జీ7 సదస్సు నేపథ్యంలో యూకే ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
June 17th, 12:36 am
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైపాక్షిక సమావేశం నిర్వహించారు.Prime Minister expresses grief over loss of lives due to a tragic mishap in Solapur Rural, Maharashtra
June 14th, 11:40 am
The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the loss of lives due to a tragic mishap in Solapur Rural, Maharashtra.ప్రధానమంత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ
May 28th, 01:59 pm
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు.సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారత అధికారిక పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
May 22nd, 04:11 pm
ఉగ్రవాద నిరోధంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందంమెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత్, వియత్నాం దేశాల సంయుక్త ప్రకటన
May 06th, 05:24 pm
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, వియత్నాం దేశాధ్యక్షుడు శ్రీ తో లామ్ 2026 మే 05 నుంచి మే 07 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈయనతో పాటు ఒక ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం వచ్చింది. వీరితో పాటు వ్యాపార ప్రతినిధుల బృందం కూడా పర్యటనలో పాల్గొంది.మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 09:14 am
నేడు మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
April 26th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం సుమారు 5 గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
April 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.నౌకానిర్మాణం, షిప్పింగ్, నౌకా రవాణాపై భాగస్వామ్యానికి భారత్-ఆర్‌వోకే సమగ్ర విధానం
April 20th, 10:51 pm
భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా కొరియా రిపబ్లిక్ (ఆర్‌వోకే) అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యుంగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో 2026 ఏప్రిల్ 20న సమావేశమయ్యారు. ఈ చర్చల్లో నౌకా నిర్మాణం, షిప్పింగు, నౌకా రవాణా భాగస్వామ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై ఉభయపక్షాలు ఫలవంతమైన, విస్తృతమైన ఆలోచనలను పంచుకున్నాయి.కోటా ఎయిర్‌పోర్ట్ భూమిపూజ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
March 07th, 03:15 pm
వారం కిందటే.. రాజస్థాన్‌ను సందర్శించే అవకాశం నాకు లభించింది. పవిత్రమైన అజ్మేర్ నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. శంకుస్థాపనలు చేశాం. అదే కార్యక్రమంలో 21,000 మందికి పైగా రాజస్థాన్ యువతకు నియామక పత్రాలను అందించాం. అజ్మేర్ పర్యటన చేపట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోటాలో ముఖ్యమైన విమానాశ్రయ ప్రాజెక్టు పనులను ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. ఒక వారంలోనే రాజస్థాన్‌లో ప్రారంభమైన ఈ రెండు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు శక్తిమంతమైన సందేశాన్నిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ ఎంత వేగంగా పురోగతి సాధిస్తుందో ఇవి చూపిస్తున్నాయి. అది మౌలిక వసతులు, యువతకు ఉద్యోగావకాశాలు, రైతులు, మహిళలకు పథకాలైనా లేదా ప్రతి రంగంలోనూ చేపడుతున్న కార్యక్రమాలైనా రాజస్థాన్లో వేగంగా పని జరుగుతోంది.కోటా విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాని.. సమగ్రాభివృద్ధితో హడోటీ ప్రాంత రూపురేఖలు మారుతున్నాయన్న శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
హడోటీ ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న కోటా విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమాన్నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్ నేడు అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ నిర్మించబోతున్న కొత్త విమానాశ్రయం ఈ ప్రాంత ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి బలమైన చోదక శక్తిగా నిలవబోతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.ఇండియా-కెనడా సీఈఓ ఫోరమ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
March 02nd, 02:30 pm
ఇండియా-కెనడా సీఈఓ ఫోరమ్‌లో మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి కార్నీ సానుకూల ఆలోచనలను పంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కర్మాగారం పేలుడులో ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
March 01st, 12:09 pm
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.భారత్‌లో కెనడా ప్రధానమంత్రి పర్యటన
February 26th, 10:40 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకున్న కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నీ భారత్‌లో పర్యటనకు రానున్నారు. ఆయన 2026 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు భారత్‌లో అధికార పర్యటనలో ఉంటారు. ప్రధాని శ్రీ కార్నీ భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటి సారి.ముంబైలో భారత్-ఫ్రాన్స్ ఇన్నొవేషన్ ఫోరమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 18th, 12:07 pm
ప్రపంచంలోని రెండు అద్భుత ఆవిష్కరణ కూడళ్ల సంగమం ఇవాళ ఇక్కడ ఆవిష్కృతమైంది. భారత్, ఫ్రాన్స్ దేశాల ప్రస్తావన వచ్చినపుడు మన బంధం ఆవిష్కరణలకు మాత్రమేగాక.. పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలకు సంబంధించినదిగా ఉంటుంది. ఈ స్ఫూర్తితోనే 2026ను భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల ఏడాదిగా నిర్వహించాలని అధ్యక్షుడు మాక్రాన్, నేను సంకల్పించాం. ఇదొక వేడుకకు కాదు... ఇది మా సంయుక్త కట్టుబాటు- ఆవిష్కరణలకు కర్తవ్య సహిత నాయకత్వ నిబద్ధత!భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
February 18th, 08:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లివచ్చారు.ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడి భారత్ పర్యటనలో ముఖ్య ఫలితాలు
February 17th, 07:00 pm
భారత్-ఫ్రాన్స్ సంబంధాలను “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి పెంచడంఫ్రాన్స్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
February 17th, 04:00 pm
ముంబయికి నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు మాక్రోన్‌ను స్వాగతించడం నాకు అమితానందాన్ని కలిగిస్తోంది. గతేడాది, ఏఐ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన నన్ను ఫ్రాన్స్‌కు ఆహ్వానించారు.Prime Minister Welcomes French President to India, Emphasises Strengthening Bilateral Ties
February 17th, 09:57 am
PM Modi extended a warm welcome to French President Emmanuel Macron, expressing confidence that the visit will elevate India–France relations to new heights. The PM noted that the engagements in Mumbai and later in Delhi will provide fresh momentum to the strategic partnership between the two nations, benefiting not only both countries but also the wider global community.ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌ను ఫిబ్రవరి 17న కలుసుకోనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 16th, 09:02 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 17న ముంబయికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌తో సమావేశమవుతారు.