న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
January 28th, 04:00 pm
కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌జీ, వేదికపై ఉన్న అతిథులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, శకటాల కళాకారులు, రాష్ట్రీయ రంగశాల ఉద్యోగులు, నా యువ మిత్రులు.. మీ అందరి కృషి ఇక్కడ కనిపిస్తోంది. మంచి సమన్వయంతో మీరు చక్కటి ప్రదర్శన ఇచ్చారు.ఢిల్లీలో జరిగిన వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 28th, 03:30 pm
ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు నిర్వహించిన వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ కేడెట్లు, నాటక కళాకారులు, జాతీయ రంగశాల కళాకారులు, దేశంలోని వివిధ ప్రాంతాల యువ ప్రతినిధుల కృషి.. సమన్వయంతో కూడిన ఈ ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. నేటి ఉదయం మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ గారితోపాటు కొందరు సహచరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దేశానికి ఎంతో శోకాన్ని మిగిల్చిందని ఆవేదన చెందారు. మహారాష్ట్రతోపాటు దేశాభివృద్ధిలో అజిత్ దాదా విశేష కృషి చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలోనూ, అక్కడకు వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు, ముఖ్యంగా మిత్ర దేశాల నుంచి వచ్చిన వారికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది బాలికల భాగస్వామ్యం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి ఓటరుగా నమోదవ్వడం ఒక వేడుకగా పేర్కొన్న ప్రధాని, మై-భారత్ వాలంటీర్లకు లేఖ
January 25th, 10:24 am
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశ పౌరులందరికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.జూన్ 20-21 తేదీల్లో ప్రధానమంత్రి బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పర్యటన
June 19th, 05:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 20-21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. జూన్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీహార్‌లోని శివాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రధానమంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 30th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-Governance is not a platform for nautanki: PM slams AAP-da after BJP sweeps Delhi
February 08th, 07:00 pm
In a landmark victory, the BJP emerged victorious in the national capital after 27 years. Addressing enthusiastic Karyakartas at the BJP headquarters, PM Modi hailed the triumph as a win for development, vision and trust. “Today, the people of Delhi are filled with both enthusiasm and relief. The enthusiasm is for victory, and the relief is from freeing Delhi from the AAP-da”, PM Modi declared, emphasising that Delhi has chosen progress over an era of chaos.PM Modi addresses BJP Karyakartas at Party Headquarters after historic victory in Delhi
February 08th, 06:30 pm
In a landmark victory, the BJP emerged victorious in the national capital after 27 years. Addressing enthusiastic Karyakartas at the BJP headquarters, PM Modi hailed the triumph as a win for development, vision and trust. “Today, the people of Delhi are filled with both enthusiasm and relief. The enthusiasm is for victory, and the relief is from freeing Delhi from the AAP-da”, PM Modi declared, emphasising that Delhi has chosen progress over an era of chaos.రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం
February 06th, 04:21 pm
భారత్ సాధించిన విజయాలను, భారత్ పట్ల ప్రపంచ అంచనాలను, 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణం కోసం దేశంలోని సామాన్యుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంకల్పాన్ని గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎంతో చక్కగా వివరించారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా సాగిన వారి ప్రసంగం మనందరికీ భవిష్యత్ కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఈ సందర్భంగా గౌరవనీయ రాష్ట్రపతి ప్రసంగానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
February 06th, 04:00 pm
పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చ అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, భారత్‌పై ప్రపంచం అంచనాలు, వికసిత భారత్ సంకల్ప సాకారంలో సామాన్యుల ఆత్మవిశ్వాసంవగైరాలను రాష్ట్రపతి ప్రసంగం విశదీకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో స్ఫూర్తిదాయకం, ప్రభావవంతమైన ఈ ప్రసంగం భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేసేదిగా ఉందని అభివర్ణించారు. ఇంతటి ఉత్తేజకర ప్రసంగం చేసినందుకుగాను రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.ఢిల్లీలోని కరియప్ప పెరేడ్ మైదానంలో ఎన్‌సిసి ర్యాలీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రిమండలిలోని నా సహచరులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ సంజయ్ సేథ్, ‘సిడిఎస్’ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ కార్యదర్శి గారు, ‘ఎన్‌సిసి’ డీజీగారు, ఇతర అతిథులు నా ప్రియ ‘ఎన్‌సిసి’ యువ మిత్రులారా!వార్షిక ‘ఎన్‌సిసి పిఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 04:30 pm
దేశ రాజధాని ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ నిర్వహించిన వార్షిక ‘నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సిసి) పీఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించడంతోపాటు ఉత్తమ కేడెట్లకు పురస్కార ప్రదానం చేశారు. ‘ఎన్‌సిసి దినోత్సవం’ నేపథ్యంలో సభికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ- 18 మిత్రదేశాల నుంచి దాదాపు 150 మంది కేడెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారందరినీ స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ‘మేరా యువ భారత్’ (మై భారత్) పోర్టల్ ద్వారా దేశం నలుమూలల నుంచి ఆన్‌లైన్‌లో పాల్గొన్న యువతను కూడా ఆయన అభినందించారు.గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే ‘ఎన్‌సిసి’.. ‘ఎన్‌ఎస్‌ఎస్’ కార్యకర్తలతో ప్రధానమంత్రి సంభాషణ
