గా ఉందని, ఇది ‘జీవించడాన్ని సులభతరం గా చేస్తోంది’ మరియు పారదర్శకత్వాన్ని ప్రోత్సహిస్తోంది అని ఆయన అభివర్ణించారు.బ్యాంకుల రంగం అభివృద్ధికి పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషిని ప్రశంసించిన ప్రధాన మంత్రి
June 19th, 08:03 pm
బ్యాంకుల రంగంలో సానుకూల ప్రగతిదాయక మార్పులకోసం పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషి మెచ్చతగినదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘనంగా ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు.నేశనల్ క్రియేటర్స్ అవార్డ్ పోటీ లోపాలుపంచుకోవలసింది గా ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
February 11th, 08:28 pm
‘‘మన సృజనకారుల సముదాయాని కి లభిస్తున్నటువంటి ఒక మహా అవకాశం ఇది, యావత్తు భారతదేశం లో నెలకొన్న అసాధారణమైన ప్రతిభావంతుల ను ఈ పోటీ వెలుగు లోకి తీసుకు రానుంది. మన యువ శక్తి ప్రతినిధులు.. వారు నూతన ఆవిష్కర్తలు కావచ్చు, లేదా ప్రేరణ ను ఇచ్చేటటువంటి వారు కావచ్చు, లేదా మార్పు ను తీసుకు వచ్చేటటువంటి వారు కావచ్చు.. వారి ని మనం సత్కరించుకొందాం.డిసెంబరు 26 వతేదీ న ‘వీర్ బాల్ దివస్’ ను జరుపుకోవడం లో భాగం గా ఏర్పాటైన కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి
December 25th, 04:17 pm
‘వీర్ బాల్ దివస్’ సందర్భం లో 2023 డిసెంబరు 26 వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకోనున్నారు. ఇదే సందర్భం లో ప్రధాన మంత్రి దిల్లీ లో యువత పాల్గొనే ఒక మార్చ్-పాస్ట్ కు కూడా ప్రారంభ సూచక జెండా ను చూపెడతారు.ప్రభుత్వ పథకాలు దీపావళి సందర్భం లో ప్రతి ఒక్కకుటుంబాని కి సంతోషాన్ని ఇస్తున్నాయి: ప్రధాన మంత్రి
November 10th, 03:03 pm
ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక పథకాలు దీపావళి సందర్భం లో ప్రతి ఒక్క కుటుంబాని కి సంతోషాన్ని ప్రసాదిస్తున్నాయి అనే సంతృప్తి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.2023 వ సంవత్సరం సెప్టెంబర్ 24 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 105 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 24th, 11:30 am
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం! 'మన్ కీ బాత్' మరొక భాగంలో దేశం సాధించిన విజయాలను, దేశప్రజల విజయాలను, వారి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈ రోజుల్లో నాకు వచ్చిన ఉత్తరాలు, సందేశాలు చాలా వరకు రెండు విషయాలపై ఉన్నాయి. మొదటి అంశం చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం, రెండవ అంశం ఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడం. దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, సమాజంలోని ప్రతి వర్గం నుండి, అన్ని వయసుల వారి నుండి నాకు లెక్కపెట్టలేనన్ని లేఖలు వచ్చాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై దిగే సంఘటనలో ప్రతి క్షణాన్ని కోట్లాది మంది ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా ఏకకాలంలో చూశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యూట్యూబ్ లైవ్ ఛానెల్‌లో 80 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సంఘటనను వీక్షించారు. అందులోనే ఇదొక రికార్డు. చంద్రయాన్-3తో కోట్లాది మంది భారతీయుల అనుబంధం ఎంత గాఢంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. చంద్రయాన్ సాధించిన ఈ విజయంపై దేశంలో చాలా అద్భుతమైన క్విజ్ పోటీ జరుగుతోంది. ఈ ప్రశ్నల పోటీకి 'చంద్రయాన్-3 మహాక్విజ్' అని పేరు పెట్టారు. మై గవ్ పోర్టల్ ద్వారా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. మై గవ్ పోర్టల్ ను ప్రారంభించిన తర్వాత రూపొందించిన క్విజ్‌లలో పాల్గొన్నవారి సంఖ్యాపరంగా ఇదే అతిపెద్దది. మీరు ఇంకా ఇందులో పాల్గొనకపోతే ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇంకా కేవలం ఆరు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ క్విజ్‌లో తప్పకుండా పాల్గొనండి.