January 25th, 03:30 pm
సర్... మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలన్న నా కల ఈ రోజు నెరవేరింది‘ఎన్‌సిసి’ కేడెట్లు.. ‘ఎన్‌ఎస్‌ఎస్’ వలంటీర్లు.. గిరిజన అతిథులు.. శకట కళాకారులతో ప్రధానమంత్రి మాటామంతీ
January 25th, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న (జనవరి 24న) గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ‘ఎన్‌సిసి’ కేడెట్లు, ‘ఎన్‌ఎస్‌ఎస్’ వలంటీర్లు, గిరిజన అతిథులు, శకట కళాకారులతో ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోగల తన నివాసంలో ముచ్చటించారు. దేశ ప్రధానిని ప్రత్యక్షంగా కలుసుకోవడంపై వారంతా ఎంతో సంతోషం ప్రకటించగా- “ఇది భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు.ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, గిరిజన ప్రతినిధులు, శకటాల కళాకారులతో ప్రధాని సంభాషణ
January 24th, 08:08 pm
త్వరలో జరగబోతున్న గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, గిరిజన ప్రతినిధులు, శకటాల కళాకారులతో లోకకల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సంభాషించారు. అనంతరం భారతదేశ సంస్కృతి, వైవిధ్యాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 23rd, 11:30 am
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయనను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. సుభాష్ బాబుకు వినమ్ర పూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన జన్మస్థలంలో ఈ ఏడాది పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశా ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. నేతాజీ జీవిత విశేషాలను వివరించేలా భారీ ప్రదర్శనను కూడా కటక్ లో ఏర్పాటు చేశారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న అనేక వారసత్వ స్మారకాలను భద్రపరిచి ఈ ప్రదర్శనకు ఉంచారు. అనేకమంది చిత్రకారులు బోస్ జీవిత విశేషాలకు కాన్వాస్ పై చిత్రరూపమిచ్చారు. వీటన్నింటితో పాటు సుభాష్ బాబుకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా సేకరించారు. నేతాజీ ఈ ఘనమైన జీవిత ప్రస్థానం నా యువ భారతానికీ, నా భారతదేశానికి కొత్త శక్తిని అందిస్తాయి.పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం
January 23rd, 11:25 am
పరాక్రమ దివస్‌గా నిర్వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను యావత్ దేశం సగౌరవంగా స్మరించుకుంటోందని అన్నారు. నేతాజీ సుభాష్ బోస్‌కు నివాళులు అర్పిస్తూ, ఈ ఏడాది పరాక్రమ దివస్ ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన ఒడిశాలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేతాజీ జీవితం ఆధారంగా ఒడిశాలోని కటక్‌లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఎంతో మంది చిత్రకారులు నేతాజీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను కాన్వాస్‌పై చిత్రించారని అన్నారు. అలాగే నేతాజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను సైతం సేకరించినట్లు ఆయన తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఈ పరిణామాలు మేరీ యువ భారత్ లేదా మై భారత్‌కు కొత్త శక్తిని ఇస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ‘వికసిత భారత్ యువ నాయక చర్చాగోష్ఠి-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 02:15 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీమన్సుఖ్ మాండవీయ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ జయంత్ చౌదరి, శ్రీమతి రక్షా ఖడ్సే, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు సహా దేశం నలుమూలల నుంచి హాజరైన నా యువ మిత్రులారా!‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 12th, 02:00 pm
స్వామి వివేకానంద జయంతిని స్మరించుకొంటూ పాటించే జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 3,000 మంది చురుకైన యువ నాయకులతో ఆయన మాట్లాడారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మన దేశంలో యువతలో గొప్ప హుషారైన శక్తి నిండి ఉందంటూ, ఈ శక్తి భారత్ మండపానికి జవ జీవాలనిచ్చిందన్నారు. దేశ యువతపై అపార నమ్మకం పెట్టుకొన్న స్వామి వివేకానందను యావత్తు జాతి స్మరించుకొంటూ, ఆయనకు నివాళులు అర్పిస్తోందని ప్రధాని అన్నారు. స్వామి వివేకానంద తన శిష్యులు యువతరం నుంచే వస్తారనీ, వారు ప్రతి ఒక్క సమస్యనూ సింహాల్లా పరిష్కరిస్తారని నమ్మారనీ శ్రీ మోదీ అన్నారు. యువతపై స్వామీజీ నమ్మకాన్ని ఉంచినట్లే స్వామీజీ పట్లా, ఆయన విశ్వాసాల పట్లా తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ప్రధాని తెలిపారు. ఆయననూ, ప్రత్యేకించి యువత విషయంలో ఆయనకున్న దృష్టి కోణాన్నీ తాను పూర్తిగా నమ్మినట్లు ప్రధానమంత్రి చెప్పారు. స్వామి వివేకానంద ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే, 21వ శతాబ్ది యువజనంలో శక్తి జాగృతమై, వారు చేస్తున్న చురుకైన ప్రయత్నాలను చూసి స్వామి వివేకానందలో ఒక కొత్త విశ్వాసం తొణికిసలాడేదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.ఢిల్లీలో వీర బాల దినోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
December 25th, 01:58 pm
దేశ భవిష్యత్తుకు బాలలనే పునాదిగా చాటే దేశవ్యాప్త వేడుక అయిన వీర బాల దివస్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.Maharshi Dayananda was not just a Vedic sage but also a national sage: PM Modi
February 11th, 12:15 pm
PM Modi addressed a programme on the 200th birth anniversary of Swami Dayananda Saraswati. He remarked, There are moments in history that alter the course of the future. Two hundred years ago, Swami Dayananda's birth was one such unprecedented moment.